
డీపీఆర్‌సీ నిర్మాణ పనులపై కలెక్టర్ అసంతృప్తి
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని జిల్లా పరిషత్తు అవరణంలో రూ.కోటి యాభై లక్షలతో నిర్మించిన డీపీఆర్‌సీ పనులను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పరిశీలించారు. సంబంధిత నిర్మాణ పనులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల్లో ఫినిషింగ్ వర్కు సరిగా లేదన్నారు. ఎక్కడెక్కడ ఏం ఏర్పాటు చేయాలో అవన్నీ జాగ్రత్తగా బిగించాలని ఆదేశించారు. సంపు మ్యాన్‌హోల్ బయటకు కనిపించకుండా చేయాలని సూచించారు. మిగతా పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.