- సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి
నేడు కలెక్టరేట్ ముట్టడి
Published Sun, Jul 24 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
కరీంనగర్ : సాగునీటి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. గౌరవెల్లి, గండిపెల్లి, అనంతగిరి ప్రాజెక్టుల ఎత్తు పెంపుతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగంతో పాటు కొత్తగా కాలనీలు నిర్మించి ఇవ్వాలని, నిర్వాసితులకు నష్టం కలిగించే జీవో 123ను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్లతో కలెక్టరేట్ ముట్టడి తలపెట్టామన్నారు.
‘నిర్వాసితులపై లాఠీ చారి‡్జహేయం’
రైతు సంక్షేమమే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై విచక్షణారహితంగా లాఠీ చార్జి చేయడం అప్రజాస్వామికమని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డి, గీట్ల ముకుంద రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులపై ప్రభుత్వం అనాగరికంగా వ్యయవహరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బషీర్‌భాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన నాటి సీఎం చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు.
Advertisement
Advertisement