జిల్లాలో అందరికీ ఆరోగ్యబీమా అందించడమే లక్ష్యం
జిల్లాలో అందరికీ ఆరోగ్యబీమా అందించడమే లక్ష్యం
Published Mon, Mar 27 2017 5:56 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
ఏలూరు అర్బన్: జిల్లాలో అందరికీ ఆరోగ్యబీమా అందించే లక్ష్యంతో హెల్త్ ఫర్ ఆల్ అనే పధకాన్ని అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్, కె. కోటేశ్వరి తెలిపారు. సోమవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎంహెచ్‌వో కోటేశ్వరి మాట్లాడారు. గతంలో ఎన్‌టీఆర్ ఆరోగ్య పధకంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీములో ఉద్యోగులు, జర్నలిస్ట్‌లకు ఆరోగ్యబీమా అందేదని అన్నారు. ఈ నేపథ్యంలో పేద, ధనిక అనే భేధం లేకుండా సమాజంలో అన్ని వర్గాల వారికి ఆరోగ్య బీమా కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏడాదికి రూ. 1200ల సొమ్ము చెల్లించడంతో ఏడాదికి రూ. 2 లక్షల వైద్య సేవలు పొందే వీలు కలిగించిందన్నారు. ఈ పధకంలో చేరేవారు ఏ వయసువారైనా, రోగాలతో బాధపడుతున్నవారైనా చేరేందుకు అర్హులే అన్నారు. ఐతే ఈ పధకం పట్ల ప్రజల్లో అనుకున్నంత అవగాహన లేనందున ఎక్కువ మంది ఈ పథకంలో చేరలేదన్నారు. వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలపై ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఇంటింటికీ అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య మిత్రలు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని పధకంలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ పధకాలు ఎలా అమలౌతున్నాయి
సోమవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎంపీహెచ్‌ఈవో,
సీవోలతో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటేశ్వరి జిల్లాలో అమలౌతున్న ఆరోగ్య పధకాలపై సమీక్ష నిర్వహించారు. మరింత సమర్ధవంతంగా పధకాలను అమలు చేయాలని ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో yీ ఐవో డాక్టర్ మోహనకృష్ణ. ఆర్‌బీఎస్‌కే డాక్టర్ కె. సురేష్‌బాబు, డిప్యూటీ డెమో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement