కరీంనగర్ : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూనిర్వాసితుల సమస్యలపై సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి, ఆనంతగిరి ప్రాజెక్టు సామర్థ్యాన్ని(ఎత్తు) పెంచడం మూలంగా నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని, జీవనాధారమైన భూములు ముంపునకు గురవుతున్నాయని వివరించారు.
-
కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
కరీంనగర్ : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూనిర్వాసితుల సమస్యలపై సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి, ఆనంతగిరి ప్రాజెక్టు సామర్థ్యాన్ని(ఎత్తు) పెంచడం మూలంగా నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని, జీవనాధారమైన భూములు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం తక్షణమే ఎత్తు తగ్గించాలని, బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, నిర్వాసితులకు నష్టం కలిగించే జీవో 123ని రద్దు చేయాలనే డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయం ముట్టడి తలపెట్టినట్లు పేర్కొన్నారు.