ప్రీ ఆర్మీ శిక్షణకు 874 మంది హాజరు | for pre army training 874 membrs are attend | Sakshi
Sakshi News home page

ప్రీ ఆర్మీ శిక్షణకు 874 మంది హాజరు

Published Mon, Aug 29 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

ప్రీ ఆర్మీ శిక్షణకు 874 మంది హాజరు

ప్రీ ఆర్మీ శిక్షణకు 874 మంది హాజరు

ఏలూరు సిటీ : యువజన సర్వీసుల శాఖ, సెట్‌వెల్‌ ఆధ్వర్యంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనే యువతకు ప్రీ ఆర్మీ ట్రైనింగ్‌ అందించేందుకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం సోమవారం ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. అక్టోబర్‌లో నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి జిల్లా నుంచి హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు సెట్‌వెల్‌ సీఈవో కె.శ్రీనివాసులు తెలిపారు. 
ఏలూరు డివిజన్‌ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 874 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఆర్మీ నియామకాలకు సంబంధించి కావాల్సిన అర్హతల ఆధారంగా శిక్షణకు 533 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో సర్‌ సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ వెంకట్రావు, సెట్‌వెల్‌ మేనేజర్‌ కోట సూర్యప్రభాకరరావు, కళాశాల వ్యాయామ అధికారి బాపూజీ, సెట్‌వెల్‌ అక్కౌంటెంట్‌ పీవీఎన్‌ సత్యనారాయణ, జిల్లా సహాయ పర్యాటక అధికారి ఎస్‌.పట్టాభిరామన్న పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement