Monday
-
ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్ వెల్లడించారు.ఐఎస్బీ మేగజైన్లో ‘హైడ్రా’రాజధానిలోని జలవనరుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సంస్థకు చెందిన ‘ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్’ డిసెంబర్–2024 మేగజైన్లో హైడ్రాపై వ్యాసం ప్రచురితమైంది. పబ్లిక్ పాలసీ విభాగంలో ‘హైదరాబాద్స్ హైడ్రా: ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ అర్బన్ వాటర్ బాడీ రిక్సామ్నేషన్’ శీర్షికన దీన్ని ప్రచురించింది. తన అధికారిక వెబ్సైట్లోనూ ఈ వ్యాసాన్ని అందుబాటులో ఉంచింది.దాదాపు ఏడు వేల జలవనరులతో సిటీ ఆఫ్ లేక్స్‌గా పేరున్న హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి, దానికి కారణాలను ఈ వ్యాసం వివరించింది. గతేడాది జూలై 19న హైడ్రా ఏర్పడిన తర్వాతి పరిస్థితులు, చెరువుల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను అభినందించిన ఈ వ్యాసం, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జలవనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కితాబిచ్చింది. జనావాసాల జోలికి వెళ్లకుండా చెరువుల పరిరక్షణ చేపట్టాలంటూ హైడ్రా తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని ఐఎస్బీ వ్యాసం అభినందించింది.ఇదీ చదవండి: హెచ్ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్జల వనరుల ఆక్రమణ, అవి కనుమరుగు కావడం, కాలుష్య కోరల్లో చిక్కుకోవడం తదితర సమస్యలు దేశ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు హైడ్రా తరహా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని ఐఎస్బీ తన వ్యాసంలో సూచించింది. తెలంగాణకు చెందిన పాలకులు, అధికారులు హైడ్రాకు మరింత చేయూత ఇవ్వాలని అభిప్రాయపడింది. -
శ్రీకృష్ణాష్టమికి బ్యాంకులు పనిచేస్తాయా?
జన్మాష్టమి.. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది హిందువులు అత్యంత వేడుకగా చేసుకునే పండుగ. ఈసారి జన్మాష్టమి సోమవారం అంటే ఆగస్టు 26న వచ్చింది. ఆగస్టు 24, 25వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మరి సోమవారం, శ్రీకృష్ణాష్టమి నాడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా మూసివుంటాయా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయయనున్నారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు తమ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సెలవుల జాబితాను పొందవచ్చు.కాగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, న్యూఢిల్లీ, గోవాలలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేస్తాయి. అయితే సోమవారం సెలవు ఉన్న బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు బ్యాంకు సేవలను పొందవచ్చు. -
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్‌ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!) -
సోమావతి అమావాస్య అంటే.. రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు?
అమావాస్య గనుక సోమవారం నాడు వస్తే ఎంతో పుణ్యప్రదమైనది. మన దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన దీనిని చాలామంది ఆచరించడం మనం చూస్తాం. హరిద్వార్‌లోని ప్రయాగలో ఈరోజు పది లక్షల మంది స్నానాలు ఆచరిస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల ఈ అమావాస్య మరింత విశేషమైనది. సోమావారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అనిపిలుస్తారు. ఈ రోజు ఏం చేస్తారు?, ఏ దేవుడిని పూజిస్తారు? సవివరంగా తెలుసుకుందామా..! అమావాస్యా తు_సోమేన, సప్తమీ_భానునాయుతా చతుర్థీ భౌమవారేణ బుధవారేణ చాష్టమీ। చతస్రస్తిథయస్త్వేతాస్సూర్యగ్రహణ సన్నిభాః స్నానం, దానం, తథాశ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్ ॥ ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారంటే.. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం. ఇవాళ ఉదయం అమావాస్య ఉన్నందువలన ఉదయం మనం ఆచరించే స్నాన, దానాదులకుశ్రాద్ధకర్మకు అక్షయమైన ( తరిగిపోని ) పుణ్యఫలమని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం నదీస్నానం , పితృతర్పణం, శక్తి కొలది దానము చేయాలి. ఆడవారు సోమవతీ అమావాస్య వ్రత కథ చదువుకుని,ఉపవాసముతో ఉండి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ( రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ) 108 చేస్తే మంచిది. అంతేగాదు ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలన్ని తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు విష్ణువుని, తులిసీ చెట్టుని పూజిస్తే ధనానికి లోటు ఉండదు. చేయకూడనవి.. ఈరోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు. మహిళలు తలస్నానం చేయకూడదు. మాంసము మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈరోజు వస్తువులు కొనడం మానుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. -
విజయదశమిపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి. ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం. -
నేడు సోమావతి అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో..
ఈ అమావాస్య అత్యంత శక్తిమంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతీ అమావాస్య అని పిలుస్తారు. ఇక ఇది కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: ⇒ సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. ⇒ ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ⇒ శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి. ⇒ గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. ⇒ వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథఉంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉంది. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది ఆ వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా.. వారు చాలా బాధపడి దీనికి ఎలాంటి పరిష్కారమూ లేదా అని అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరుతాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు పాటు సేవ చేయగా.. ఈ సోమావతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ. అంతేగాకుండా సోమావతీ అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, వీలైతే మౌనం పాటించాలి. (చదవండి: సైన్స్ ఆగిపోయిన సమయాన ..) -
అయ్య బాబోయ్ ఇలా అయిపోతామా!మండే మోటివేషన్: ఆనంద్ మహీంద్ర ట్వీట్స్ వైరల్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా 'మండే మోటివేషన్' కోట్స్, వీడియోలను ట్విటర్లో షేర్ చేయడం అలవాటు. తాజాగా మండే బ్లూస్ అంటూ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ కోట్‌ను ట్వీట్ చేశారు. "మనందరికీ పిచ్చి అని గ్రహించిన క్షణంలో మాత్రమే జీవితం పూర్తిగా అర్థమవుతుంది." అనే కోట్‌ను అభిమానులతో షేర్ చేశారు. ప్రపంచమే ఒక పచ్చి వలయం. అందులో మనం కూడా కొంచెం వెర్రి వాళ్లమనే సత్యాన్ని గ్రహించగలిగితే చక్కని చిరునవ్వుతో సోమవారం పనిలోకి దిగుతాం. మీరు చేసే పనిలో 'క్రేజీ గుడ్'గా ఉండటానికి ప్రయత్నించండి అంటూ సూచించారు. దీంతోపాటు ఆనంద్ మహీంద్ర మరో ట్వీట్ కూడా ఆలోచనాత్మంగా మారింది. “నర్సింగ్ హోమ్ ఇన్ ఏ పోస్ట్ టెక్ట్సింగ్ వరల్డ్” అనే టైటిల్‌తో ఉన్న ఒక కార్టూన్‌ను షేర్ చేశారు. వేలం వెర్రిగా పెరిగి పోతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంపై బాధాకరమైన కార్టూన్‌ను ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్టూన్ చూస్తేనే భయంగా ఉందనీ, తనను ఇది ఫోన్ పక్కన పెట్టేలా చేసిందన్నారు. “ తీవ్రంగా బాధ కలిగించే కార్టూన్ ఇది. నా ఫోన్‌ను పక్కన పెట్టేలా చేసింది (ఈ ట్వీట్ చేసిన తర్వాత!). మెడను నిటారుగా ఉంచుకొని, తల ఎత్తుకొని నా ఆదివారాన్ని గడిపేలా చేసింది” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కాగా చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా పొద్దున్న లేచింది మొదలు, స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. అలా విచక్షణ లేకుండా నిరంతరం మొబైల్‌ను చెక్ చేస్తూ, దానికి బానిసలై పోతున్న వారి పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఈ కార్టూన్. రోగులుగా మనం నర్సింగ్ హోంలో ఎలా ఉండబోతున్నామో అనడానికి పూర్తి నిదర్శనంగా నిలుస్తోంది ఈ కార్టూన్. You may be able to go in to work on Mondays with a smile on your face if you acknowledge inside yourself that the world’s a madhouse & we’re all a bit crazy. Just make sure you try to be ‘crazy good’ at what you do…! pic.twitter.com/kyw8YRLzxH — anand mahindra (@anandmahindra) November 28, 2022 That’s a seriously depressing cartoon. But it’s made me decide to put down the phone (after tweeting this!) and ensure that my Sunday is spent with my neck straight and my head up… pic.twitter.com/seEdiAhQAC — anand mahindra (@anandmahindra) November 27, 2022 -
వారంలో ఏడు రోజులు.. వాటిలో మీకు వరస్ట్‌గా అనిపించే రోజు ఇదే కదా?
వీకెండ్ ముగిసి... మండే వస్తుందంటే చాలు ఎక్కడ లేని నీరసం ముంచుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలామంది సోమవారంనాడు ఆఫీసులకు బద్ధకంగా బాడీని ఈడ్చుకెళ్తారనొచ్చు. ఎవరో కొద్దిమంది తప్ప... స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్, ఉద్యోగులు.. అందరిదీ దాదాపు ఇదే ఫీలింగ్. అందుకే ప్రతి సోమవారం.. #మండేబ్లూస్ లేదా #మండేమార్నింగ్బ్లూస్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ మండేబ్లూస్ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీన్ని గిన్నిస్ సైతం గుర్తించింది. సోమవారాన్ని ‘వరస్ట్ డే ఆఫ్ ది వీక్’గా అధికారికంగా ప్రకటిస్తూ సోమవారం మధ్యాహ్నం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అట్లా పోస్ట్ చేసిందో లేదో... ట్విట్టర్ యూజర్స్ యమ స్పీడ్‌గా స్పందించేశారు. సోమవారానికి చెత్తవారంగా గిన్నిస్ రికార్డు ఇవ్వడం సూపర్ అంటున్నారు. ‘ఆ ఒక్కరోజే కాదు.. సుదీర్ఘ సెలవుల తరువాత వచ్చే ఏ వర్కింగ్ డే అయినా వరస్ట్ డేనే’అని మరికొందరు రీట్వీట్ చేశారు. (చదవండి: ఒక్క గంటలో అత్యధిక కప్పుల ‘టీ’ తయారు.. మహిళకు గిన్నిస్ రికార్డ్) we're officially giving monday the record of the worst day of the week — Guinness World Records (@GWR) October 17, 2022 -
బిజినెస్ మ్యాగ్నెట్ అయినా సరే.. మండే పనంటే మొరాయించుడే
బిజినెస్ మ్యాగ్నెట్ అంటే నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. కాలంతో పాటు పరుగులు తీస్తుంటారు. క్షణం కూడా వృధా చేయరు. రెండు వేల రూపాయల నోటు కింద పడితే ఆ నోటు తీస్తే ఒక్క క్షణం వేస్ట్ అవుతుందని ఫీలయ్యేంతగా పని చేస్తుంటారని మనం భావిస్తుంటాం. సినిమాల్లో దర్శకులు, పుస్తకాల్లో రచయితలు బిజినెస్ మ్యాగ్నెట్ పాత్రలను ఇలాగే మలుస్తూ వస్తున్నారు. కానీ నిజ జీవితంలో వాళ్లు సెకన్ల ముల్లుతో పోటీ పడుతూ పని చేస్తుంటారా ? ఈ విషయం తెలియాలంటే మనం బిజిగా ఉండే బిజినెస్‌మేన్‌లనే అడగాలి. కానీ మనకా కష్టం లేకుండానే కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇండియాలోనే బిజీయెస్ట్ బిజినెస్‌మేన్‌లలో ఒకరు పద్మ భూషణ్ ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక వీకెండ్ వచ్చిందంటూ మరో లెవల్లో పోస్టులు చేస్తుంటారు. కాగా 2021 నవంబరు 15 సోమవారం ఉదయం ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో నవ్వులూ పూయిస్తోంది. కేరళాలో జరిగిన ఆఫ్ రోడ్ ర్యాలీలో ఓ జీపు బురదగుంటలో చిక్కుకుని ముందుకు కదిలేందుకు మొరాయిస్తుంటే అందులో ఉన్న డ్రైవరు, పక్కన ఉన్న వ్యక్తులు ఆ జీపు ముందుకు వెళ్లేలా సహకరిస్తూ ఉత్సహపరుస్తుంటారు. ఈ వీడియోను ఉదహరిస్తూ మండే మార్నింగ్ పని చేయాలంటే ఇలాంటి ఫీలింగే కలుగుతుందంటూ ట్విస్ట్ ఇచ్చారు. -
Stock Market : నష్టాలతో మొదలైన మార్కెట్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత వారం నష్టాలతో మొదలు పెట్టి చివరకు లాభాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. ఈ సోమవారం లాభాలతో మార్కెట్ ప్రారంభం అవుతుందని ఆశించగా.. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో దేశీ సూచీలు వెనువెంటనే పాయింట్లు కోల్పోవడం ప్రారంభించాయి. మరోవైపు అంతర్జాతీయ సూచీలు సైతం మిశ్రమంగా స్పందిస్తున్నాయి, దీంతో మార్కెట్లో అస్థిరత నెలకొంది. బాంబే స్టాక్ ఎక్సేంజీ గత శుక్రవారం 52,,975 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు ఉదయం 52,985 పాయింట్లతో మొదలైంది. అయితే కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:30 గంటల సమయానికి 100 పాయింట్లు నష్టపోయి 52,875 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే వెళ్తోంది. ఉదయం 9:30 గంటల సమయానికి 6 పాయింట్లు నష్టపోయి 15,849 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.. -
ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం
-
సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత?
కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఎందుకంటే, సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం. వనసమారాధన కార్తీకమాసంలోనే ఎందుకు? గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. తక్కిన ఏ మాసమూ కూడా వనభోజనాలకు అనుకూలం కాదు. వసంత రుతువు కొంత అనుకూలమే అయినా, వడగాలులు, ఉక్కపోతా ఉంటాయి కాబట్టి అంత బాగుండదు. ఇక గ్రీష్మరుతువులో ఎండలు మెండు. ఆ తర్వాత వర్ష రుతువులో ఎప్పుడు వాన వస్తుందో తెలియని ఇబ్బంది...తర్వాత వచ్చే శరదృతువులో అందులోనూ కార్తీక మాసంలో చలి మెల మెల్లగా పాకుతూ నెల చివరికి బాగా చలిగా ఉండేలా మారుతుంది కాబట్టీ, సాయంత్రం అయ్యేసరికి చిరుచలిగాలులు వీచి ఈ రోజుకి వనభోజనాలు ముగిసాయని ఆ నాటికి కాలమే హెచ్చరిక చేస్తూంటుంది కాబట్టీ, చిరుచలీ దానితోపాటు వేడిమీ పగలంతా ఉపవాసం కాబట్టీ ఈ చలి వేడిముల వాతావరణంలో భోజనాలు – అదీ సామూహికంగా – ఎంత బాగుంటాయి. తలచుకున్నప్పుడల్లా సంతోష పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయి. ఇక తర్వాత వచ్చే హేమంత రుతువులో మంచు ఎక్కువగా కురుస్తుంది. ఆ తర్వాత శిశిర రుతువులో చెట్లన్నీ బోడిగా ఉంటాయి. నీడ అనేది దొరకని కాలం కాబట్టి అనేక అనుకూలతలు ఉన్న కార్తీకమాసంలోనే వన భోజనాలు జరుగుతాయి. ఒట్టిగా తిని పోవడానికి మాత్రమే కాకుండా, భగవంతుని పేరిట అభిషేకాన్ని చేసుకుని – లేదా – ఓ వ్రతాన్ని చేసుకుని, అన్నాన్ని భగవత్ప్రసాదంలా స్వీకరించగలిగే అవకాశముండేది ఈ మాసంలో మాత్రమే.వనసమారాధనలో ఉసిరి చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్నసమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారనీ కార్తీక పురాణం బోధిస్తోంది. -
భారత్ బంద్‌కు పిలుపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను దుర్వినియోగ పరుస్తున్నారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గత నెల 20న కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌పై ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేయాలంటే ప్రత్యేకంగా నియమించిన అధికారుల అనుమతి కావాలంటూ పేర్కొంది. అలాగే సామాన్యులనైనా(ఎస్టీ, ఎస్సీలు కాకుండా మిగతా కులాలకు చెందినవారు) అరెస్ట్ చేయాలంటే సీనియర్ ఎస్పీ అనుమతి కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం బలహీనపడుతుందని భావించి బీజేపీ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. దేశవ్యాప్తంగా పలు దళిత సంఘాలు సోమవారం ఆందోళనలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్రాసిటీ యాక్ట్ అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంచాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్(ఎన్సీఎస్టీ), నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్స్(ఎన్సీఎస్సీ)లు డిమాండ్ చేశాయి. -
రేపు లాంఛనాలతో అర్జన్ సింగ్ అంత్యక్రియలు
-
రేపు లాంఛనాలతో అర్జన్ సింగ్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాయుసేన వీరుడు మార్షల్ అర్జన్ సింగ్ భౌతిక కాయానికి రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయన గౌరవార్థం సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని తక్కువ ఎత్తులో ఎగురవేయాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అర్జన్ సింగ్ శనివారం ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అర్జన్ సింగ్ 44 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎయిర్ ఫోర్స్‌లో 60 రకాల విమానాలను నడిపిన అనుభవం ఆయనది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా తీర్చిదిద్దడంలో అర్జన్ సింగ్ విశేషంగా కృషి చేశారు. -
తడిసి ముద్దయ్యారు
ఏలూరు (మెట్రో) : పగలంతా ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరైన ఏలూరు నగర ప్రజలకు సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఒక్కసారిగా ఊరట కల్గింది. సాయంత్రం వరకు ఉష్ణ తాపంతో అవస్థలు పడిన ప్రజలు వాతావరణంలో వచ్చిన మార్పులతో కాస్త సేద తీరారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. మూడు రోజుల పాటు భానుడు తన విశ్వరూపాన్ని చూపించినా నాలుగో రోజైన సోమవారం వరుణుడు కరుణించడంతో నగర ప్రజలకు ఉక్కబోత, ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గింది. -
రేపటి ‘మీ కోసం’ రద్దు
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్లో ఈనెల 5న నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమం జి.వీరపాండియన్ ఆదేశం మేరకు రద్దు చేసినట్లు డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్‌కు రావొద్దని తెలియజేశారు. -
సుర్రుమనిపించిన సూరీడు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : భానుడు నిప్పులు చెరిగాడు. ఎండ ప్రచండంతో జిల్లా ప్రజలు విలవిల్లాడారు. సోమవారం జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడినా.. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకూ 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే చవిచూసిన ప్రజలు ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో తల్లడిల్లారు. వడగాడ్పుల తీవ్రత పెరగడంతో జనం రోడ్లపైకి రాలేకపోయారు. వృద్ధులు, చిన్నారులు వేడికి ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి వేళలోనూ వదలని వేడి సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎండతీవ్రత కనిపించింది. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ప్రజలెవరూ మధ్యాహ్నం 11 గంటల తరువాత రోడ్లపైకి రావడానికి సాహసం చేయలేకపోయారు. రాత్రి 10 గంటలకు కూడా వేడి గాలులు వదల్లేదు. ఇళ్లల్లోని గోడలు, ధరించిన వస్త్రాలు వేడెక్కి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇళ్లల్లోని మంచినీళ్లు సైతం కాగిపోయాయి. నాసా హెచ్చరికలతో ఆందోళన రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్టు నాసా ప్రకటిం చింది. ఆ 8 జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇలానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారంతో అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నాలుగు రోజులపాటు ప్రజలు ఎండల్లో తిరగకూడదంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వడదెబ్బ బారిన పడినవారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మార్కెట్లకు నేడు సెలవు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు సెలవు. మే 1, సోమవారం మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పని చేయవు. మళ్లీ ట్రేడింగ్ 2వతేదీ మంగళవారం ఉదయం యథావిధిగా మొదలవుతుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం. గత వారం సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయి అధిగమించగా, నిఫ్టీ సైతం మొట్టమొదటిసారి 9,350 అధిగమించి ఆల్ టైం హైని రికార్డ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గరిష్ట స్థాయిలను నమోదు చేయడం విశేషం. శుక్రవారం సెన్సెక్స్ 29,918 వద్ద, నిఫ్టీ 9,304 వద్ద ముగిశాయి. డాలర్ మారకంలో రుపీ కూడా చాలా బలంగా కొనసాగుతోంది. ఒకదశలో 64 స్థాయిని బ్రేక్ చేసిన రుపాయి గత సెషన్ లో రూ.64.24వద్ద స్థిరపడింది. కాగా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రతికూల సంకేతాలతో లాభాలతో ముగిశాయి. ప్రధానంగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో సెంట్రిస్ట్ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రన్ ముందున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బూస్ట్ లభించిన సంగతి విదితమే. -
జిల్లాలో అందరికీ ఆరోగ్యబీమా అందించడమే లక్ష్యం
ఏలూరు అర్బన్: జిల్లాలో అందరికీ ఆరోగ్యబీమా అందించే లక్ష్యంతో హెల్త్ ఫర్ ఆల్ అనే పధకాన్ని అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్, కె. కోటేశ్వరి తెలిపారు. సోమవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎంహెచ్‌వో కోటేశ్వరి మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ ఆరోగ్య పధకంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీములో ఉద్యోగులు, జర్నలిస్ట్‌లకు ఆరోగ్యబీమా అందేదని అన్నారు. ఈ నేపథ్యంలో పేద, ధనిక అనే భేధం లేకుండా సమాజంలో అన్ని వర్గాల వారికి ఆరోగ్య బీమా కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏడాదికి రూ. 1200ల సొమ్ము చెల్లించడంతో ఏడాదికి రూ. 2 లక్షల వైద్య సేవలు పొందే వీలు కలిగించిందన్నారు. ఈ పధకంలో చేరేవారు ఏ వయసువారైనా, రోగాలతో బాధపడుతున్నవారైనా చేరేందుకు అర్హులే అన్నారు. ఐతే ఈ పధకం పట్ల ప్రజల్లో అనుకున్నంత అవగాహన లేనందున ఎక్కువ మంది ఈ పథకంలో చేరలేదన్నారు. వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలపై ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఇంటింటికీ అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆరోగ్య మిత్రలు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని పధకంలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ పధకాలు ఎలా అమలౌతున్నాయి సోమవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎంపీహెచ్‌ఈవో, సీవోలతో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటేశ్వరి జిల్లాలో అమలౌతున్న ఆరోగ్య పధకాలపై సమీక్ష నిర్వహించారు. మరింత సమర్ధవంతంగా పధకాలను అమలు చేయాలని ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో yీ ఐవో డాక్టర్ మోహనకృష్ణ. ఆర్బీఎస్కే డాక్టర్ కె. సురేష్‌బాబు, డిప్యూటీ డెమో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో అందరికీ ఆరోగ్యబీమా అందించడమే లక్ష్యం
ఏలూరు అర్బన్: జిల్లాలో అందరికీ ఆరోగ్యబీమా అందించే లక్ష్యంతో హెల్త్ ఫర్ ఆల్ అనే పధకాన్ని అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్, కె. కోటేశ్వరి తెలిపారు. సోమవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎంహెచ్‌వో కోటేశ్వరి మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ ఆరోగ్య పధకంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీములో ఉద్యోగులు, జర్నలిస్ట్‌లకు ఆరోగ్యబీమా అందేదని అన్నారు. ఈ నేపథ్యంలో పేద, ధనిక అనే భేధం లేకుండా సమాజంలో అన్ని వర్గాల వారికి ఆరోగ్య బీమా కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏడాదికి రూ. 1200ల సొమ్ము చెల్లించడంతో ఏడాదికి రూ. 2 లక్షల వైద్య సేవలు పొందే వీలు కలిగించిందన్నారు. ఈ పధకంలో చేరేవారు ఏ వయసువారైనా, రోగాలతో బాధపడుతున్నవారైనా చేరేందుకు అర్హులే అన్నారు. ఐతే ఈ పధకం పట్ల ప్రజల్లో అనుకున్నంత అవగాహన లేనందున ఎక్కువ మంది ఈ పథకంలో చేరలేదన్నారు. వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలపై ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఇంటింటికీ అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆరోగ్య మిత్రలు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని పధకంలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ పధకాలు ఎలా అమలౌతున్నాయి సోమవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎంపీహెచ్‌ఈవో, సీవోలతో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటేశ్వరి జిల్లాలో అమలౌతున్న ఆరోగ్య పధకాలపై సమీక్ష నిర్వహించారు. మరింత సమర్ధవంతంగా పధకాలను అమలు చేయాలని ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో yీ ఐవో డాక్టర్ మోహనకృష్ణ. ఆర్బీఎస్కే డాక్టర్ కె. సురేష్‌బాబు, డిప్యూటీ డెమో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంలో రేపు ఓటుకు కోట్లు కేసు విచారణ
-
విన్నపాలు వినవలె..
వివిధ సమస్యలపై ‘మీ కోసం’లో కలెక్టర్‌కు అర్జీలు అనంతపురం అర్బన్ : వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదని కలెక్టర్ కోన శశిధర్‌కు దివ్యాంగుడు గౌతమ్ తల్లిదండ్రులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసంలో గౌతమ్ పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం 48వ డివిజన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో దివ్యాంగుడు గౌతమ్ పరిస్థితిని వారి తల్లిదండ్రులు గురునాథ్‌రెడ్డికి వివరించారు. పింఛన్ కోసం పలుమార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పింఛన్ మంజూరు చేయలేదని చెప్పారు. వారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే సూచించారు. దీంతో గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు నిమ్మల నాగరాజు, గోపాల్ మోహన్, కసునూరు శ్రీనివాసులు, చంద్రమోహన్ రెడ్డి, తిరుమలరెడ్డి, రాజునాయక్, గుజ్జల శివయ్యలు కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. దీంతో పింఛను మంజూరుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. న్యాయం చేయండి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కోన శశిధర్‌కి మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్లు విన్నవించుకున్నారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక వ్యవహారంలో నిలిపివేసిన జాబితాను పునరుద్ధరించాలని వారు కోరారు. దీంతో డీఎంహెచ్ఓ వెంకటరమణను కలెక్టర్ పిలిపించి మాట్లాడి వివరాలు తీసుకున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈఎస్ఐ ఆస్పతి నిర్మించాలని వినతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ఈఎస్ఐ కార్పొరేషన్ అంగీకరించిందని కలెక్టర్‌కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. అర్జీ ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర ఉన్నారు. -
జన్మభూమిని బహిష్కరించిన తలముడిపి సర్పంచ్
గాలివీడు : మండలపరిధిలో తలముడిపిలో సోమవారం జన్మభూమి గ్రామసభను ఆ గ్రామ సర్పంచ్ మద్దిరాల శివశంకర్‌రెడ్డి(కంచంరెడ్డి) బహిష్కరించారు. ప్రభుత్వం కక్షపూరితమైన పాలన సాగిస్తోందని, ఈ గ్రామసభలు ప్రజాసమస్యల పరిష్కరానికో, పథకాలు అందజేసేందుకో నిర్వహించడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు కాదని, కేవలం జన్మభూమి కమిటీ సభ్యులే గ్రామసభలు జరపడం దారుణమన్నారు. టీడీపీ గ్రామసభలుగా ప్రభుత్వాధికారులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదీ వరుస
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్లు రద్దయి 27 రోజులు దాటింది. అయినా.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. బ్యాంకుల ముందు క్యూలు కొనసాగుతున్నాయి. ఏటీఎంలు ఎప్పటిలా మూతపడి ఉంటున్నాయి. నామమాత్రంగా పనిచేస్తున్న ఏటీఎంల ముందు జనం బారులు తీరుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే రోజులో కొంతసేపు పనిచేస్తుండగా, మిగిలిన ఏటీఎంలు దాదాపు మూతపడి ఉంటున్నాయి. దీంతో డబ్బుల కోసం బ్యాంకులను ఆశ్రయించక తప్పడం లేదు. ఉదయం 8గంటల నుంచే వాటి ముందు రద్దీ మొదలవుతోంది. తోపులాటలు, వాగ్వాదాలతో బ్యాంక్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం జిల్లాలోని అన్ని బ్యాంకులు జనంతో కిక్కిరిసిపోయాయి. చాలా బ్యాంకులకు నగదు సకాలంలో రాకపోవడంతో.. చెస్ట్ నుంచి నోట్లు వచ్చేవరకు వేచిచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నిచోట్ల వచ్చిన కొంత సొమ్ము కూడా కొద్దిసేపట్లోనే అయిపోవడంతో నో క్యాష్ బోర్డులను తగిలించారు. రోజంతా నిలబడ్డా కనీసం రూ.వెయ్యి కూడా బ్యాంకు సిబ్బం ది ఇవ్వడం లేదని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. రిజర్వు బ్యాంకు విధించిన పరిమితి మేరకు కూడా నగదును ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలు బ్యాంకుల వద్ద ఖాతాదారులు సిబ్బం దితో వాగ్వాదానికి దిగుతున్నారు. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వస్తుండటంతో వారిని లోపలికి అనుమతించకుండా గంటల కొద్దీ బయటే వేచివుండేలా చేస్తున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు వంటివి లేక ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఖాతాదారులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా బ్యాంకర్లు కల్పించడం లేదు. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల చొప్పున ఇవ్వడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పింఛన్‌దారులు రూ.వెయ్యి కోసం మైళ్ల దూరం ప్రయాణం చేసి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి.. తిండితిప్పలూ లేక పడరాని పాట్లు పడుతున్నారు. కొందరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడినా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లేసరికి డబ్బులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. పొదుపు ఖాతాలు తీసుకోవాల్సిందే ! జన్‌ధన్ ఖాతాలలో డిపాజిట్లకు, నగదు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడంతో ఆ ఖాతాలు ఉన్నవారు కొత్తగా పొదుపు ఖాతాలు తీసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఇప్పటికీ ఖాతాదారులు తమ అకౌంట్ నుంచి కనీసం రూ.4 వేలు తీసుకోవాలన్నా చుక్కలు కనబడుతున్నాయి. రూ.2 వేల నోట్లు తప్ప చిల్లర దొరకని పరిస్థితి ఉంది. రూ.500 నోట్లు వచ్చినా సామాన్యులకు అందటం లేదు. అవన్నీ బడాబాబుల చేతుల్లోకి వెళ్లి నల్లధనంగా మారిపోయాయనే ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. రూ.100 నోట్ల చలామణి కూడా తగ్గిపోయింది. దీంతో రూ.2 వేల నోట్లకు చిల్లర దొరడం కష్టసాధ్యంగా మారిపోయింది. -
పరిహారంపై ప్రకటన చేయాలి
చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్నేని నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. సోమవారం చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రజా చైతన్య రైతు సదస్సు నిర్వహించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాలువ తవ్వకం పనులను అడ్డుకోవాలని తీర్మానించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నాగేంద్రబాబు విమర్శించారు. సమస్యలపై పోరాటం చేస్తే అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చట్ట ప్రకారం రైతులకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుల భూములను కాజేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు జిల్లా అంతా ఒకే తరహా నష్టపరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. మెట్ట ప్రాంత రైతులకు సాగు నీటి వసతి కల్పించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని మంజూరు చేశారన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు రైతుల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని కోరారు. భారతీయ కిసాన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో జిల్లా కలెక్టర్ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పీతల సుజాత సైతం రైతుల బాధలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా చైతన్య సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.అమర్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు 4 రెట్లు నష్ట పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, చింతలపూడి ఎత్తిపోతల పథకం అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు అలవాల ఖాదర్‌బాబురెడ్డి, చిట్లూరి అంజిబాబు, రైతులు పాల్గొన్నారు. -
దేదీప్యమానం
- కార్తీక కడ సోమవారం పోటెత్తిన ఆలయాలు - శ్రీశైలంలో లక్షదీపోత్సవం - ఆకట్టుకున్న శివమణి శివతాండవలయ విన్యాసం - మహానందిలో లక్ష కుంకుమార్చన శ్రీశైలం: కార్తీక కడ సోమవారం.. జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మల్లన్న దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఉచిత, ప్రత్యేక దర్శన కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి 6గంటలకు పైగా సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి 3గంటలకు పైగా, అభిషేకానంతర దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. సోమవారం రాత్రి ఆలయప్రాంగణంలో లక్షదీపోత్సవం ముగిసిన వెంటనే ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి ప్రదర్శించిన శివతాండవ లయ విన్యాసం ఆకట్టుకుంది. మహానందిలో.. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి సోమవారం లక్షకుంకుమార్చన పూజలు వైభవంగా జరిగాయి. నంద్యాలకు చెందిన డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులు దాతలుగా పాల్గొన్నారు. స్థానిక హోమశాలలో రుద్ర, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి పూజలు చేశారు. ఆదివారం లక్ష బిల్వార్చనలో ఉపయోగించిన బిల్వాలను పురాతన కోనేరులో నిమజ్జనం చేశారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ బి.శంకర వరప్రసాద్, వేదపండితులు రాధాకృష్ణశర్మ, రవిశంక అవధాని తదితరులు పొల్గాన్నారు. భక్తులమధ్య తోపులాట...! భక్తులు ఎక్కువగా రావడంతో సోమవారం మహానందిలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. రుద్రగుండం కోనేరు ఎదుట ఏర్పాటు చేసిన అదనపు టికెట్ కౌంటర్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. -
డీపీఆర్సీ నిర్మాణ పనులపై కలెక్టర్ అసంతృప్తి
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని జిల్లా పరిషత్తు అవరణంలో రూ.కోటి యాభై లక్షలతో నిర్మించిన డీపీఆర్సీ పనులను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పరిశీలించారు. సంబంధిత నిర్మాణ పనులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల్లో ఫినిషింగ్ వర్కు సరిగా లేదన్నారు. ఎక్కడెక్కడ ఏం ఏర్పాటు చేయాలో అవన్నీ జాగ్రత్తగా బిగించాలని ఆదేశించారు. సంపు మ్యాన్‌హోల్ బయటకు కనిపించకుండా చేయాలని సూచించారు. మిగతా పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
ఏపీలో కిక్కిరిసిన పంచారమ క్షేత్రాలు
-
నిజామాబాద్ జిల్లాలో తొలి, చివరి రోజు!
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా నేటితో రెండు జిల్లాలుగా మారనుంది. కొత్త జిల్లాగా కామారెడ్డి ఏర్పడనుంది. అయితే, సోమవారం పుట్టిన పిల్లలందరికీ ఆ రోజు చారిత్రాత్మకం కానుంది. సోమవారం జన్మించిన పిల్లలకు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లో నిజామాబాద్ జిల్లాగానే ఉంటుంది. అంటే ఒక్క రోజు నిజామాబాద్‌లో ఉండి, మిగతా జీవిత కాలం మొత్తం కామారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. నిజామాబాద్ జిల్లాలో ఇదే తొలి, చివరి రోజు కావడంతో ఆ రోజు వారికి మరుపురాని రోజుగా మిగులనుంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో సోమవారం సుమారు 200లకు పైగా పిల్లలు పుట్టారని అంచనా. అలాగే మంగళవారం పుట్టే పిల్లలకు కామారెడ్డి జిల్లా బర్త్ సర్టిఫికేట్ లభిస్తుంది. దీంతో సోమ, మంగళవారాల్లో జన్మించిన పిల్లలకు ఈ రెండ్రోజులుగా ప్రత్యేక రోజులుగా మారనున్నాయి. గుర్తుండిపోయే రోజు: అర్షియా, తిర్మలాపూర్ సోమవారం నాడు బాబు పుట్టాడు. నిజామాబాద్ జిల్లాలో పుట్టాడు కనుక నిజామాబాద్ జిల్లా పేరుతో బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. మంగళవారం నుంచి కొత్త జిల్లాలోకి అడుగు పెడతాడు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. -
కోటిరెడ్డి సర్కిల్లో రోడ్డు ప్రమాదం
కడప అర్బన్ : కడప నగరం కోటిరెడ్డి సర్కిల్లో సోమవారం రెడ్ సిగ్నల్స్ పడిన సమయంలో పులివెందుల వైపు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ04 జెడ్ 0130) ముందువైపునున్న మోటారు సైకిల్, ఆటోలను వేగంగా వచ్చి ఢీకొంది. ఆ సమయంలో మోటారు సైకిల్పైనున్న ఇరువురు, ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఆనందకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లక్ష్మీదేవికి బంగారు కిరీటం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి భక్తులు బంగారు కిరీటాన్ని సమర్పించారు. లక్ష్మీదేవి అమ్మవారికి 390 గ్రాముల బంగారు కిరీటం, 51.240 గ్రాముల బంగారు బొందు, సూత్రాలు, తురాయి, దుద్దులు, పార్వతీ అమ్మవారికి 46.220 గ్రాముల బంగారు సూత్రాలు, బొందు సమర్పించారన్నారు. అనంతరం లక్ష్మీదేవి అమ్మవారికి కిరీటం అలంకరించారు. దాతలు, ఆలయ ట్రస్టీ సభ్యులు అడ్డాల ప్రసాద్, నాళం బాబి, తమిరి వెంకటేశ్వరరావు, కోరుకొండ సుబ్బారావు, అర్చకులు నాగబాబు, మల్లేశ్వరరావు, కిష్టప్ప, భక్తులు ఆదిమూలం సోమేశ్వరరావు, కంచర్ల సాయి పాల్గొన్నారు. -
పెద్దశేషుడిపై పరందాముడి దర్శనం
-
శ్రీవారికి సీఎం పట్టువస్రాలు సమర్పణ
సాక్షి,తిరుమల: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 7.40 గంటలకు సీఎం సతీసమేతంగా ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు సీఎంకు పట్టువస్రంతో తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంతరం పచ్చకర్పూరపు వెలుగులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళరూప విశేషాలు, క్షేత్ర సంప్రదాయాలు అర్చకులు సీఎంకు వివరించారు. తర్వాత రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావుæ, జేఈవో కే ఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. తర్వాత సీఎం చంద్రబాబు పెద్ద శేషవాహన సేవలోని మలయప్పస్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రులు మాణిక్యాలరావు, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, నారాయణ పాల్గొన్నారు. -
పెద్దశేషుడిపై పరందాముడి దర్శనం
– వైభవంగా శ్రీవారి వాహన సేవల ఆరంభం – తిరుమలకొండ మీద బ్రహ్మోత్సవ కాంతులు సాక్షి,తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశుడు కొలువు దీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యత. అందుకే తొలి రోజు శేషవాహనం మీదే ఊరేగే సంప్రదాయంగా వస్తోంది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వాహన మండపంలో వేంచేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబర వస్త్ర, సుగంధ పరమళ పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. రాత్రి 9 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాల, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. ఉభయదేవేరులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయం పొందారు. వాహన సేవ ముందు భజన బృందాల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాలు, నగర సంకీర్తనలు భక్తులను అలరించాయి. పుష్పాలంకరణ, విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం, పురవీధులు స్వర్ణకాంతులీనాయి. -
ఆపరేషన్ గజ ప్రారంభం
– అడ్డకొండకు చేరిన గజరాజు – ఫారెస్ట్ అధికారుల మోహరింపు – హైదరాబాద్ నుంచి షూటర్లు, డాక్టర్లు – ననియాల నుంచి శిక్షణ ఏనుగులు రామసముద్రం/రామకుప్పం: రామసముద్రం మండలంలో రెండు రోజులుగా బీభత్సం సృష్టించి, ఓ వ్యక్తిని తొక్కి చంపిన గజరాజును బంధించేందుకు అటవీశాఖ అధికారులు సోమవారం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆదివారం రోజంతా హల్చల్చేసిన ఏనుగు రాత్రికి ఎర్రప్పపల్లె, కొత్తూరు, ఎం.గొల్లపల్లె, దిన్నెపల్లె, ఊలపాడు మీదుగా రామసముద్రం సమీపంలోని సబ్ స్టేషన్‌లోని చింతతోపులోకి చేరుకుంది. అక్కడ రాత్రంతా పోలీస్, అటవీశాఖ అధికారులు గస్తీ చేశారు. సోమవారం గజరాజు సమీపంలోని అడ్డకొండ అడవిలోకి చేరుకున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా కుప్పం, తిరుపతి, పలమనేరు ప్రాంతాల నుంచి పలువురు అటవీశాఖ అధికారులు రామసముద్రం మండలానికి చేరుకున్నారు. గజరాజు వెళ్లిన జాడలను గుర్తించేందుకు అడ్డకొండ అడవిలోకి సిబ్బంది చేరుకున్నారు. అక్కడ గజరాజును గుర్తించి కిందకు దారిమళ్లించే ప్రయత్నం చేశారు. గజరాజు ఎదురు దాడికి పాల్పడగా సిబ్బంది కింద ఉన్న ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి దాని అలికిడిని గుర్తిస్తూ పహారా నిర్వహించారు. కిందికి రప్పించడం తమతో సాధ్యం కాదని సిబ్బంది తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ననియాల ఏనుగుల సంరక్షణ కేంద్రం నుంచి శిక్షణ పొందిన ఏనుగులు వినాయక్, జయంత్లను అడ్డకొండ ప్రాంతానికి తరలించారు. వాటి ఘీంకారంతో అడవిలో ఉన్న ఏనుగు బయటకు వస్తుందని భావిస్తున్నారు. బంధించేందుకు హైదరాబాద్ నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే షూటర్లు, వైద్యులు కూడా చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆపరేషన్ ప్రారంభం కావడంతో అటవీశాఖ, పోలీసు బలగాలను కొండచుట్టూ మొహరించారు. జనం సమీపానికి రాకుండా దూర ప్రాంతానికి తరిమేశారు. చీకటి కావస్తున్నా గజరాజు అడవి నుంచి బయటకు రాకపోవడంతో అటవీశాఖ సిబ్బంది టపాకాయలు పేల్చుతూ అరుపులు, కేకలతో దాన్ని కిందకు మళ్లించే యత్నంచేశారు. చీకటి పడే సమయానికి అడవిలో నుంచి వెనుదిరిగిన ఏనుగు టపాకాయల శబ్ధానికి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో చక్రపాణి, అటవీశాఖ సీఐ, ఎస్‌లు, చిత్తూరు, పుంగనూరు, కుప్పం, పలమనేరు ప్రాంతాల నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది, పుంగనూరు సీఐ రవింద్ర, ఎస్ఐ సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఏనుగును పట్టుకునే దృశ్యాన్ని చూసేందుకు ఆ ప్రాంతానికి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
కైలాసనాధ కోనలో భక్తుల రద్దీ
నారాయణవనం: ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన కైలాసనాధకోనలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఇటీవల పదవీ విరమణ పొంది దేవాదాయ శాఖ అటెండర్ గురవయ్య కామాక్షాంభిక, కైలాసనాధునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుమారు 600 మంది భక్తులకు, పర్యాటకులకు అన్నప్రసాదాలను ఆయన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది గుర్రప్ప, పుత్తూరు సదాశివేశ్వరస్వామి ఆలయ కమిటి సభ్యులు శివ, కృష్ణ, మునిరాజ తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లాకు రానున్న సీఎం
రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణకు భూమి పూజ సాక్షి, రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లా పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 2:50 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. రూ.200 కోట్లతో చేపట్టే విమానాశ్రయ విస్తరణపనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం రాష్ట్రంలోని విమానాశ్రయాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య చర్చలు జరగనున్నాయి. అనంతరం అవగాహన ఒప్పందం కుదరనుంది. తిరిగి సాయంత్రం 5:15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారని సమాచార పౌర సంబంధాల శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఉద్యమంపై ఉక్కుపాదం
రెండిళ్లకు ఒక పోలీస్ చొప్పున పహారా. రైతు పొలానికి వెళ్లాలన్నా.. మహిళలు పచారీ సామగ్రి తెచ్చుకోవాలన్నా.. పోలీసుల అనుమతి తప్పనిసరి. భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కె.బేతపూడి గ్రామాల్లో అప్రకటిత కర్ఫూ్య నెలకొంది. అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. పోలీస్ పహారా నడుమ ఆ మూడు గ్రామాల మధ్య గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణ పనులను చకచకా సాగిస్తున్నారు. 30 గ్రామాలను కాలుష్య కాసారంగా మార్చే ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని అన్నివర్గాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు 600 మంది పోలీసులను వారిపై ప్రయోగించింది. ఫుడ్ పార్క్‌కు యంత్రసామగ్రి తరలింపు భీమవరం అర్బన్/నరసాపురం రూరల్ : పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపాలంటూ 40 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం చకచకగా పూర్తి చేసుకుంటోంది. నిర్మాణంలో భాగంగా భారీ భద్రత నడుమ సోమవారం యంత్రాలను ఫ్యాక్టరీకి తరలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య రొయ్యల ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదుతో ఆందోళనకారుల అరెస్ట్ చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, మత్స్యకారులు నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఫ్యాక్టరీకి దాదాపు 100 లారీల్లో యంత్ర, నిర్మాణ సామగ్రి వచ్చింది. ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం ఉదయమే ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఒక ఏఎస్పీ, నలుగులు డీఎస్పీలు, 22 మంది సీఐల సహా దాదాపు 600 మంది పోలీస్ బలగాలను మోహరించారు. ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఇతర ప్రాంతాలను ఆయా గ్రామాల్లోకి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు మధ్య ముడిసరుకును తరలిస్తున్న లారీలను ఎస్కార్ట్‌తో ఫ్యాక్టరీ లోపలికి పంపించారు. సర్వత్రా నిరసనలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో నిర్మించే గోదావరి మెగా ఫుడ్ పార్కు నిర్మించవద్దని రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఫుడ్ పార్కు నిర్మాణ యజమానులకు అధికారులు, ప్రజాప్రతినిధులు కొమ్ముకాయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. చిన్న చిన్న కేసులకు పోలీసులు బాధితులను కాళ్లరిగేలా తిప్పించుకుంటారు. సమస్యలను కూడా వినరు. కానీ బడాబాబులకు చెందిన ఫ్యాక్టరీ నిర్మాణానికి యంత్రాలను పంపించేందుకు 600 మంది పోలీసులను మోహరించడంపై స్థానికులు నివ్వెరపోయారు. నిర్మాణ, యంత్ర సామగ్రిని తరలించేందుకు ముందుగానే పోరాట కమిటీ నాయకులను, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్పార్కుపై సీపీఎం, సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తదితరులు ఫుడ్ పార్కును నిలుపుదలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. -
వైభవంగా గోవిందుడి పవిత్రోత్సవాలు
తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసివైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, నారికేళ జలం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేశారు. రూ.500లు చెల్లించి ఇద్దరు గృహస్తులు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. కార్యక్రమంలో పెద్దజీయంగార్ స్వామి, చిన్నజీయంగార్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
వైభవోపేతం.. విఘ్ననాథుని రథోత్సవం
– భక్తజన సంద్రంగా కాణిపాకం కాణిపాకం(ఐరాల) : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు బాహుదాతీరంలో భక్తులు పోటెత్తడంతో స్వామివారి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. సకల దేవతల ఆశీర్వాదాలతో అష్టదిక్పాలకులు ముందు వెళుతుండగా గణేష్ మహరాజ్‌కీ జై అనే భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామివారి రథం కోటిసూర్య ప్రభలతో ముందుకు సాగింది. అంతకుముందు స్వామివారి మూల విరాట్‌కు సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించారు. సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్వాంకతులైన సిద్ధి, బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అలంకార మండపంలో ఉంచి విశేష పూజలు నిర్వహించారు. తదుపరి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక అలంకరణతో సిద్ధంగా ఉంచిన రథంపై ఆశీనులను చేసి రథోత్సవం నిర్వహించారు. అశ్వాలు, వృషభరాజులు వెంటరాగా స్వామివారు రథంపై కాణిపాక వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ ఉత్సవానికి కాకర్లవారిపల్లి వాసి కె.మీనాకుమారి, కాణిపాకం వాసులు పూర్ణచంద్రారెడ్డి, కె.హరిప్రసాద్‌రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, వెస్ట్ సీఐ ఆదినారాయణ, స్థానిక ఎస్ఐలు నరేష్ బాబు, శివశంకర్, ధరణీధర్, లక్ష్మీకాంత్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రథోత్సవంలో ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ మురళి బాలకష్ణ, ఏసీ వెంకటేశు, ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, చిట్టెమ్మ, సూపరింటెండెంట్లు రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు. -
పేద బ్రాహ్మణులకు రుణాలు
ఏలూరు సిటీ : బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులకు రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు సొసైటీ సీఈవో అభిజిత్ జయంత్ చెప్పారు. ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని శ్రీశ్రీ విద్యాసంస్థల కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు ఎస్.పేరిశాస్త్రి, డైరెక్టర్ ఎంబీఎస్ శర్మ, కార్యవర్గ సభ్యులు జి.వెంకటరామయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ 2015 అక్టోబర్ 1న సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేశామన్నారు. బ్రాహ్మణ సమాజంలోని పేదలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ సొసైటీని బలోపేతం చేస్తూ ప్రతి జిల్లాలో సభ్యులను చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పేద బ్రాహ్మణ మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయలనూ తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 500 మంది సభ్యులు ఇప్పటికే నమోదు చేయించుకున్నారని తెలిపారు. ఈ సొసైటీని బ్యాంకుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దీనిలో డబ్బులు దాచుకునేవారికి 4.5 శాతం వడ్డీ ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. అరుంధతి పేరుతో మహిళలకు, వశిష్ట పేరుతో పురుషులకు రుణాలు అందించే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఒక్కో గ్రూపులో ముగ్గురు నుంచి పది మంది సభ్యులు ఉండాలని, ఒక్కో గ్రూపుకు రూ. 25 వేలు రుణంగా అందిస్తామని, ఈ రుణాన్ని సంవత్సర కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని అగ్రహారంలో బ్రాహ్మణ బజార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బ్రాహ్మణ బజార్లో బ్రాహ్మణులు తయారు చేసిన వస్తువులను విక్రయించుకునేలా కలెక్టర్ కాటంనేని భాస్కర్, డీఆర్డీఏ పీడీలతో చర్చిస్తామని తెలిపారు. -
హిందూ ధర్మం ఆధారంగా మోక్షం
ద్వారకా తిరుమల : హిందూ ధర్మం ఆధారంగానే ప్రపంచంలో వివిధ మతాల మధ్య సామరస్యం, శాంతి, అలాగే మోక్షం లభించగలవని, ఎవరూ మరొక మతంలోకి మారనవసరం లేదని హిందూ దేవాలయాల ప్రతిష్ఠాన పీఠాధిపతి (హైదరాబాద్) కమలానంద భారతీ స్వామీజీ అన్నారు. ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామిజీ మాట్లాడుతూ హిందూ ధర్మం, సంస్కృతి, జీవన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. -
పుష్పాలంకరణలో విద్యా గణపతి
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడిలో వేంచేసియున్న విద్యా గణపతిని సోమవారం చామంతి, జాజి, కనకాంబరం, బంతి, మొరియం పుష్పాలతో అలంకరించారు. నాచు చినబాబు, తుందుర్రు సూరిబాబు సహకారంతో ఈ అలంకరణ చేసినట్టు అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. -
రహదారి విస్తరణకు భూములివ్వలేం
అనంతపల్లి (నల్లజర్ల): తాడిపూడి, పోలవరం కాలువల తవ్వకంలో తమ భూములన్నీ పోయాయని, మిగిలిన కాస్త పొలాన్ని రోడ్డు విస్తరణలో తీసుకుంటామంటున్నారని, ఇలా అయితే తామెలా బతకాలని నల్లజర్ల మండలంలోని అనంతపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణకు ప్రత్యమ్నాయ మార్గం చూడాలంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ణప్తి చేస్తున్నారు. సోమవారం రైతులు గద్దే జయహరి రావు, గన్నమని ప్రసాదు, భోగవల్లి శ్రీనివాస్, జాలపర్తి సత్యనారాయణ, తాతిన చైతన్య విలేకరులతో మాట్లాడారు. కొంత భూమి గతంలో రోడ్డు విస్తరణలో, మరికొంత భూమి తాడిపూడి కాలువు, పోలవరం కాలువ తవ్వకాల్లో పోయిందని అన్నారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ తమకు ఇలా భూములు పోతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఏడు తరాలుగా ఈ భూములు సాగుచేసుకుంటున్నామని, ఉన్న నాలుగెకరాల్లో మూడెకరాలు ఇప్పుడు రోడ్డు విస్తరణలో పోనుందని రైతు గన్నమని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. భూములు సేకరించే ముందు కనీసం రైతులతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్నారు. ప్రస్తుతం ఉన్న రహదారి పక్కనే అవసరమైనంత ప్రభుత్వ భూమి ఉండగా రైతుల భూములు తీసుకోవడం సమంజసం కాదంటున్నారు. గన్నమని రామదుర్గా ప్రసాద్, బోయపాటి సుబ్బారావు, మద్దిపాటి రామకష్ణ, గద్దే యజ్ణేశ్వరావు ఉన్నారు. -
రేపు వరసిద్ధుడి రథోత్సవం
ఐరాల: కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం జరగనున్న రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆలయ మూషిక మండపంలో రథ కలశాలు, గొడుగులు,బ్రహ్మను ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం,ప్రత్యేక పూజలు చేశారు.ఆ తరువాత గొడుగులు, రథసారథి ,బ్రహ్మకు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించి రథంపై ప్రతిష్టించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. -
పండగవేళ విషాదం
దెందులూరు : పండగ వేళ.. సోమవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. దెందులూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. దెందులూరు ఎస్ఐ ఎన్.ఆర్.కిషోర్‌బాబు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామానికి చెందిన భార్యాభర్తలు మాకినేని నాగవెంకట శ్రీనివాస్ (40), మహాలక్ష్మి సోమవారం ద్విచక్రవాహనంపై ఏలూరు వైద్యశాలకు బయలుదేరారు. దెందులూరు వద్దకు వచ్చేసరికి పెట్రోల్ అయిపోవడంతో బంకుకు వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని వస్తుండగా వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య కాలు నుజ్జునుజ్జయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. తెడ్లం గ్రామంలో.. టి.నరసాపురం : తెడ్లం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తోకల రాంబాబు (30) మరణించాడు. ఎస్ఐ కె.నాగేంద్రప్రసాద్ కథనం ప్రకారం.. రాంబాబు స్థానిక రైతు సుబ్బారావు వద్ద కొంతకాలంగా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై ఆ రైతు పొలం నుంచి రాంబాబు తన కుమార్తెను ఎక్కించుకుని తెడ్లం వస్తుండగా, చింతలపూడి నుంచి కామవరపుకోట వైపు వెళ్లే వ్యాన్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం వెనుక కూర్చొన్న రాంబాబు కుమార్తె సమీపంలోని తుప్పల్లో పడటంతో ఆమెకు ఎటువంటి గాయాలూ కాలేదు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
5న ‘మీ కోసం’ కార్యక్రమం రద్దు
ఏలూరు సిటీ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా 5వ తేదీ సోమవారం మీ కోసం కార్యక్రమం ఉండబోదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవరం జరిగే మీ కోసం కార్యక్రమం కోసం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, సోమవారం వినాయకచవితి పర్వదిన సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఆ రోజు మీ కోసం కార్యక్రమం జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి జిల్లాలో ఎక్కడా కూడా మీ కోసం కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ కోరారు. -
చవితికి సిద్ధమైన గణనాథులు
-
పథకాల అమలు కోరుతూ ధర్నా
ఏలూరు (సెంట్రల్): ఎస్టీ ఉప కులాలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింగం పట్టాభి మాట్లాడుతూ గిరిజన కాలనీల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి, కులవృత్తులు చేసుకుంటున్న ఎస్టీలకు రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, బోగస్ గిరిజనులను కఠినంగా శిక్షించి, నిజమైన ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో çపలువురు మహిళలు పాల్గొన్నారు -
ప్రీ ఆర్మీ శిక్షణకు 874 మంది హాజరు
ఏలూరు సిటీ : యువజన సర్వీసుల శాఖ, సెట్వెల్ ఆధ్వర్యంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే యువతకు ప్రీ ఆర్మీ ట్రైనింగ్ అందించేందుకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం సోమవారం ఏలూరులోని సర్ సీఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. అక్టోబర్‌లో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి జిల్లా నుంచి హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు సెట్వెల్ సీఈవో కె.శ్రీనివాసులు తెలిపారు. ఏలూరు డివిజన్ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 874 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఆర్మీ నియామకాలకు సంబంధించి కావాల్సిన అర్హతల ఆధారంగా శిక్షణకు 533 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో సర్ సీఆర్ఆర్ అటానమస్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకట్రావు, సెట్వెల్ మేనేజర్ కోట సూర్యప్రభాకరరావు, కళాశాల వ్యాయామ అధికారి బాపూజీ, సెట్వెల్ అక్కౌంటెంట్ పీవీఎన్ సత్యనారాయణ, జిల్లా సహాయ పర్యాటక అధికారి ఎస్.పట్టాభిరామన్న పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ విజేత భీమవరం
మార్టేరు(పెనుమంట్ర) : రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల విజేతగా భీమవరం బాలుర జట్టు చాంపియ¯Œæగా నిలిచింది. బాలికల విభాగం విజేతగా మార్టేరు జట్టు జయకేతనం ఎగురవేసింది. స్థానిక వేణుగోపాల స్వా మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు స్వ ర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. బాలికల విభాగంలో ఏలూరు జట్టుపై మార్టేరు జట్టు విజయం సాధించి ట్రోపీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో మార్టేరు జట్టుపై హోరాహోరీ సాగిన పోరులో భీమవరం జట్టు 4 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. విజేతలకు ట్రోపీలను అందజేశారు. క్రీడలకు పుట్టిల్లు మార్టేరు అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తున్న మార్టేరు గ్రామం క్రీడలకు పుట్టిల్లు అని జెడ్పీటీసీ సభ్యుడు సత్తి ఆదినారాయణరెడ్డి అన్నారు. రాత్రి నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహిస్తున్న క్రీడాభిమానుల సహకారం మరువలేనిదన్నారు. సత్తి గీతను స్ఫూర్తిగా తీసుకుని స్థా«నిక క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. తాడి శ్రీనివాసరెడ్డి, మేడపాటి సోమేశ్వరరెడ్డి, చింతా రామకృష్ణ, బి. రమేష్‌రెడ్డి, బి.వి.రత్తయ్యలు మాట్లాడారు. సభకు వైబీఏ గొలుగూరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా స్వర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి విగ్రహానికి వైద్యురాలు ఆమె కుమార్తె, అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్టేరు– రామచంద్రపురం 40–ప్లస్ జట్ట మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు జి. లక్ష్మణరెడ్డి, జి.సత్యనారాయణరెడ్డి, కె.వినాయకరెడ్డి, ఎ.భాస్కరరెడ్డి, కె.మురళీకృష్ణ, కె.కృష్ణారెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, వి. నగేష్‌రెడ్డి, బి.విజయకుమార్ పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఏఐవైఎఫ్ శ్రేణులు
ఏలూరు (సెంట్రల్): దేశంలో విద్యా, వైద్య, ఉపాధి రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని, యువత దృష్టిని ఈ అంశాల నుంచి మరల్చడానికి దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై హిందూత్వ వాదులు దాడులు చేస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 20వ మహాసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.లెనిన్‌బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో తిరుమలై మాట్లాడారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యువత కీలక నిర్ణయాలు తీసుకోవాలని, ఆ దిశగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ముందుగా స్థానిక టూబాకో కల్యాణ మండపం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సంగీత దర్శకుడు వందేమాతం శ్రీనివాస్ సభ ప్రాంగణం వద్ద విప్లవ గేయాలను ఆలపించారు. ఏఐవైఎఫ్ నాయకులు ఐ.బయ్యన్న, బొద్దాని నాగరాజు, బి.కష్ణకిషోర్, యు.హేమశంకర్, ఎం.సుబ్బారావు, జె.విశ్వనాథ్, రెడ్డి శ్రీనివాస్, డాంగే ప్రజా నాట్యమండలి నాయకులు ఎం.గని, చంద్రానాయక్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సంఘాల ధర్నాకు వైఎస్సార్ టీఎఫ్ మద్దతు
ఏలూరు సిటీ : జిల్లా విద్యాశాఖ నిరంకుశ వైఖరికి నిరసనగా వివి«ద ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్ 1న తలపెట్టిన ధర్నాకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ఇస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గెడ్డం సుధీర్ సోమవారం తెలిపారు. ఈ ధర్నాలో జిల్లా శాఖ కార్యవర్గం, మండల శాఖల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బేస్మెంట్ పరీక్షలు, బడిగంటలు కార్యక్రమాలను అమలు చేస్తూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ లీవ్‌లో ఉన్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమస్థాయికి చేరేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేశారని, విద్యాధికారులు మాత్రం ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు వ్యతిరేకంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమించేందుకు సిద్ధమవుతామని తెలిపారు. -
నేడు ఎంపీ కవిత జిల్లా పర్యటన
చంద్రశేఖర్‌కాలనీ : నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం జిల్లాలో పర్యటిస్తారని టీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కంuó శ్వర్ బైపాస్‌రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హరితహరం కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం శ్రద్ధానంద్‌గంజ్‌లో నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంలో, నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లి సమీపంలో గల కస్బాగ్ తండాలో తీజ్ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. -
జలజాతర చివరి అంకం
-
భక్తులు పరవశించిన వేళ
-
జయహో సింధు
బావాయిపాలెం (నిడమర్రు): రియో ఒలిపింక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో విద్యార్థులు అక్షరాభివందనం చేశారు. జయహో సింధు ఇంగ్లిష్ అక్షరాకృతిలో ఒదిగి నీరాజనాలు పలికారు. పతకం సాధించి సోమవారం స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా సింధు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని సాధన స్కూల్ ప్రిన్సిపాల్ కంభంపాటి ప్రసాద్ తెలిపారు. -
కుప్పం ‘పంచాయితీ‘ వాయిదా
–దొరకని సీఎం అపాయింట్మెంటు – రెండు రోజులు పాటు తప్పని నిరీక్షణ కుప్పం: జిల్లావ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తున్న కుప్పం ‘పంచాయతీ’ సోమవారం తేలలేదు. దీనికి ఇంకా ముహూర్తం కుదరనట్టు తెలిసింది. సీఎం నియోజకవర్గ కేంద్రమైన ఈ పంచాయితీలో 16 మంది వార్డు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీస అభివృద్ధి జరగడం లేదంటూ వీరంతా అసంతృప్తితో ఉన్నారు. సర్పంచ్ తీరుతో విభేదిస్తున్నారు. అవినీతి పేరుకుపోతోందని అధికార టీడీపీకి చెందిన ఈసభ్యులే బాహాటంగా వీధికెక్కారు. దీంతో పార్టీ వర్గాలు విస్తుపోయాయి. నయానా భయానా దారికి తీసుకురావాలని టీడీపీ నాయకులు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరకు సీఎం వద్దే తమ ‘పంచాయతీ’ తేల్చుకుంటామని రాజీనామా సభ్యులు భీష్మించుకున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడకు బయలుదేరారు. సోమవారం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం నిరీక్షించారు. దొరకలేదు. వుంగళవారం కూడా వుుఖ్యవుంత్రిని కలిసే అవకాశాలు లేనట్లు సభ్యులు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ విజేత సింధు విజయవాడకు రానుండటంతో వుుఖ్యవుంత్రి అభినందించే కార్యక్రవుంలో బిజీగా ఉంటారని, మంగళవారం మధ్యాహ్నం కుప్పం వార్డు సభ్యులు కలిసే అవకాశం లభించవచ్చని కొందరంటున్నారు. ఒకవేళ మంగళవారం కూడా సీఎం తీరిక లేకుండా ఉంటే బుధవారం ఈ పంచాయితీపై చర్చిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వుుఖ్యవుంత్రిని కలిసేందుకు వెళ్ళిన వార్డు సభ్యులకు విజయవాడలో ఎదురుచూపులు తప్పలేదు. -
యువకుడి ఆత్మహత్య
పిఠాపురం టౌన్ : బతుకు పోరాటంలో అలసిపోయాడు. జీవితంలో స్థిరపడాలనుకున్న అతడికి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగిలాయి. ఇక ఎవరినీ నిందించడం ఇష్టంలేక తనువు చాలించాడు. జీవితంలో నిలదొక్కుకుంటానన్న నమ్మకం లేక, మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పాలపర్తి వెంకట సత్యనారాయణ(27) కొంతకాలంగా స్థానిక ఈశ్వరనగర్లో అద్దెకు ఉన్నాడు. ఉప్పాడ రైల్వేగేటు సమీపంలో పాలు అమ్ముతూ జీవితం గడిపేవాడు. అంతకుముందు చాలాచోట్ల పనిచేసినప్పటికీ, ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాడు. దాంతో షాపులో ఉన్న ఇనుపగొట్టానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవితంపై ఏ ఆశ లేకుండా ఇంతకాలం బతికానని, వ్యాపారంలో స్థిరపడదామనుకున్నా.. అది కూడా చేజారిపోయిందని అందులో సత్యనారాయణ పేర్కొన్నాడు. ఎవరినీ నిందించలేని పరిస్థితిలో, తన చేతకానితనం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. -
సాగు నీరందించాలని కౌలు రైతుల ధర్నా
ఏలూరు (మెట్రో) : సాగు నీరందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వరి దుబ్బలతో కలెక్టరేట్లో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరందక వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.10 వేలకుపైగా పెట్టుబడి పెట్టారన్నారు. ప్రస్తుతం సాగునీరందకపోతే అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ నీళ్లు ఇచ్చామంటూ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. నీరు ఇస్తే రైతుల పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తరలిస్తామని హడావిడి చేసి రైతులను పంటలను వేసుకోమన్నారని చుక్కనీరు రాక రైతులు పొలాల గట్ల మీద పడిగాపులు పడుతున్నారని చెప్పారు. గోదావరిలో నీరున్నా వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టు సాగునీరు అందటం లేదన్నారు. రైతులకు సాగునీరందించి పంటలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు మంతెన రామారావు, తిరుపతి రంగారావు, మావూరి శ్రీనివాసరావు, గొర్రెల సాంబశివరావు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు. -
సాగు నీరందించాలని కౌలు రైతుల ధర్నా
ఏలూరు (మెట్రో) : సాగు నీరందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వరి దుబ్బలతో కలెక్టరేట్లో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరందక వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.10 వేలకుపైగా పెట్టుబడి పెట్టారన్నారు. ప్రస్తుతం సాగునీరందకపోతే అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ నీళ్లు ఇచ్చామంటూ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. నీరు ఇస్తే రైతుల పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తరలిస్తామని హడావిడి చేసి రైతులను పంటలను వేసుకోమన్నారని చుక్కనీరు రాక రైతులు పొలాల గట్ల మీద పడిగాపులు పడుతున్నారని చెప్పారు. గోదావరిలో నీరున్నా వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టు సాగునీరు అందటం లేదన్నారు. రైతులకు సాగునీరందించి పంటలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు మంతెన రామారావు, తిరుపతి రంగారావు, మావూరి శ్రీనివాసరావు, గొర్రెల సాంబశివరావు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు. -
తిరంగా యాత్రలో విషాదం
నరసాపురం/మొగల్తూరు : తిరంగా యాత్రలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పిప్పళ్లవారి(పీవీ)తోట ఉన్నత పాఠశాలలో కురెళ్ల వెంకట పురుషోత్తం (32) వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు మొగల్తూరు మండలంలో సోమవారం తిరంగా యాత్ర చేయాలని స్థానిక నాయకులు నిర్ణయించారు. యాత్ర పీవీతోట ఉన్నత పాఠశాల మీదుగా వెళ్తుండడంతో అక్కడ జెండా వందనం చేసేందుకు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా నిర్ణయించిన స్థలంలో కాకుండా ఎదురుగా ఉన్న మరో స్థలంలో జెండా వందనానికి ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులు సూచించారు. దీంతో పీఈటీ పురుషోత్తం ఇనుప రాడ్డును భూమిలో పాతేందుకు యత్నించారు. అదే ప్రాంతంలో పై నుంచి వెళ్తున్న విద్యుత్ హైటెన్షన్ వైరు రాడ్డు చివరి భాగానికి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్న పురుషోత్తంను వెంటనే స్థానికులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, ఆయన మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాఠశాలకు ఇటీవలే బదిలీపై వచ్చిన పురుషోత్తం అనతికాలంలోనే గ్రామస్తులు, విద్యార్థుల మన్ననలు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరుపిల్లలు ఉన్నారు. పురుషోత్తం మృతదేహాన్ని చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటతడిపెట్టారు. ఘటనాస్థలాన్ని డీవైఈవో దువ్వూరి సూర్యనారాయణ పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల ఆందోళన పురుషోత్తం మృతదేహానికి నరసాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా జిల్లా ఉపాధ్యాయుల సంఘం, పీఈటీల సంఘం నాయకులు ఆందోళన చేశారు. పురుషోత్తం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2005 సంవత్సరం తరువాత నియమితులైనందున పురుషోత్తం కుటుంబానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు. దీంతో ఉపాధ్యాయులు ఆయనతో వాదనకు దిగారు. ఇదేమీ ప్రభుత్వ కార్యక్రమం కాదని, అయినా జెండా ఎగుర వేయించాలని పీఈటీకి పురమాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు అతను ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ఎవరు బాధ్యులని ఉపాధ్యాయులు గోపీ, చల్లా దుర్గారావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ గోకరాజు గంగరాజు వ్యక్తిగతంగా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారని, సీఎంతో మాట్లాడి పురుషోత్తం భార్యకు ఉద్యోగం వచ్చేలా, పరిహారం ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వాలని, ఇంకా 25 ఏళ్ల సర్వీసు ఉంది కాబట్టి రూ.50లక్షలు ఇవ్వాలని ఉపాధ్యాయులు పట్టుబట్టారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. రెండురోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయ సంఘ నేతలు ఆందోళన విరమించారు. హామీ నెరవేర్చకపోతే, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కుల నీరు
కొవ్వూరు: జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలోని పశ్చిమ డెల్టా కాలువకు 7,300 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, జీ అండ్ వీ కాలువకు 898, నరసాపురం (కాకరపర్రు) కాలువకు 2,093, అత్తిలి కాలువకు 779 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. 90,636 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లో గోదావరిలోకి వచ్చి చేరుతుంది. దీనిలో 14,500 క్యూసెక్కుల నీటిని ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 76,136 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆర్మ్‌ల్లోని 109 గేట్లను 0.10 మీటర్ల మేర, మద్దూరు, ర్యాలీ ఆర్మ్ల్లో 66 గేట్లను 0.20 మీటర్ల మేర ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. -
వెయ్యి అడుగుల పతాకం ఊరేగింపు
శ్రీకాళహస్తి : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల పొడవు, ఐదు అడుగల వెడల్పు కలిగిన జాతీయ పతాకాన్ని ఊరేగించారు. ఈ ప్రదర్శన పట్టణంలోని నాలుగువూడ వీధుల్లో కనుల పండువగా సాగింది. ఈ ఊరేగింపును స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువతరం సేవా సమితి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
శ్రీవారికి పవిత్రాల సమర్పణ
సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంలో సోమవారం వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్రాలు సమర్పించారు. తొలి రోజు తరహాలోనే రెండో రోజు కూడా యాగశాలలో హోమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి అభిషేకం (స్నపన తిరుమంజనం), నైవేద్య, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్ఠించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి కిరీటంపైన, మెడలో హారంగా, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షఃస్థలంలోని శ్రీదేవి, భూదేవులకు, కఠి, వరద హస్తాలు, పాదాలకు, భోగశ్రీనివాసమూర్తికి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామ లక్ష్మణ, రుక్మిణీ, శ్రీకృష్ణులవారికి సమర్పించారు. అనంతరం జయవిజయలు, గరుత్మంతునికి, ఆనంద నిలయంపైన కొలువైన విమాన వేంకటేశ్వరునికి, ఆలయంలో, వెలుపల ఇతర పరివార దేవతలకు ఈ పట్టుపవిత్రాలు సమర్పించారు. ఇదిలావుండగా మూడో రోజు మంగళవారం∙పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిస్తారు. -
బతికుండగానే శ్మశానానికి తరలించారు
–తిరుమలలో వ్యాధిగ్రస్తుడిని మూటకట్టి శ్మశానంలో వదిలిపెట్టిన టీటీడీ ఔట్సోర్సింగ్ సిబ్బంది –సీఐ వెంకటరవి సహకారంతో –అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి వైద్యసాయం –తమకు సంబంధం లేదని తేల్చిన హెల్త్ అధికారులు – నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్న సీఐ సాక్షి,తిరుమల: మానవసేవే మాధవ సేవగా సేవలందించాల్సిన టీటీడీ సిబ్బంది ఏడుకొండల వెంకన్న సాక్షిగా మానవత్వాన్ని మంట కలిపారు. ఆలయానికి కూతవేటుదూరంలోనే బతికుండగానే ఓ వృద్ధుడిని శ్మశానానికి తరలించిన ఘటన సోమవారం తిరుమలలో జరిగింది. పోలీసుల సహకారంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆయననెవరు ? l మహారాష్ట్రలోని శిరిడీ క్షేత్రానికి 20 కిలోమీటర్లదూరంలోని కోపర్గావ్ పట్టణానికి చెందిన ప్రీతమ్ శివాజి బోస్లే (75). శ్రీవారి దర్శనానికి వచ్చాడు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా తిరుమలలోనే బతుకుబండిని లాగిస్తున్నాడు. అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆలయానికి కూతవేటు దూరంలోని ∙ రాంబగీచా అతిథిగృహం వద్ద భక్తులు, స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తిని బతుకుతున్నాడు. ఆరోగ్యం క్షీణించటంతో నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో అతను నిద్రించే ప్రాంతంలో చీమలు పట్టి, రక్తం, నెత్తురు కారే స్థితిలో దుర్వాసన మధ్య అతను కాలాన్ని సాగిదీశాడు. బతికుండగానే శ్మశానానికి తరలింపు నడవ లేని స్థితిలో మూలుగుతున్న ఆ వృద్ధుడిని టీటీడీ పారిశుద్ధ్య ఔట్సోర్సింగ్ సిబ్బంది సోమవారం చూసారు. చీము, నెత్తురు కారుతూ కనిపించిన ఆయన పరిస్థితి చూసి ఒకటి రెండు రోజుల్లోనే మరణించే అవకాశం ఉందని భావించినట్టున్నారు. మరణించిన తర్వాత కంటే ముందే తీయటం సులభమనే ఉద్దేశంతో భావించినట్టున్నారు. టీటీడీ హెల్త్ అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించే లారీ తీసుకొచ్చారు. ఓ ప్లాస్టిక్ సంచిలో అతన్ని మూటకట్టారు. లారీలో వేసుకుని ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని శ్మశానంలో మూటగా దింపి సమాధులు మధ్య వదిలిపెట్టి వచ్చేశారు. సీఐ వెంకటరవి సహకారంతో 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలింపు ప్రాణాలతో బతికున్న వృద్ధుడిని మూటకట్టి చెత్తలారీలో ఎక్కించటాన్ని అక్కడి ట్యాక్సీ సిబ్బంది చూసి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో కొందరు మీడియా సిబ్బంది శ్మశానంలోకి వెళ్లి చూడగా మూటలో మూలుగుతున్న వృద్ధుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటరవి తక్షణమే శ్మశానానికి చేరుకుని మూటవిప్పి బాధితుడిని రక్షించే చర్యలు ప్రారంభించారు. బిస్కెట్లు, నీటి బాటిల్ తెప్పించడంతో వాటిని స్వీకరించి బాధితుడు ఆకలి తీర్చుకున్నాడు. నడవలేని స్థితిలోని బా«ధితుడిని 108 అంబులెన్స్‌లో స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. బాధితుడు కుష్టువ్యాధి గ్రస్తుడని వైద్యులు తెలిపారు. తర్వాత అతన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి లెప్రసీవార్డుకు తరలించి వైద్యం చేయించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత టీటీడీ హెల్త్ అధికారులు స్పష్టం చేశారు. తమ సిబ్బంది ఎవ్వరిని లారీలో శ్మశానానికి తరలించలేదని వివరణ ఇచ్చినట్టు సీఐ వెంకటరవి మీడియాకు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, సీసీ పుటేజీ ద్వారా నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
పుష్కరాలకు వెళుతున్న పోలీస్ బస్సుకు ప్రమాదం
వర్గల్:మెదక్ జిల్లా వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం రాత్రి పుష్కరాల బందోబస్తుకు పోలీసులతో వెలుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వర్గల్ వైపు నుంచి ట్రాక్టర్ రావడం గమనించి ఆర్టీసీ డ్రైవర్ బస్సును స్లో చేసాడు. వెనకనుంచి వస్తున్న ఇసుక లారీ, ఢీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఎం వెంకటేశ్వర్లు, ఆర్ గంగయ్య, బీ రవినాయక్, పీ మాణిక్యంతో పాటు మరో 21 మంది పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. కరీంనగర్-2 డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ఏ రాజు మెడకు వెనక సీటు గుద్దినట్లయింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా గౌరారం ఎస్సై వెంకటేశ్వర్లు బాధిత పోలీసులను 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్-2 డిపోకు చెందిన బస్సు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పుష్కర బందోబస్తు నిమిత్తం 49 మంది కరీంనగర్ జిల్లా పోలీసులతో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు బయలుదేరినట్లు డ్రైవర్ రాజు తెలిపాడు. వర్గల్ క్రాస్‌రోడ్డు మలుపు వద్ద ట్రాక్టర్ రావడం గమనించి కొద్దిగా బస్సును స్లో చేసానని, అంతలోనే బస్సు వెనక నుంచి ఇసుక లారీ ఢీకొట్టిందని ప్రమాదం తీరు వివరించాడు. వెనక సీటు రాడ్ తాకడంతో మెడ వెనక బలంగా తగిలి గాయమైందని చెప్పాడు. వెనక సీటులో కూర్చున్న తాము ఒక్కసారిగా లారీ ఢీకొనడంతో భయాందోళనకు గురయ్యామని, బస్సు డ్రైవర్ వాహనం ముందుకు కదలించడంతో తాము ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని కానిస్టేబుల్లు గంగయ్య, రవి నాయక్, మాణిక్యంలు పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పాల్ సందర్శించారు. కరీంనగర్-2 డిపో అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వారిని పుష్కరాలకు పంపుతారా, లేదా వెనక్కి పంపుతారా తెలియాల్సి ఉన్నది. ఫోటో: 08జిజేడబ్లు్య45: ప్రమాదంలో స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడిన పీసీలు ఎం వెంకటేశ్వర్లు, ఆర్ గంగయ్య, బీ రవినాయక్, పీ మాణిక్యం 08జిజేడబ్లు్య45ఏ: మెడకు దెబ్బ తగిలిందని చూపుతున్న ఆర్టీసీ డ్రైవర్ రాజు -
పుష్కర ఒడిలో.. గోదారమ్మ గుడిలో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆ అమ్మ నడయాడే నేలంతా సిరుల ధామం.. అణువణు వునా వేదనాదం.. సాహితీ సారస్వత సుమాల హారం.. ఆ తల్లి గుడికెళ్లి గుప్పెడు పసుపు.. కుంకుమతో అర్చిం చేందుకు తరుణీ మణులంతా తహతహలాడారు. దివంగతులైన పెద్దలకు పుణ్యగతులు సంప్రాప్తింప చేసేందుకు మగ మహారాజులంతా జలదేవత చెంతన పిండ ప్రదానాలు చేసి తర్పణలిచ్చారు. జనమంతా గోదారమ్మ గుడిలో తీర్థ విధులు నిర్వర్తించి తరించారు. అంత్య పుష్కరాల వేళ పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాలు పుష్కర యాత్రికులతో కిటకిటలాడాయి. గోదావరి అంత్య పుష్కరాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండో రోజైన సోమవారం మాసశివరాత్రి కావడంతో జిల్లాలోని స్నానఘట్టాలన్నీ కిటకిటలాడాయి. సుమారు 80వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నరసాపురంలో 10,436 మంది, ఆచంటలో 3,210 మంది, యలమంచిలిలో 5,020 మంది స్నానాలు చేయగా, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ఘాట్లలో 50,725 మంది స్నానాలు ఆచరించినట్టు అధికారులు లెక్కగట్టారు. ఒక్క కొవ్వూరులోనే 25 వేల మంది స్నానాలు చేయగా, పెనుగొండలో 10,800 మంది, నిడదవోలులో 2,225 మంది, పెరవలి మండలంలో 12,200 మంది భక్తులు స్నానాలు ఆచరించినట్టు అధికారిక అంచనా. పోలవరం, పట్టిసీమ ఇతర ఘాట్లలో 4వేల మంది వరకూ పుణ్యస్నానాలు చేశారు. కొవ్వూరు, సిద్ధాంతం, నరసాపురంలలో భక్తుల రాకతో కోలాహలం నెలకొంది. తొలి రోజుతో పోలిస్తే రెండోరోజు భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం రాష్ట్ర బంద్ ఉండటంతో ఆ ప్రభావం పుష్కరాల స్నానాలపై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రోజున నరసాపురంలో వలంధరరేవు ఘాట్కే భక్తులు పరిమితం కాగా, రెండో రోజున అమరేశ్వరఘాట్, కొండాలమ్మ ఘాట్ వద్ద కూడా స్నానాలు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం, నరసాపురం వలంధర రేవులో సోమవారం ఉదయం నుంచి 12 గంటల వరకూ రద్దీ కొనసాగింది. ఆ తరువాత జనం పలుచపడ్డారు. వలంధరరేవులో రెండో రోజున జల్లు స్నానం అందుబాటులోకి వచ్చింది. కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. మొదటిరోజు హడావుడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు రెండో రోజున పత్తాలేకుండా పోయారు. ఘాట్లవద్ద నియమించిన అధికారులు, సిబ్బంది తప్పిస్తే.. మిగిలిన వారెవరూ పరిశీలనకు రాలేదు. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ఎంసెట్‌పై నిర్ణయం సోమవారమే!
-
మల్లన్న బాధితులను ఆదుకుంటాం
గజ్వేల్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం 50 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ వల్ల 14 గ్రామాలు ముంపునకు గురవుతుండడం వల్ల వందలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని, వారందరికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్‌తో ఎవరికి లాభం చేకూరుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అంతేగాని ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తూ ‘మల్లన్న’ బాధితులపై లాఠీఛార్జి చేయడం సహించరానిదన్నారు. ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించిన తరువాతే భూసేకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
నీట మునిగిన పంటలు
రామాయంపేట:మండలంలోని కాట్రియాల, దంతేపల్లి గ్రామాల పరిధిలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో రెండు గ్రామాల్లో చెరువులు నిండిపోగా, కొన్ని చెరువులు అలుగు పారుతున్నాయి. భారీ వర్షంతో సుమారుగా 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో చేలల్లో మట్టి మేట వేసింది. కాట్రియాల జైత్య కుంట నీటితో నిండి కళకళలాడుతుంది. చెరువును ఆనుకుని ఉన్న లంబాడి కంలియాకు చెందిన మొక్కజొన్న చేను కొంతమేర నీటిలో మునిగింది. దంతేపల్లినాయకమ్మ కుంట నిండిపోయింది. ఈ చెరువు అలుగు పారుతోంది. చెరువుల కిందగల చెరకు, మొక్కజొన్న పంటల్లో నీరు నిలిచింది. మొక్నజొన్న పంట వేసిన భూమిలో మట్టి మేట వేసింది. తీన్ నంబర్ తండాలోని ఓ రైతు వ్యవసాయ భూమిలో భూమి కోతకు గురై గండి పడింది. నీటిపారుదలశాఖ ఏఈ శ్యాం, వీఆర్వో ప్రణయిక నిండిన చెరువులతోపాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. -
నేడు కలెక్టరేట్ ముట్టడి
సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి కరీంనగర్ : సాగునీటి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. గౌరవెల్లి, గండిపెల్లి, అనంతగిరి ప్రాజెక్టుల ఎత్తు పెంపుతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగంతో పాటు కొత్తగా కాలనీలు నిర్మించి ఇవ్వాలని, నిర్వాసితులకు నష్టం కలిగించే జీవో 123ను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్లతో కలెక్టరేట్ ముట్టడి తలపెట్టామన్నారు. ‘నిర్వాసితులపై లాఠీ చారి‡్జహేయం’ రైతు సంక్షేమమే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై విచక్షణారహితంగా లాఠీ చార్జి చేయడం అప్రజాస్వామికమని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డి, గీట్ల ముకుంద రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులపై ప్రభుత్వం అనాగరికంగా వ్యయవహరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బషీర్‌భాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన నాటి సీఎం చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు. -
సోనీ ఎక్స్‌పీరియా 'ఎక్స్ ఏ అల్ట్రా' కమింగ్ సూన్
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ సిరీస్ లో తొలి స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల కానుంది. సోనీ ఎక్స్ పీరియా 'ఎక్స్ఏ అల్ట్రా పేరుతో సోమవారం లాంచ్ కానుంది. 'పర్ ఫెక్ట్ సెల్పీ కాంపేనియన్' ను ఎక్స్ సిరీస్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఫోన్ ని సంస్థ తన వెబ్ సైట్ లో గత మేనేలలో ప్రవేశపెట్టింది. 'ఎక్స్ఏ అల్ట్రా ఫీచర్ల విషయానికొస్తే... ఆరు అంగుళాల టచ్ స్క్రీన్ 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 200 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 21.5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎక్స్ మోర్ ఆర్ఎ స్ సెన్సర్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ . 2700 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండురోజుల బ్యాటరీ లైఫ్). 10 నిమిషాల చార్జింగ్ తో 5.5 గంటల పాటుపని చేస్తుందని కంపెనీ చెబుతోంది. 202 గ్రా. ల బరువు తూగే ఈ స్మార్ట్ ఫోన్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది అంచనా. ఈ ఫోన్ ధర, తదితర వివరాలు లాంచింగ్ సందర్భంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది. -
నగరంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్ : చందానగర్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను సోమవారం (జూన్ 13) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేయనున్నట్లు తారానగర్ ఏఈ ఆర్.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. హుడాకాలనీ, చందానగర్, ఇంజినీర్స్ ఎన్క్లేవ్, తారా నగర్, రైల్‌విహార్ కాలనీ ఫీడర్స్ పరిధిలో విద్యుత్ ఉండదు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నల్లగండ్ల, గోపన్‌పల్లి, అపర్ణ, సుదర్శన్‌నగర్ ఫీడర్ పరిధిలో నిలిపివేస్తారు. పాపిరెడ్డి కాలనీ 11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాపిరెడ్డి కాలనీ, రాజీవ్‌గృహకల్ప, రాజీవ్ స్వగృహ, దూబే కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. -
నేడు ఐసెట్ ప్రవేశ పరీక్ష
► నిమిషం ఆలస్యమైనా అనుమతించరు ► రాష్ట్ర వ్యాప్తంగా 138 పరీక్ష కేంద్రాలు ఏయూక్యాంపస్(విశాఖపట్నం): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్ 2016ను సోమవారం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య కె.రామ్మోహన్రావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు 70,065 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 9.30 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతిస్తారు. 10 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని కన్వీనర్ స్పష్టంచేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 138 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఐసెట్ ప్రవేశ పరీక్షసెట్ కోడ్ 'విటీఎస్‌టీ' ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇతర సమాచారం కోసం 8374569978, 0891-2579797 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, నూత ఇసుక పాలసీపై చర్చించనున్నారు. అలాగే సీఆర్డీఏ, అగ్రికల్చర్ జోన్ వివాదం, రాజధాని మాస్టర్ ప్లాన్, గ్రామకంఠాల సమస్య, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
శ్రీశైలంలో ఆది,సోమవారాల్లో ఆర్జితసేవలు రద్దు
శ్రీశైలం (కర్నూలు) : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో కార్తీకమాసం సందర్భంగా ఆది, సోమవారాలలో వచ్చే భక్తులరద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు, సుప్రభాత, మహా మంగళహారతి సేవలను రద్దు చేస్తున్నట్లు ఈవో సాగర్‌బాబు శుక్రవారం తెలిపారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం, చివరి సోమవారానికి తోడుగా ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6న ఆన్లైన్లో అభిషేకాలు బుకింగ్ చేసుకున్న సేవాకర్తలకు శనివారం సాయంత్రం స్వామివార్ల గర్భాలయంలో ఆర్జిత అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలను నిర్వహించుకోవచ్చునన్నారు. అలాగే సోమవారం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న సేవాకర్తలు మంగళవారం రోజున ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ఆయా రోజుల్లోనే ముందస్తు అభిషేకం టికెట్లను తీసుకోవడం ద్వారా అభిషేకాలను నిర్వహించుకోవాలనుకునే సేవాకర్తలు శ్రీవృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద అభిషేకాలు, అమ్మవారి ప్రాకార మండపంలో కుంకుమార్చనలను చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. -
రూ.7 లక్షల కోట్ల సంపద హాంఫట్
-
స్టాక్ మార్కెట్ ఢమాల్
⇒ ఒక్కరోజే రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి ⇒ సెన్సెక్స్ 1,625 పాయింట్లు.. ⇒ నిఫ్టీ 491 పాయింట్లు పతనం ⇒ ఆరున్నరేళ్ల కనిష్టానికి చమురు, లోహాలు ⇒ సంక్షోభ పరిస్థితుల్ని ఎగదోసిన చైనా మందగమనం ⇒ మళ్లీ గ్రీసు సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళన ⇒ అమెరికాలోనూ కొనసాగుతున్న మార్కెట్ల పతనం కొన్నాళ్లుగా స్థిరంగా ఉంటూ... ఒక రోజు పడినా మరునాడు పెరుగుతూ వస్తున్న స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని కళ్లజూశాయి. ఉదయం ఆరంభమవుతూనే 600 పాయింట్లు కోల్పోయిన బీఎస్ఈ సూచీ సెన్సెక్స్... ట్రేడింగ్ ముగిసేసరికి 1,625 పాయింట్లు కోల్పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 491 పాయింట్లు పతనమైంది. దీంతో ఒక్కరోజులోనే రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరయిపోవటమే కాదు... ట్రిలియన్ క్లబ్ నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు జారిపోయాయి కూడా! ఒక్కరోజులో ఇన్ని పాయింట్లు కోల్పోవటం... ఇంత మొత్తంలో సొమ్ము ఆవిరవడం చరిత్రలో ఎప్పుడూ లేదు. శాతాల వారీ చూసినా 2009 తరవాత ఈ స్థాయి పతనం లేదు. బీఎస్ఈ-500 కంపెనీల్లో 114 కంపెనీల షేర్లు సోమవారం ఒక్కరోజే ఏడాది కనిష్టానికి చేరిపోయాయి. బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాప్‌లో ఈ 500 కంపెనీలదే 93 శాతం..!!