to canals
-
పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం 4 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరికి 29,074 క్యూసెక్కుల ఇ¯ŒSఫ్లో వస్తుంది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 20,774 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. -
పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కులు
కొవ్వూరు: గోదావరికి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 28,766 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 14,500 క్యూసెక్కుల నీటì ని వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 4,600, సెంట్రల్ డెల్టాకి 2,600, పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కుల నీటిని యథావిధిగా విడుదల చేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, నరసాపురం కాలువకు 2,093, జీ అండ్ వీ కాలువకు 898, అత్తిలి కాలువకు 792 క్యూసెక్కుల నీరు చొప్పున వదులుతున్నారు. -
గోదావరిలో తగ్గిన ఇన్ఫ్లో
కొవ్వూరు: గోదావరిలో ప్రవాహ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయం 57,980 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం 6 గంటలకు 54,407 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 13,500 క్యూసెక్కుల నీటì ని విడిచిపెడుతున్నారు. ఆనకట్టకు ఉన్న 175 గేట్లను 0.10 మీటర్లు ఎత్తులేపి మిగిలిన 40,907 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పుడెల్టాకు బుధవారం కంటే నీటి విడుదల వెయ్యి క్యూసెక్కుల చొప్పున కుదించి 3,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సెంట్రల్ డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు ఏడు 7,300 క్యూసెక్కులను యథావిధిగా విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కులు జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకు 7,300 క్యూసెక్కులు నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, నరసాపురం కాలువకు 2,093, జీ అండ్ వీ కాలువకు 898, అత్తిలి కాలువకు 792 క్యూసెక్కుల నీరు చొప్పున విడుదల చేస్తున్నారు. -
పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కుల నీరు
కొవ్వూరు: జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలోని పశ్చిమ డెల్టా కాలువకు 7,300 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, జీ అండ్ వీ కాలువకు 898, నరసాపురం (కాకరపర్రు) కాలువకు 2,093, అత్తిలి కాలువకు 779 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. 90,636 క్యూసెక్కుల వరదనీరు ఇన్ఫ్లో గోదావరిలోకి వచ్చి చేరుతుంది. దీనిలో 14,500 క్యూసెక్కుల నీటిని ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 76,136 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆర్మ్ల్లోని 109 గేట్లను 0.10 మీటర్ల మేర, మద్దూరు, ర్యాలీ ఆర్మ్ల్లో 66 గేట్లను 0.20 మీటర్ల మేర ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. -
పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కులు విడుదల
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి 7 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. జిల్లాలో ఏలూరు కాలువకి 1,180 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,714, నరసాపురం కాలువకి 2,020, గోస్తనీ (జీఅండ్ వీ)కి1,035, అత్తిలి కాలువకి 578 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 13,800 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరుగంటలకు గోదావరి నుంచి 3,57,496 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సాయంత్రానికి కాస్త ఇన్ఫ్లో తగ్గడంతో ఆరుగంటల నుంచి 2,54,048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 10.20 అడుగులుగా నమోదైంది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లును అరమీటరు ఎత్తు లేపి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రచలంలో నీటిమట్టం 24 అడుగులకు తగ్గింది. దీంతో రానున్న రెండు రోజుల్లో వరద తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీరు
నిడదవోలు : విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు మూడు రోజులుగా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 6,500 క్యూసెక్కులకు మరో 500 క్యూసెక్కులు పెంచి వదులుతున్నారు. గోదావరి పరివాహాక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరిలో వరద నీరు అధికంగా చేరుతుంది. దీంతో కాటన్ బ్యారేజీల నుంచి మంగళవారం 1,94,720 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా పరధిలో ఏలూరు కాలువకు 1,147 క్యూసెక్కులు, నరసాపురం కాలువకు 2,056 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 601 క్యూసెక్కులు, తణుకు కాలువకు 898 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,914 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.