సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని.. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారని అనిల్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అతన్ని బెదిరించి నంబర్ తీసుకుని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు.
పెద్దపెద్ద పోలీసు అధికారులు మాత్రమే చేయగలిగే ట్రాకింగ్‌ని జనసేన నేతలు ఎలా చేస్తున్నారు?. అనిల్ కుటుంబ సభ్యుల వివరాలను కూడా వెల్లడిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ అంటూ పుత్తా శివశంకర్ ప్రశ్నించారు. నియంతలను మించి పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు.
‘‘ప్రభుత్వం ప్రజల వివరాలు తీసుకుంటే అప్పట్లో పవన్ రచ్చ చేశారు. మరి ఇప్పుడు ప్రజల వివరాలు ఏ విధంగా జనసేన వారి దగ్గరకు వచ్చాయి?. ఇది చట్టవ్యతిరేక చర్య. చట్టాలను వారి చేతుల్లోకి తీసుకోవటం ఏంటి?. దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాలి. ‘డిప్యూటీ సీఎంగారి తాలూకా’ అనే ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment