muttadi
-
ప్రగతి భవన్ ముట్టడికి ‘డీవైఎఫ్ఐ’ యత్నం.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయాంటూ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు సోమవారం యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు నియామకాల్లో అవకతవకలు జరిగాయని డీవైఎఫ్ఐ ఆరోపించింది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసనలకు దిగిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ఖమ్మం బీఆర్ఎస్కు ఒకేసారి భారీ షాకులు?.. తుమ్మలతో పాటు పొంగులేటి.. షాతో చర్చలు?? -
హైదరాబాద్‌లోని TSPSC కార్యాలయం ముట్టడికి ప్రయత్నం
-
ఏం తినాలి.. ఎలా బతకాలి?
- కదం తొక్కిన ఉపాధి కూలీలు - డ్వామా కార్యాలయ ముట్టడికి యత్నం - ఉపాధి బిల్లులు చెల్లించాలని డిమాండ్ అనంతపురం టౌన్ : నెలల తరబడి ఉపాధి బిల్లులు రాకుంటే ఏం తినాలి? ఎలా బతకాలంటూ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు తక్షణమే ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేట్ ఎదుట బైఠాయించి అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లో ఉపాధి కూలి డబ్బు ఇవ్వాల్సి ఉన్నా నెలల తరబడి కాలయాపన చేస్తోందన్నారు. జిల్లా యంత్రాంగం కాకిలెక్కలతో మభ్యపెడుతోందని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మూడు నెలల నుంచి సక్రమంగా బిల్లులు రాక కూలీల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అధికారులకు ఒక నెల జీతం రాకుంటే తెగ హైరానా పడతారని, మరి కూలీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వలసలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. ఉపాధి పనులను ఏడాదికి 200 రోజులు పెంచాలన్నారు. రోజు వేతనం రూ.300 ఇవ్వాలని, పోస్టాఫీసుల ద్వారానే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలకు ‘ఉపాధి’ కల్పించేదిగా ఈ పథకాన్ని మార్చేశారన్నారు. డ్వామా పీడీ నాగభూషణం వచ్చి నాయకులతో మాట్లాడారు. గతంలో పోస్టాఫీసుల ద్వారానే బిల్లుల చెల్లింపులు జరిగేవని, జనవరి నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నగదు వేస్తున్నట్లు చెప్పారు. కూలీలందరి ఖాతాలు, ఆధార్ అనుసంధానం కాకపోవడంతో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు వివరించారు. ఈ విషయమై కలెక్టర్ వీరపాండియన్‌తో చర్చించామని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని కూలీలు డిమాండ్ చేయడంతో మరో మూడు, నాలుగు వారాలు పడుతుందని పీడీ చెప్పారు. దీంతో వారు ఒక్కసారిగా ముందుకు తోసుకెళ్లారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మరో నాలుగు వారాలంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో టూటౌన్ సీఐ యల్లంరాజు ఆధ్వర్యంలో పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెద్దన్న, కృష్ణమూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
-
ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
పోలీసులు, విద్యార్థి నాయకులకు తోపులాట పిడిగుద్దులతో రెచ్చిపోయిన పోలీసులు పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు ముకరంపుర : ఎంసెట్ పేపర్–2 లీకేజీని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తెలంగాణచౌరస్తా నుంచి వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎంసెట్ పేపర్–2 లీకేజీ బాధ్యులను శిక్షించాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు తమ ప్రతాపం చూపించారు. పెనుగులాటలో కిందపడ్డ విద్యార్థులపై కొందరు పోలీసులు పిడిగుద్దులతో రెచ్చిపోయారు. కాళ్లతో తన్నారు. లాఠీలు ఝులిపించడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి నాయకులు కిరణ్, అనిరు«ద్, సాయి, తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెంటమ్ జగదీశ్, జిల్లా కన్వీనర్లు సతీశ్, అనిల్, సంపత్, రాణా, స్వామి, అన్వేశ్, రంజిత్, ప్రవీణ్, రమేశ్, రఘు, అరవింద్, ప్రశాంత్, రాము, జయసింహ, హరి, రవి, మణి, నవీన్, రాజ్‌కుమార్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
ముట్టడి ఉద్రిక్తం
-
నేడు కలెక్టరేట్ ముట్టడి
సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి కరీంనగర్ : సాగునీటి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. గౌరవెల్లి, గండిపెల్లి, అనంతగిరి ప్రాజెక్టుల ఎత్తు పెంపుతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగంతో పాటు కొత్తగా కాలనీలు నిర్మించి ఇవ్వాలని, నిర్వాసితులకు నష్టం కలిగించే జీవో 123ను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్లతో కలెక్టరేట్ ముట్టడి తలపెట్టామన్నారు. ‘నిర్వాసితులపై లాఠీ చారి‡్జహేయం’ రైతు సంక్షేమమే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై విచక్షణారహితంగా లాఠీ చార్జి చేయడం అప్రజాస్వామికమని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డి, గీట్ల ముకుంద రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులపై ప్రభుత్వం అనాగరికంగా వ్యయవహరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బషీర్‌భాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన నాటి సీఎం చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు. -
టీఎన్ఎస్ఎఫ్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
– విద్యార్థి నాయకులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టు – లాఠీచార్జీకి నిరసనగా రేపు విద్యాసంస్థల బంద్ – టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాలమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ గేటుపైకి ఎక్కిలోపలికి ప్రవేశించేందుకు యత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేజీ టు పీజీ ఉచితవిద్య, లక్ష ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ నోటిఫికేషన్ వంటివి సీఎంకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. కనీసం యూనివర్సిటీలకు వీసీలను నియమించే దిక్కు లేకుండాపోయిందని ఆరోపించారు. ఎంసెట్–2పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని, సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కిశోర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర, జిల్లా నాయకులు వడ్డె రమేష్, నిఖిల్, మున్నూరు చరణ్, నరేష్, పద్మాకర్, దినేష్, శ్రీనివాస్, విజయ్, శివ, జగన్, నవీన్, అభిరామ్ పాల్గొన్నారు. -
రేపు కలెక్టరేట్ ముట్టడి
కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కరీంనగర్ : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూనిర్వాసితుల సమస్యలపై సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి, ఆనంతగిరి ప్రాజెక్టు సామర్థ్యాన్ని(ఎత్తు) పెంచడం మూలంగా నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని, జీవనాధారమైన భూములు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం తక్షణమే ఎత్తు తగ్గించాలని, బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, నిర్వాసితులకు నష్టం కలిగించే జీవో 123ని రద్దు చేయాలనే డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయం ముట్టడి తలపెట్టినట్లు పేర్కొన్నారు.