నేడు ఐసెట్ ప్రవేశ పరీక్ష | tomarrow andhra predesh icet exam | Sakshi

నేడు ఐసెట్ ప్రవేశ పరీక్ష

Published Mon, May 16 2016 5:36 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్ 2016ను సోమవారం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య కె.రామ్మోహన్‌రావు తెలిపారు.

► నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
► రాష్ట్ర వ్యాప్తంగా 138 పరీక్ష కేంద్రాలు


ఏయూక్యాంపస్(విశాఖపట్నం): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్ 2016ను సోమవారం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య కె.రామ్మోహన్‌రావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు 70,065 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 9.30 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతిస్తారు. 10 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని కన్వీనర్ స్పష్టంచేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 138 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.

సోమవారం ఉదయం 6 గంటలకు ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఐసెట్ ప్రవేశ పరీక్షసెట్ కోడ్‌ 'విటీఎస్‌టీ' ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇతర సమాచారం కోసం 8374569978, 0891-2579797 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement