sessions
-
Hyderabad: శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
లక్డీకాపూల్ (హైదరాబాద్) : ఆస్తి పన్ను(Property Tax) సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner) తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆరీ్టజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. -
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల అయ్యింది. కేంద్రం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజ్యసభ, లోక్‌సభలు వేర్వేరుగా బులిటెన్లు విడుదల చేశాయి. ఇందులో భాగంగా.. ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చ జరగనుంది. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనున్నట్లు ఆయా బులిటెన్లు పేర్కొన్నారు. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: 450 మంది పోలీసులకు ప్రధాని విందు -
‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి’
TIME: 5:00PM ►విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారంటూ లోక్‌సభలో ఆయన మాట్లాడారు TIME: 4:00PM ►జీఎస్టీ నష్టపరిహారం కింద గత నవంబర్ 3న రాష్ట్రాలకు 17 వేల కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 543 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 మధ్య కాలంలో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రలకు విడుదల చేసిన 1,13,464 కోట్ల రూపాయలకు ఇది అదనం అని తెలిపారు. TIME: 3:30PM ►2021 రబీలో తెలంగాణాలో పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. తెలంగాణాలో పంటల సాగుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టలేదని స్పష్టం చేశారు. 2021 రబీ సీజన్‌కు సంబంధించి వరి లేదా ఇతర పంటల సాగు పై కేంద్ర ఏమైనా నిబంధనలు విధించిందా.. అని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా రైతులు వరి సాగు చేయొద్దు, ఇతర పంటలు వేసుకోండి అని తెలంగాణ సీఎం కేసీఆర్ , తెలంగాణా ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది. TIME: 12.05 PM ► ధాన్యం సేకరణ అంశంపై కేంద్రం వైఖరి పట్ల నిరసన తెలుపుతూ.. తాము.. శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీనేత కేశవరావు తెలిపారు. 11.15 AM ► ఏపీ తరహలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయ్యాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగ గీత లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకం మహిళల ఆర్థిక పురోగతికి మరింత సహకరిస్తుందన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణపరిమితిని 10 నుంచి 12 లక్షలకు పెంచామని తెలిపారు. వడ్డీ మినహయింపుకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక పథకాలు ఉన్నాయని గిరిరాజ్ సింగ్ తెలిపారు. 10.55 AM ► 12 మంది ఎంపీల సస్సెన్షన్ వ్యవహరం రాజ్యసభను కుదిపేస్తుంది. విపక్ష సభ్యులు చైర్మన్ వేల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 10.45 AM ► వరిధాన్యం కొనుగొలు అంశంపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. కాగా, కేంద్రం వైఖరీకి నిరసనగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు తెలిపారు. 10.42 AM ► వ్యవసాయ చట్టాల ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహరం అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన.. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటిసును ఇచ్చారు. అదే విధంగా.. ఎంపీ దీపేందర్ సింగ్ హుడా రైతుల పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహరం ఇవ్వాలని కోరుతూ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. 10.22 AM ► నవంబరు 15వ తేదీని.. జనజాతీయ దివాస్‌గా గుర్తించినందుకు పలువురు నేతలు మోదీని సన్మానించారు. కాగా, నవంబరు 15న బిర్సాముండ జన్మించారు. 10.12 AM ► ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ప్రహ్లద్ జోషి, అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఇతర బీజేపీ నాయకులు సమావేశంలో పాల్లొన్నారు. 9.52 AM ► లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనిష్ తివారి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 9.50 AM ► పార్లమెంట్లో సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల సవరణ బిల్లు 2021ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేషపెట్టారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం సభ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్లో వరిధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాగా, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
హాట్ హాట్ గా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
-
ఐఫోన్ యూజర్లకు శుభవార్త : ఫ్రీ సెషన్లు
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది. ముందుగా ప్రకటించినట్టుగానే సంగీతం, ఫోటోగ్రఫీ, ఆర్ట్ పై ఆసక్తి ఉన్నవారి కోసం ఉచిత వర్చువల్ సెషన్లను షురూ చేసింది. ఇటీవల భారతదేశంలో ఆపిల్ స్టోర్ ఆన్లైన్ ప్రారంభించిన ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారులలో అప్ కమింగ్ కళాకారులకు ఈ సెషన్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ వర్చువల్ సెషన్‌కు మీ ఐఫోన్ సిద్ధంగా ఉండండి అని ఆపిల్ పేర్కొంది. నవంబర్ 29 వరకు ఉచిత వర్చువల్ సెషన్లను ప్రకటించింది. ప్రముఖ స్థానిక ఫోటోగ్రాఫర్లు, ప్రసిద్ధ సంగీతకారులు వారి వారి విజయ గాథలను పంచుకుంటారు. ఈ ఆపిల్ ఈవెంట్ల కోసం నమోదు చేసుకున్న వినియోగదారులకు చిట్కాలు , సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ముందుగా ఫోటోగ్రఫీ సెషన్ల వివరాలను ఆపిల్ ప్రకటించింది. (ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు) ఫోటోగ్రఫీ సెషన్లు ఉచిత వర్చువల్ ఫోటోగ్రఫీ సెషన్లు అక్టోబర్ 22 నుండి ప్రారంభం. వీటిని ఫోటో ల్యాబ్ అంటారు. ప్రధానంగా సిద్దార్థ జోషి, అవని రాయ్ వంటి ప్రముఖులు అక్టోబర్ 22, అక్టోబర్ 27 తేదీల్లో ఉదయం 7 నుండి 8 గంటల వరకు పాల్గొంటారు. డీఎస్ఎల్ఆర్, మిర్రర్‌లెస్ కెమెరాలను ఎలా ఉపయోగించాలో చెబుతారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చిట్కాలను అందిస్తారు. ప్రసిద్ధి చెందిన డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తారు. అక్టోబర్ 29 న, అనురాగ్ బెనర్జీ నాన్-ఫిక్షన్ ఫోటోగ్రఫీపై ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, నవంబర్ 3 న, పోర్ట్రైట్ ఫోటోగ్రఫీపై ప్రార్థనా సింగ్ ఒక సెషన్ తీసుకోనున్నారు. ఆపిల్ అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 2 న ఐఫోన్లలో ఫోటోగ్రఫీపై మూడు సెషన్లను ఉంటాయి. నవంబర్ 5 న హషీమ్ బదాని నిర్వహించే ఫోటోగ్రాఫిక్ సెషన్ ఉంటుంది. ఇందులో తన ప్రాజెక్టుల ప్లానింగ్, పరిశోధనలను వివరిస్తారు. ఈ సెషన్లకు రిజిస్టర్ చేసు కోవాలంటే ఆపిల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్, ఇంటర్నెట్ కనెక్షన్, ఉచిత సిస్కో వెబెక్స్ సమావేశాల యాప్ ఉండాలి. అలాగే యూజర్లు18 ఏళ్లలోపు వారైతే, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమోదం కావాలని ఆపిల్ వెల్లడించింది. -
నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశం ప్రారంభం కానుంది. పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టాల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. శుక్రవారం శాసనసభలో చర్చ నిర్వహించి మున్సిపల్ చట్టాల బిల్లును ఆమోదించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిల్ హాల్లో శాసన మండలి సమావేశం నిర్వహించి ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. మున్సిపల్ చట్టాల బిల్లులతో పాటు మరో నాలుగు ఆర్డినెన్స్‌ల బిల్లులను సైతం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ప్రధానంగా మున్సిపల్ చట్టాల బిల్లును ఆమోదించేందుకు శాసనసభ సమావేశాన్ని నిర్వహిస్తున్నందున ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి ప్రొసీడింగ్‌లతో సంబంధం లేకుండా కేవలం ఎజెండాలోని అంశాలపై మాత్రమే చర్చకు అనుమతించనున్నారు. -
తొలిరోజు టెట్ ప్రశాంతం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు. -
సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం (కొత్తపేట) : నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఆత్రేయపురంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం డైరెక్టర్ చిలువూరి బాబిరాజు స్వగహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా నష్టం కలిగిస్తోందన్నారు. ఆలమూరు మండల సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని మండపేటకు , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కపిలేశ్వరపురానికి తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విషయంలో కూలీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే విషయం ఒక్కటీ, అధికారులకు చెప్పేది మరొకటి అవుతుందన్నారు. ర్యాంపులో పక్కన పెట్టిన డబ్బును కూలీలకు పంచాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణం , పింఛన్లు , రుణాలు పంపిణీలో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. పంచాయతీల్లో పన్నులు అడ్డుగోలుగా పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో రైతులకు మోటార్లకు ఆయిల్ అందించాల్సి ఉందని అలా అందించకుండా ఈ సొమ్మును పచ్చచొక్కాల సెలక్షన్ కమిటీలు పంచుకుంటున్నాయని విమర్శించారు. గత శాసన సభలో ఇరిగేషన్ మంత్రి దృష్టికి తెచ్చి పేరవరం ఎత్తిపోతల పథకం ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించగా పనులు నత్తనడకన నడుస్తున్నాయని వాపోయారు. ఉచ్చిలి పంపింగ్ మోటార్లు సైతం పనిచేయడం లేదన్నారు. సభలో సమస్యలు చర్చించడానికి సమయం ఇవ్వాలని కోరితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను సస్పెస్షన్ చేసి నోరు నొక్కేయడం దారణమన్నారు. అమరావతిలో నూతన అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు ప్రారంభానికి వైఎస్సార్సీపీ సభ్యులను కనీసం ఆహ్వానించకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాదిరిగా ప్రారంభించుకోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా తప్పించుకున్నట్టు తెలిపారు. రైతాంగానికి నీరు అందించకుండా వేరే చోటకు తరలించడం ప్రజల క్షేమం దృష్ట్యా మంచిది కాదని సభలో ప్రస్తావించనున్నట్టు తెలిపారు. అనంతరం స్దానిక వైఎస్సార్సీపీనేత దండు సుబ్బరాజు స్వగృహంలో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి కర్రినాగిరెడ్డి, ఉప సర్పంచ్ చిలువూరి చిన వెంకట్రాజు పాల్గొన్నారు. -
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రసంగం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. బడ్జెట్లోని ముఖ్యాం శాలు, సంక్షేమం, అభివృద్ధి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉండొచ్చని భావిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ చాంబర్లో బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం జరగనుంది. శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, వివిధ పార్టీల సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, సెలవులు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. శుక్రవారం సంతాప తీర్మానంతో సభ వాయిదా పడనుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్) అనారోగ్యంతో ఇటీవలే హఠాన్మరణం చెందారు. సిట్టింగ్ సభ్యుడైన ఆయన మృతికి సంతాపం తెలిపిన తర్వాత ఆయా పార్టీల నుంచి సభ్యులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డితో తమకున్న అనుబంధాన్ని సభకు తెలియజేస్తారు. శనివారం నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపడతారు. ఇది రెండు రోజులు ఉంటుందా? లేదా ఒకరోజుకే పరిమితం చేసి ఆదివారం సెలవు ఇస్తారా అన్న విషయం బీఏసీ సమావేశంలో తేలనుంది. ముందే నిర్ణయించిన మేరకు ఈ నెల 14వ తేదీన ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఉత్సాహంలో అధికార పక్షం వరుస ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ బడ్జెట్ సమావేశాలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ప్రజల దీవెన ఉందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్న భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. 6 ద శాబ్దాలుగా మహారాష్ట్రతో పెండింగ్‌లో ఉన్న గోదావరి జలాలు, 5 బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడాన్ని టీఆర్ఎస్ తమ విజయంగా పేర్కొంటోంది. సమావేశాల్లో విపక్షాలకు దీటైన జవాబిస్తామన్న ధీమాతో ఉంది. ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు వేర్వేరుగా శాసన సభాపక్ష సమావేశాలను నిర్వహించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయంతో విపక్షాలు ఒకింత ఆత్మరక్షణలో ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడం ఆ పార్టీని కుంగదీసింది. ఈ సమావేశాల్లో కూడా విపక్షాలు ఎమ్మెల్యేల వలసలపై పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ ఇప్పటికే పలు ూర్లు ప్రకటించింది. సీఎల్పీ సమావేశంలోనూ వలసలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై పాలక పక్షాన్ని నిలదీయాలన్న చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు టీడీపీ మిత్రపక్షం బీజేపీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార టీఆర్ఎస్ను ఢీకొట్టే స్థైర్యాన్ని కోల్పోయిందని అంటున్నారు. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ లెక్కన ప్రతిపక్షాల నుంచి పాలక పక్షంపై పెద్దగా దాడి ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏర్పాట్లను సమీక్షించిన స్పీకర్ ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా శాసనసభ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి ఏర్పాట్లను సమీక్షించారు. ఇద్దరు సీఎంల రాకపోకలు, మంత్రుల రాకపోకలకు గేట్ల కేటాయింపు, ప్రొటోకాల్, భద్రత తదితర అంశాలపై చర్చించారు. గేట్-1 నుంచి ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రుల వాహనాలు, గేట్-2 నుంచి ఎమ్మెల్యేల వాహనాలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. -
అనారోగ్యంతో ఉన్నా అరెస్టు చేస్తారా?
-
ప్రారంభమైన బీఏసీ సమావేశం
-
పాత విషయాలు వదిలేసి.. ముందుకు పోదాం
న్యూఢిల్లీ: నవంబరు 26 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అధికార బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను బిల్లు, భూసేకరణ బిల్లుతో పాటు 9 కీలక బిల్లుల్ని ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వర్షాకాల సమావేశాల చేదు అనుభవాలను మర్చిపోయి ముందుకు పోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు. దాద్రి హత్యోదంతంపై పత్రిపక్షాల వ్యూహాలు తమకు తెలుసుని ఆయన అన్నారు. మరోవైపు నవంబరు 26 నుంచి డిసెంబరు 23 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను 'అసహనం' అంశం కుదిపేయనుంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, పలు వివాదాస్పద అంశాలు అధికార పార్టీలో అశాంతిని రేపిన మాట వాస్తవం. ముఖ్యంగా దేశంలో చెలరేగిన మతఘర్షణలు, బీఫ్ బ్యాన్, దాద్రి ఘటన, అవార్డు వాపసీ లాంటి పలు అంశాలపై యుద్ధానికి ప్రతిపక్షాలు తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి. అలాగే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రాజేశాయి. బీజేపీ ఎంపీలు, నాయకులు, మరి కొందరు సీనియర్ నటులు ఆయనపై విరుచుకుపడ్డారు. దేశం విడిచి పొమ్మని ఒకరంటే, నీకు అంత కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన దేశానికే కళంకితం ఆపాదిస్తావా అంటూ మరొకరు ధ్వజమెత్తారు. చివరికి శివసేన అధికార పత్రిక సామ్నా లో అమీర్ పై విమర్శలు గుప్పించింది. అటు ప్రతిపక్షాలు కోరిన అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. సభ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా సామరస్య పూర్వక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతోపాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ సహా, ప్రతిపక్షాలన్నీ అస్త్రశస్త్రాలతో రడీగా ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న అసహనం తనకు బాధ కలిగించిందని, అందుకే పార్లమెంటులో దీనిపై చర్చను కోరుతున్నామని మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. అటు కీలక బిల్లుల్ని గట్టెక్కించేందుకు ప్రతిపక్షాలతో బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో బలం ఉన్నా... రాజ్యసభలో మాత్రం బలహీనంగా ఉంది. జీఎస్టీ బిల్లు, భూ సేకరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలోనే ఉన్నాయి. వీటిని గట్టెక్కించేందుకు ప్రతిపక్షాలను ఒప్పించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రతిపక్షాల సహకారం కోరుతూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాగా లలిత్ మోదీ వివాదం కేంద్రంగా.. గత సమావేశాలు కృష్ణార్పణం అయిపోయాయి. ఇక 21 రోజుల పాటు సాగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే. -
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశానికి రంగం సిద్ధం
-
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు
-
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. పెండింగ్ బిల్లులపై దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే మంత్రులకు సూచించారు. విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చిన మోదీ మరోసారి పార్టీ నాయకులు, మంత్రులతో సమావేశమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం గురించి అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. -
సభా సమరం క్లుప్తంగా...
-
సభా నిర్వహణకు అందరూ సహకరించాలి: కోడేల
-
రెండో రోజు ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం
-
సభా సమరం
-
ఏపీ అసెంబ్లీ భద్రత ఎవరిది?
-
ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
-
'పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడండి'
-
2013లో అతి తక్కువ రోజులు సమావేశమైన అసెంబ్లీ
-
ఎజెండా లేని అసెంబ్లీ
-
ఎజెండా లేని అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ చరిత్రలో కొత్త రికార్డు నమోదు కానుంది. నిర్దిష్ట ఎజెండా లేకుండా శాసనసభ శీతాకాల సమావేశాల తొలి ఘట్టం ముగిసింది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలు చేపట్టాలన్న ముందస్తు ప్రణాళికేదీ లేకుండానే ఆరు రోజుల సమావేశాలు ముగిశాయి. ఈ ఆరు రోజుల సమావేశాలు పట్టుమని 60 నిమిషాలు కూడా సాగలేదు. రెండుసార్లు బీఏసీ సవూవేశం జరిగినా అవి నిర్దిష్ట ఎజెండాను కూడా ఖరారు చేయులేకపోయూరుు. ఈ సమావేశాలు ఏడు రోజులని కొందరు, లేదు అయిదు రోజులే అని అధికార పక్షం రకరకాలుగా చెప్పినప్పటికీ.. రెండూ కాకుండా ఆరో రోజున తొలి విడత సమావేశాలు ముగిశాయి. బీఏసీ తర్వాత బులెటిన్ జారీ కాకపోవడంతో సమావేశాలు ఎన్నిరోజులన్నదానిపై మొదటినుంచీ స్పష్టత కరువైంది. ఆద్యంతం వాయిదాలపర్వమే: సమావేశాల తొలిరోజు దక్షిణాఫ్రికా వూజీ అధ్యక్షుడు నెల్సన్ వుండేలాతో పాటు దివంగత వూజీ శాసనసభ్యులకు నివాళి అర్పించడంతో వుుగించారు. ఆ ఒక్కరోజు తప్ప వురే రోజు కూడా అరుుదు, పది నిమిషాలకు మించి సభ జరగలేదు. వురుసటి రోజున ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కూడా రద్దు చేసి వరదలు, తుపాన్లలో జరిగిన నష్టం, బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయుం, అధిక ధరలు తదితర అంశాలపై చర్చను చేపట్టాలని నిర్ణరుుంచారు. అరుుతే అందుకు భిన్నంగా వురుసటి రోజు సవూవేశం ప్రారంభంలోనే తీవ్ర గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్ కాంగ్రెస్, విభజనపై కేంద్ర, రాష్ట్రాల తీరుపై టీడీపీ, తెలంగాణ బిల్లుపై చర్చకు టీఆర్ఎస్ వారుుదా తీర్మానాలు ప్రతిపాదించడం, వాటిని సభాపతి తిరస్కరించడం, తీవ్ర గందరగోళం వుధ్య మొదటి అరుుదు నిమిషాల్లోనే సభను వారుుదా వేసేశారు. ఆ తర్వాత వురో రెండుసార్లు కూడా రెండు వుూడు నిమిషాల్లోనే వుుగించాల్సి వచ్చింది. అప్పటికే తెలంగాణ బిల్లు రాష్ట్రానికి రావడంతో దాన్ని అసెంబ్లీకి, శాసనవుండలికి అందించడంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందన్న ఆరోపణలతో తెలంగాణ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వుండలిలో, శాసనసభలో హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. చివరకు వుండలి, అసెంబ్లీ వారుుదా పడే సవుయుంలో తెలంగాణ వుుసారుుదా బిల్లు చైర్మన్, స్పీకర్లకు అందించారు. వీటిపై చర్చకు సంబంధించి అసెంబ్లీ బయుట కూడా తీవ్ర వాగ్వాదాలు నెలకొన్నారుు. బిల్లుపై రచ్చరచ్చ: 16న అంటే సోవువారం ఉదయుం సభ ప్రారంభంలోనే వారుుదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ వునోహర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 గురించి సభకు వివరించారు. బిల్లును సభ ముందు ఉంచడంతోనే వాయిదాల పర్వం మొదలైంది. ఆ మరుసటి రోజు బిల్లుపై అసలు చర్చే మొదలు కాలేదని కొందరు... చర్చ మొదలైందని మరికొందరు వాదించడంతో కొత్త వివాదం మొదలై గందరగోళానికి దారి తీసింది. వురుసటి రోజు బీఏసీ సవూవేశం దాదాపు రెండు గంటల సేపు జరిగినా అసెంబ్లీ షెడ్యూల్‌పై ఏదీ తేల్చకుండా అర్ధంతరంగా వుుగిసింది. గురువారం కూడా వుుచ్చటగా వుూడుసార్లు వారుుదా పడి చివరకు తొలి విడత శీతాకాల సవూవేశాలకు సుదీర్ఘ సెలవులు ప్రకటించారు. శాసనసభ చరిత్రలో ఎజెండా కానీ నిర్దిష్ట షెడ్యూల్ కూడా లేకుండా సవూవేశాలు వారుుదా పడడం ఇదే ప్రథవుం. శాసన మండలిలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉండగా, బుధవారం కొద్దిసేపు ముఖ్యమంత్రి మాట్లాడారు. -
మరింత హీట్ ఎక్కనున్న అసెంబ్లీ సమావేశాలు