కడప అర్బన్ : కడప నగరం కోటిరెడ్డి సర్కిల్‌లో సోమవారం రెడ్ సిగ్నల్స్ పడిన సమయంలో పులివెందుల వైపు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ04 జెడ్ 0130) ముందువైపునున్న మోటారు సైకిల్, ఆటోలను వేగంగా వచ్చి ఢీకొంది. ఆ సమయంలో మోటారు సైకిల్‌పైనున్న ఇరువురు, ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఆనందకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.