గాలివీడు : మండలపరిధిలో తలముడిపిలో సోమవారం జన్మభూమి గ్రామసభను ఆ గ్రామ సర్పంచ్ మద్దిరాల శివశంకర్‌రెడ్డి(కంచంరెడ్డి) బహిష్కరించారు. ప్రభుత్వం కక్షపూరితమైన పాలన సాగిస్తోందని, ఈ గ్రామసభలు ప్రజాసమస్యల పరిష్కరానికో, పథకాలు అందజేసేందుకో నిర్వహించడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు కాదని, కేవలం జన్మభూమి కమిటీ సభ్యులే గ్రామసభలు జరపడం దారుణమన్నారు. టీడీపీ గ్రామసభలుగా ప్రభుత్వాధికారులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జన్మభూమిని బహిష్కరించిన తలముడిపి సర్పంచ్
Published Mon, Jan 2 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
Advertisement