ఉపాధ్యాయ సంఘాల ధర్నాకు వైఎస్సార్ టీఎఫ్ మద్దతు
Published Mon, Aug 29 2016 7:22 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
ఏలూరు సిటీ : జిల్లా విద్యాశాఖ నిరంకుశ వైఖరికి నిరసనగా వివి«ద ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్ 1న తలపెట్టిన ధర్నాకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ఇస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గెడ్డం సుధీర్ సోమవారం తెలిపారు. ఈ ధర్నాలో జిల్లా శాఖ కార్యవర్గం, మండల శాఖల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బేస్‌మెంట్ పరీక్షలు, బడిగంటలు కార్యక్రమాలను అమలు చేస్తూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ లీవ్‌లో ఉన్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమస్థాయికి చేరేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేశారని, విద్యాధికారులు మాత్రం ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు వ్యతిరేకంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమించేందుకు సిద్ధమవుతామని తెలిపారు.
Advertisement