పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కుల నీరు
కొవ్వూరు: జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలోని పశ్చిమ డెల్టా కాలువకు 7,300 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, జీ అండ్ వీ కాలువకు 898, నరసాపురం (కాకరపర్రు) కాలువకు 2,093, అత్తిలి కాలువకు 779 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. 90,636 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లో గోదావరిలోకి వచ్చి చేరుతుంది. దీనిలో 14,500 క్యూసెక్కుల నీటిని ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 76,136 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆర్మ్‌ల్లోని 109 గేట్లను 0.10 మీటర్ల మేర, మద్దూరు, ర్యాలీ ఆర్మ్‌ల్లో 66 గేట్లను 0.20 మీటర్ల మేర ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.