పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
పెండింగ్ బిల్లులపై దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే మంత్రులకు సూచించారు. విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చిన మోదీ మరోసారి పార్టీ నాయకులు, మంత్రులతో సమావేశమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం గురించి అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.