గోదావరిలో తగ్గిన ఇన్ఫ్లో
కొవ్వూరు: గోదావరిలో ప్రవాహ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయం 57,980 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం 6 గంటలకు 54,407 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 13,500 క్యూసెక్కుల నీటì ని విడిచిపెడుతున్నారు. ఆనకట్టకు ఉన్న 175 గేట్లను 0.10 మీటర్లు ఎత్తులేపి మిగిలిన 40,907 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పుడెల్టాకు బుధవారం కంటే నీటి విడుదల వెయ్యి క్యూసెక్కుల చొప్పున కుదించి 3,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సెంట్రల్ డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు ఏడు 7,300 క్యూసెక్కులను యథావిధిగా విడిచిపెడుతున్నారు.
పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కులు
జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకు 7,300 క్యూసెక్కులు నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, నరసాపురం కాలువకు 2,093, జీ అండ్ వీ కాలువకు 898, అత్తిలి కాలువకు 792 క్యూసెక్కుల నీరు చొప్పున విడుదల చేస్తున్నారు.