siva sankar reddy
-
ఆ సమాచారం జనసేనకు ఎలా చేరింది?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని.. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారని అనిల్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అతన్ని బెదిరించి నంబర్ తీసుకుని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు.పెద్దపెద్ద పోలీసు అధికారులు మాత్రమే చేయగలిగే ట్రాకింగ్‌ని జనసేన నేతలు ఎలా చేస్తున్నారు?. అనిల్ కుటుంబ సభ్యుల వివరాలను కూడా వెల్లడిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ అంటూ పుత్తా శివశంకర్ ప్రశ్నించారు. నియంతలను మించి పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు.‘‘ప్రభుత్వం ప్రజల వివరాలు తీసుకుంటే అప్పట్లో పవన్ రచ్చ చేశారు. మరి ఇప్పుడు ప్రజల వివరాలు ఏ విధంగా జనసేన వారి దగ్గరకు వచ్చాయి?. ఇది చట్టవ్యతిరేక చర్య. చట్టాలను వారి చేతుల్లోకి తీసుకోవటం ఏంటి?. దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాలి. ‘డిప్యూటీ సీఎంగారి తాలూకా’ అనే ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
జన్మభూమిని బహిష్కరించిన తలముడిపి సర్పంచ్
గాలివీడు : మండలపరిధిలో తలముడిపిలో సోమవారం జన్మభూమి గ్రామసభను ఆ గ్రామ సర్పంచ్ మద్దిరాల శివశంకర్‌రెడ్డి(కంచంరెడ్డి) బహిష్కరించారు. ప్రభుత్వం కక్షపూరితమైన పాలన సాగిస్తోందని, ఈ గ్రామసభలు ప్రజాసమస్యల పరిష్కరానికో, పథకాలు అందజేసేందుకో నిర్వహించడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు కాదని, కేవలం జన్మభూమి కమిటీ సభ్యులే గ్రామసభలు జరపడం దారుణమన్నారు. టీడీపీ గ్రామసభలుగా ప్రభుత్వాధికారులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
క్రీడల నిర్వహణకు నిధులివ్వాలని వినతి
కడప స్పోర్ట్స్ : జిల్లాలో పాఠశాలల క్రీడల నిర్వహణకు అవసరమైన నిధులు అందించాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డిని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. శనివారం నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా వ్యాయామ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివశంకర్‌రెడ్డి, ప్రవీణ్‌కిరణ్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలను 8 క్రీడాజోన్లుగా ఏర్పాటు చేసి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జోనల్ క్రీడలతో పాటు సెంట్రల్మీట్లు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందక క్రీడల నిర్వహణ భారంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాతల చేయూతతో క్రీడల నిర్వహణ సాగుతోందన్నారు. గతంలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన సురేష్‌బాబు హయాంలో ఒక్కో పాఠశాలకు రూ.5వేలు చొప్పున నిధులను కేటాయించారన్నారు. క్రీడల నిర్వహణకు జెడ్పీ లేదా ఎంపీ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.