పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీరు
పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీరు
Published Tue, Jul 19 2016 9:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
నిడదవోలు : విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు మూడు రోజులుగా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 6,500 క్యూసెక్కులకు మరో 500 క్యూసెక్కులు పెంచి వదులుతున్నారు. గోదావరి పరివాహాక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరిలో వరద నీరు అధికంగా చేరుతుంది. దీంతో కాటన్ బ్యారేజీల నుంచి మంగళవారం 1,94,720 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా పరధిలో ఏలూరు కాలువకు 1,147 క్యూసెక్కులు, నరసాపురం కాలువకు 2,056 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 601 క్యూసెక్కులు, తణుకు కాలువకు 898 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,914 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Advertisement