![First Day TET Exam Is Cool - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/11/tet.jpg.webp?itok=SZ8h_dBH)
పెందుర్తి ఇయాన్ డిజిటల్ జోన్ కేంద్రం వద్ద అభ్యర్థుల కోలాహలం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్‌లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు.
పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్‌లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment