మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర 24వ రోజు అంటే నేడు (మంగళవారం)ఒడిశాలోకి ప్రవేశించనుంది. జనవరి 14న ఈశాన్య భారతం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాలలోని ప్రజలను కలుస్తున్నారు.
జార్ఖండ్ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా వైపు వెళ్లనుంది. మంగళవారం సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాహుల్ ఒడిశాలో అడుగుపెట్టనున్నారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఒడిశా కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేశారు. సుందర్‌గఢ్ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం బిరామిత్రపూర్‌లో ఒడిశా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకనున్నారు.
రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం బిర్మిత్రాపూర్ చేరుకుంటారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర బిజా బహల్ ప్రాంతంలో విరామం తీసుకోనుంది. బుధవారం రూర్కెలాలోని ఉదిత్‌నగర్ నుండి పాన్‌పోష్ వరకు 3.4 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రాహుల్ పాన్‌పోష్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మరుసటి రోజు రాణిబంద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రాజ్‌గంగ్‌పూర్‌లో జరిగే ర్యాలీలో కూడా రాహుల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 8న రాహుల్ గాంధీ జర్సుగూడ పాత బస్టాండ్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ర్యాలీలో ప్రసంగిస్తారు. జార్సుగూడలోని కనక్‌తోరా నుంచి యాత్ర మొదలై అనంతరం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment