జన్మాష్టమి.. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది హిందువులు అత్యంత వేడుకగా చేసుకునే పండుగ. ఈసారి జన్మాష్టమి సోమవారం అంటే ఆగస్టు 26న వచ్చింది. ఆగస్టు 24, 25వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మరి సోమవారం, శ్రీకృష్ణాష్టమి నాడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా మూసివుంటాయా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయయనున్నారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు తమ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సెలవుల జాబితాను పొందవచ్చు.
కాగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, న్యూఢిల్లీ, గోవాలలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేస్తాయి. అయితే సోమవారం సెలవు ఉన్న బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు బ్యాంకు సేవలను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment