TIME: 5:00PM
►విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారంటూ లోక్‌సభలో ఆయన మాట్లాడారు
TIME: 4:00PM
►జీఎస్టీ నష్టపరిహారం కింద గత నవంబర్ 3న రాష్ట్రాలకు 17 వేల కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 543 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 మధ్య కాలంలో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రలకు విడుదల చేసిన 1,13,464 కోట్ల రూపాయలకు ఇది అదనం అని తెలిపారు.
TIME: 3:30PM
►2021 రబీలో తెలంగాణాలో పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. తెలంగాణాలో పంటల సాగుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టలేదని స్పష్టం చేశారు. 2021 రబీ సీజన్‌కు సంబంధించి వరి లేదా ఇతర పంటల సాగు పై కేంద్ర ఏమైనా నిబంధనలు విధించిందా.. అని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా రైతులు వరి సాగు చేయొద్దు, ఇతర పంటలు వేసుకోండి అని తెలంగాణ సీఎం కేసీఆర్ , తెలంగాణా ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది.
TIME: 12.05 PM
► ధాన్యం సేకరణ అంశంపై కేంద్రం వైఖరి పట్ల నిరసన తెలుపుతూ.. తాము.. శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ పార్లమెంటరీనేత కేశవరావు తెలిపారు.
11.15 AM
► ఏపీ తరహలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయ్యాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగ గీత లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకం మహిళల ఆర్థిక పురోగతికి మరింత సహకరిస్తుందన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణపరిమితిని 10 నుంచి 12 లక్షలకు పెంచామని తెలిపారు. వడ్డీ మినహయింపుకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక పథకాలు ఉన్నాయని గిరిరాజ్ సింగ్ తెలిపారు.
10.55 AM
► 12 మంది ఎంపీల సస్సెన్షన్ వ్యవహరం రాజ్యసభను కుదిపేస్తుంది. విపక్ష సభ్యులు చైర్మన్ వేల్‌లోకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
10.45 AM
► వరిధాన్యం కొనుగొలు అంశంపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. కాగా, కేంద్రం వైఖరీకి నిరసనగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు తెలిపారు.
10.42 AM
► వ్యవసాయ చట్టాల ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహరం అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన.. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటిసును ఇచ్చారు. అదే విధంగా.. ఎంపీ దీపేందర్ సింగ్ హుడా రైతుల పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహరం ఇవ్వాలని కోరుతూ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
10.22 AM
► నవంబరు 15వ తేదీని.. జనజాతీయ దివాస్‌గా గుర్తించినందుకు పలువురు నేతలు మోదీని సన్మానించారు. కాగా, నవంబరు 15న బిర్సాముండ జన్మించారు.
10.12 AM
► ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ప్రహ్లద్ జోషి, అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, ఇతర బీజేపీ నాయకులు సమావేశంలో పాల్లొన్నారు.
9.52 AM
► లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనిష్ తివారి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
9.50 AM
► పార్లమెంట్‌లో సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల సవరణ బిల్లు 2021ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేషపెట్టారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం సభ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో వరిధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాగా, టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment