ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్‌లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్‌తో రిలాక్స్‌డ్‌గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్‌లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్‌ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం.
ఎందుకంటే ఇలా..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్‌ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం.
ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్‌ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్‌ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్‌ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్‌ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది.
ప్రస్తుతం సీఎస్‌ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని సీఎస్‌ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్‌ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.
(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!)
Comments
Please login to add a commentAdd a comment