
మల్లన్న బాధితులను ఆదుకుంటాం
గజ్వేల్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం 50 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ వల్ల 14 గ్రామాలు ముంపునకు గురవుతుండడం వల్ల వందలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని, వారందరికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.
సోమవారం గజ్వేల్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్‌తో ఎవరికి లాభం చేకూరుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అంతేగాని ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తూ ‘మల్లన్న’ బాధితులపై లాఠీఛార్జి చేయడం సహించరానిదన్నారు. ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించిన తరువాతే భూసేకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.