సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా వైద్యం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని.. నాణ్యమైన విద్యనందించడమే సీఎం లక్ష్యమని తెలిపారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. మారుతున్న సమాజ అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు తీసుకురావల్సి ఉందని స్పష్టం చేశారు.
ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని తెలిపారు. పిల్లలేవరు బడి బయట ఉండకూడదని.. అనాథ పిల్లల్ని కూడా స్థానికంగా ఉండే గురుకులాలు, ఇతర పాఠశాలలో చేర్చాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment