TET exams
-
ప్రారంభమైన తెలంగాణ టెట్ పరీక్షలు
-
టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష..
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం టెట్ అభ్యర్థుల వడపోతకు దిగింది. టెట్ పరీక్షలు రాయకుండా ఆది నుంచే వడపోత చేపట్టింది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టెట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సెంటర్లను మార్చేసింది. బీఈడీ, డీఈడీల అర్హతలు ఉన్నవారికి, డీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హతలు గల అభ్యర్థులు ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్నా.. రెండు పేపర్లకు వేర్వేరు జిల్లాల్లో సెంటర్లు ఇచ్చి ఒక పేపర్ రాసే అవకాశాన్ని లేకుండా చేసి వారికి అగ్ని పరీక్ష పెట్టింది. ఫిబ్రవరిలో గత ప్రభుత్వం టెట్ పరీక్ష పూర్తి చేయగా.. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం టెట్–2024 (జూలై) పేరుతో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) విభాగంలో పేపర్–1(ఏ)కి 1,82,609 మంది, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–1(బీ)కి 2,662 మంది, స్కూల్ అసిస్టెంట్ పేపర్–2(ఏ) లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా, సోషల్ స్టడీస్‌లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–2(బి)కి 2438 దరఖాస్తులు అందాయి. వీరిలో చాలా మంది రెండు పేపర్లకు అర్హత గలవారు ఉన్నారు. అయితే, పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21 నుంచి జారీ చేసిన హాల్ టికెట్లు చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. రెండు పేపర్లకు ఒకే జిల్లా, ఒకే సెంటర్‌ను ఆప్షన్‌గా ఇస్తే ఒక్కో పేపర్‌కు సెంటర్‌తో పాటు జిల్లాలను కూడా మార్చేశారు. మరికొందరికి రాష్ట్రాన్నే మార్చేసి బెంగళూరులో సెంటర్ కేటాయించడం విద్యాశాఖ మాయాజాలానికి నిదర్శనం.జిల్లాలు దాటి సెంటర్ల కేటాయింపు ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కాలేజీలు, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఉన్న సెంటర్లలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21న సాయంత్రం నుంచి ఆన్లైన్లో ఉంచింది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రెండు పరీక్షల హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని చూస్తే రెండు పరీక్షలకు వేర్వేరు సెంటర్లు ఉండడం చూసి హతాశులయ్యారు. ఏలూరు జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పేపర్–1, పేపర్–1బీ జిల్లా కేంద్రాంలోనే రాయాల్సి ఉన్నా.. ఇద్దరికి ఉదయం ఏలూరులోను మధ్యాహ్నం పేపర్–1బి కాకినాడలోను సెంటర్ ఇచ్చారు. మరొకరికి రెండో పేపర్‌ను విజయవాడలో సెంటర్ ఇచ్చారు. గత నెలలో విద్యాశాఖ ‘దరఖాస్తు ఎడిట్’ అవకాశం ఇవ్వడంతో మీడియం ‘తెలుగు’ అని మార్చినా హాల్‌టికెట్‌లో మాత్రం ‘ఇంగ్లిష్’ అనే ఇచ్చారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇప్పుడు ఇంగ్లిష్‌లో పేపర్ ఎలా రాయగలమని ఆందోళన చెందుతున్నారు.నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యమాఏపీ టెట్ నిర్వహణలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పరీక్ష సెంటర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్నా వందల కిలోమీటర్ల దూరంలోని మరో జిల్లాలో కేటాయించారు. అలాగే పేపర్–1ఏ ఒక జిల్లాలోను, పేపర్–1బీ మరో జిల్లాలో సెంటర్లు కేటాయించడంలో అంతర్యం ఏమిటి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలోనే సెంటర్లు ఇచ్చేలా మార్పులు చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడియం అని హాల్ టికెట్లో ఇవ్వడంతో అనేకమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి మరోసారి ‘ఎడిట్’ అవకాశం కల్పించి న్యాయం చేయాలి. – ఎ.రామచంద్ర, ఏపీ నిరుద్యోగ ఐక్య సమితి – ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిశెట్టి వెంకట మహేష్‌బాబు ఎస్జీటీకి పేపర్–1ఏ రాయాల్సి ఉంది. ఈ అభ్యర్థికి కేంద్రం ఒంగోలులో కాకుండా 110 కి.మీ. దూరంలోని గుంటూరు జిల్లాలో సెంటర్ ఇచ్చారు. – తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీహెచ్.దినేష్ అనే అభ్యర్థికి విజయవాడలో సెంటర్ కేటాయించారు. – అనంతపురం జిల్లాకు చెందిన దాసప్పగారి సింధూజ స్కూల్ అసిస్టెంట్ పేపర్–2ఏ (మ్యాథమెటిక్స్, సైన్స్) పేపర్ రాసేందుకు తెలుగు మీడియం ఆప్సన్ ఇచ్చారు. కానీ.. హాల్ టికెట్లో మాత్రం ఇంగ్లిష్ మీడియం అని ఇచ్చారు.– ఏలూరు జిల్లాకు చెందిన కె.భువనేశ్వరి ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 6న రెండు పేపర్లు రాయాలి. రెండు పరీక్షలకు ఏలూరు సెంటర్ ఇస్తే.. ఉదయం జరిగే పరీక్ష ఏలూరులోను, మధ్యాహ్నం పరీక్ష ఏలూరుకు సుమారు 155 కి.మీ. దూరంలోని కాకినాడలోను సెంటర్ కేటాయించారు. ఇదే జిల్లాకు చెందిన పి.జయలక్ష్మికి కూడా ఏలూరు, కాకినాడ సెంటర్లను ఒకేరోజు రెండు పరీక్షలకు కేటాయించారు. -
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్‌కుమార్ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు.. ► మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. ► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్–టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ DSC https:// apdsc. apcfss. in/ వెబ్సైట్లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. -
రేపట్నుంచే ఏపీలో టెట్ పరీక్షలు
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 6వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో టెట్ పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది. పొద్దున 9గం.30. నుంచి 12గం. దాకా.. అలాగే మధ్యాహ్నాం 2గం.30ని. నుంచి సాయంత్రం 5గం. దాకా మరో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉండనుంది. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం గమనార్హం. తెలంగాణాలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్ అధికారుల్ని నియమించారు. పరీక్షా కేంద్రాల తనిఖీలకి 29 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. గర్బిణీ అభ్యర్ధులకి సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇక.. విద్యాశాఖ ముందస్తుగానే రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ.. 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
త్వరలోనే టెట్ పరీక్ష : జగదీష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా వైద్యం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని.. నాణ్యమైన విద్యనందించడమే సీఎం లక్ష్యమని తెలిపారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. మారుతున్న సమాజ అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు తీసుకురావల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని తెలిపారు. పిల్లలేవరు బడి బయట ఉండకూడదని.. అనాథ పిల్లల్ని కూడా స్థానికంగా ఉండే గురుకులాలు, ఇతర పాఠశాలలో చేర్చాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తామని వెల్లడించారు. -
లక్ష మంది టెటౌట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హత కోల్పోయారు. ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే వారు అనర్హులుగానే మిగిలిపోనున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరే ఆగిపోలేదు. ప్రైవేటు పాఠశాలల్లోనూ వీరు అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హత కోల్పోనున్నారు. వీరితోపాటు 2017 జూలై తరువాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) పూర్తి చేసిన మరో 50 వేల మందిదీ ఇదే దుస్థితి. ఇందుకు కారణం లక్ష మంది అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ ముగిసిపోవడమే. 2011 జూలై 1వ తేదీన, 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన వారిలో.. దాదాపు లక్ష మంది అర్హత ఈ ఏడాది జనవరి 8వ తేదీతో ముగిసిపోయింది. మరోవైపు కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన ఆ 50 వేల మందికి టెట్ నిర్వహించకపోవడంతో వారంతా సమీప భవిష్యత్తులో ఉండే (ఒకవేళ ప్రభుత్వం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే) ఉపాధ్యాయ పోస్టులకు అనర్హులుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. 2011 నుంచే అమల్లోకి రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2010లోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోనూ ఏటా రెండుసార్లు (నవంబర్/డిసెంబర్, జూన్/జూలై) టెట్ నిర్వహించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హ్హత సాధించిన వారే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఉత్తర్వులు జారీ చేసింది. పైగా టెట్ స్కోర్ వ్యాలిడిటీ ఏడేళ్లేనని స్పష్టం చేసింది. ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మొదటి ఏడాది తప్ప.. ఏ ఒక్క ఏడాదీ రెండుసార్లు టెట్‌ను నిర్వహించలేదు. కొత్తరాష్ట్రంలో రెండేసార్లు.. 2011 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం ఆరుసార్లు టెట్‌ను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు, తెలంగాణ ఏర్పడ్డాక రెండుసార్లు టెట్ పరీక్ష జరిగింది. ఇందులో 2011 జూలై 1వ తేదీన నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ 2018 జూలై 1వ తేదీతో ముగిసిపోయింది. 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన రెండో టెట్ వ్యాలిడిటీ ఈనెల 8వ తేదీతో ముగిసిపోయింది. దీంతో అప్పటి టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారిలో లక్ష మందికి పైగా అభ్యర్థులు తమ టెట్ స్కోర్‌ను, దాని వ్యాలిడిటీని కోల్పోవడంతో అర్హత పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ పోస్టుల్లో చేరాలంటే టెట్ అర్హత తప్పనిసరి నిబంధన నేపథ్యంలో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ ఏడాది జూన్ 1వ తేదీ దాటితే 2012 జూన్ 1న నిర్వహించిన మూడో టెట్ స్కోర్ వ్యాలిడిటీ కూడా రద్దు కానుంది. దీని ద్వారా మరో 50 వేల మంది అనర్హులుగా మిగిలిపోనున్నారు. 4,36,998 మంది అర్హులు టెట్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంది. ప్రభుత్వం ఏటా రెండుసార్లు నిర్వహించే టెట్లలో అర్హత సాధించిన అభ్యర్థులు మళ్లీ మళ్లీ టెట్‌కు హాజరై తమ స్కోర్‌ను పెంచుకోవచ్చు. దీంతో రాష్ట్రంలో నిర్వహించిన మొదటి రెండు టెట్‌లకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 4,36,998 మందికి అర్హత లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 2 లక్షల మంది వరకుఉన్నారు. మరో 2 లక్షల పైచిలుకు తెలంగాణ అభ్యర్థులున్నారు. వీరిలో లక్ష మంది.. 2012 జూన్, 2014 మార్చి, 2016 మే, 2017 జూలై నెలలో నిర్వహించిన టెట్ పరీక్ష రాసి.. మళ్లీ అర్హత సాధించారు. దీంతో వారికి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. మిగతా లక్ష మంది మాత్రం అప్పట్లో తమకు ఎలాగూ అర్హత ఉంది కదా అన్న ఉద్దేశమో.. లేక ప్రభుత్వం ఏలాగూ ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తుందన్న భరోసాతో తర్వాత మళ్లీ రాయవచ్చులే అనే భావనతోనే గానీ.. టెట్‌ను మళ్లీ రాయలేదు. దీంతో వారి స్కోర్ వ్యాలిడిటీ ప్రస్తుతం ముగిసిపోయింది. గురుకుల నోటిఫికేషన్ వస్తే ఎలా? వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 119 కొత్త బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నా యి. అందులో 1,071 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులున్నాయి. వాటికి టెట్‌లో అర్హ త సాధించి ఉన్న దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ లక్షన్నర మందికి ఆ అర్హత లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నందున విద్యాశాఖ వెంటనే స్పందించి టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. అకస్మాత్తుగా ప్రభుత్వం ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే టెట్ అర్హత లేని అభ్యర్థులు ఆ పోస్టులకు అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల మంది కొత్త వారికి.. రాష్ట్రంలో రెండేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసిన 50 వేల మంది కొత్త విద్యార్థులకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 2017 జూలై 23వ తేదీ తరువాత విద్యాశాఖ మళ్లీ రాష్ట్రంలో టెట్ నిర్వహిం చింది. ఏడాదిన్నర కాలంలో టెట్‌ను పట్టిం చుకోలేదు. 2017లో, 2018లో బీఎడ్, డీఎడ్ పూర్తయిన వారు దాదాపు 50 వేల మంది టెట్ పరీక్షకు హాజరు కాలేదు. మరోవైపు వచ్చే మే నాటికి మరో బ్యాచ్ బీఎడ్, డీఎడ్‌ను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే వారికి టెట్‌లో అర్హత లేనందున, వారు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులవుతారు. అంతేకాదు టెట్‌లో అర్హత లేకపోవడంతో వారు కనీసం ప్రైవేటు పాఠ«శాలల్లో టీచర్లుగా చేరేందుకు కూడా అర్హతలేదు. -
టెట్‌ను రద్దు చ్వేయాలంటూ పీఈటీ అభ్యర్థుల నిరసన
-
తొలిరోజు టెట్ ప్రశాంతం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు. -
టెట్‌పై సర్కారు మల్లగుల్లాలు
-
టెట్‌పై సర్కారు మల్లగుల్లాలు
ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగం కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ రెండు పరీక్షలకు సిద్ధం కావడం అవసరమా? ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించాలని భావిస్తోంది. ఒక దశలో టెట్‌ను రద్దు చేసేందుకు కూడా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నా.. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో భాగంగా జాతీయ ఉపాధ్యాయ, విద్యా మండలి (ఎన్సీటీఈ) టెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రద్దు సాధ్యం అవుతుందా? లేదా? అనే కోణాల్లోనూ విశ్లేషిస్తోంది. ఒకవేళ రద్దు సాధ్యం కాకపోతే టెట్, డీఎస్సీ రెండూ కలిపి రెండు పేపర్లతో ఒకే పరీక్షగా నిర్వహించే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీఈ అమలులో భాగంగా ప్రభుత్వం టెట్‌ను ప్రవేశ పెట్టింది. ఒకటి నుంచి ఐదో తరగతికి బోధించేవారు టెట్ పేపరు-1 పరీక్ష, 6 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునేవారు పేపరు-2లో అర్హత సాధించాలి. ఇందులో అర్హత సాధించినవారు మాత్రమే జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నిర్వహించే ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాసేందుకు అర్హులుగా పేర్కొంది. ఇక డీఎస్సీ పరీక్షలో సాధించే మార్కులకు 80 శాతం, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి టీచర్ల నియామకాలు చేపడుతోంది. ఇది అర్హత పరీక్ష అయినందున టెట్‌ను ఏటా రెండుసార్లు డిసెంబర్/జనవరి నెలల్లో, జూన్/జులై నెలల్లో నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం డిసెంబరు/జనవరిలో నిర్వహించాల్సిన టెట్‌ను ఈ ఏడాది మార్చిలో నిర్వహించింది. ప్రస్తుతం పరీక్షలు పూర్తి చేసుకొని బయటకు వచ్చే లక్ష మందికి పైగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థుల కోసం, గతంలో టెట్ రాసినా అర్హత సాధించని మరో 3 లక్షల మంది కోసం ఈ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు టెట్ నిర్వహణ అవసరమా? లేదా? అనే విషయాన్ని కూడా త్వరలో నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, తమ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోదని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగానికి రెండు పరీక్షలు అవసరమా అనే కోణంలోనూ ఆలోచనలు చేస్తున్నామన్నారు. -
టెట్టెలా?
సాక్షి, అనంతపురం : టెట్(టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్) నిర్వహణపై అయోమయం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పీడు పెంచిన నేపథ్యంలో సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఎన్జీఓలు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఎన్న్జీఓలు అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. టెట్ నిర్వహణ కోసం 1552 మందిని ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయేతర సిబ్బందిని నియమించారు. పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్ల కొరత ఏర్పడనుంది. ఇన్విజిలేటర్లుగా నియమించిన 1552 మందికి కూడా నియామక ఉత్తర్వులను బుధవారం అందజేశారు. సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్లుగా ఎలా వెళ్తామని ప్రశ్నించిన సిబ్బందికి కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఇన్విజిలేటర్ల నియామక పత్రాలు తీసుకోవాల్సిందేనని గట్టిగా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో తీసుకున్నారు. మరో వైపు ఇన్విజిలేటర్లుగా నియమించిన వారందరికీ శనివారం శిక్షణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరందరూ కూడా గురువారం నుంచి సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్లుగా వెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నారు. జిల్లాలో 19884 మంది టెట్ కోసం దరఖాస్తు చేసుకోగా పరీక్ష కోసం 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్ల కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇన్విజిలేటర్లుగా డీఆర్డీఏ, డ్వామా కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, వీరందరూ పరీక్షల నిర్వహణపై ఏమాత్రం పరిజ్ఞానం లే నందున టెట్ నిర్వహించడం తమ వల్ల కాదని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆఖరుకు వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలను ఇన్విజిలేటర్లుగా నియమించాలని చూస్తున్నా జిల్లాలో 350 మందికి మించి పీఈటీలు లేనందున మిగిలిన 1200 మందిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో జిల్లా యంత్రాంగానికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. పరీక్ష నిర్వహణ కోసం ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో 136 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆపీసర్లకు గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో సమావేశం ఏర్పాటు చేశారు.