మెదక్ జిల్లా వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం రాత్రి పుష్కరాల బందోబస్తుకు పోలీసులతో వెలుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.
వర్గల్:మెదక్ జిల్లా వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం రాత్రి పుష్కరాల బందోబస్తుకు పోలీసులతో వెలుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వర్గల్ వైపు నుంచి ట్రాక్టర్ రావడం గమనించి ఆర్టీసీ డ్రైవర్ బస్సును స్లో చేసాడు. వెనకనుంచి వస్తున్న ఇసుక లారీ, ఢీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఎం వెంకటేశ్వర్లు, ఆర్ గంగయ్య, బీ రవినాయక్, పీ మాణిక్యంతో పాటు మరో 21 మంది పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. కరీంనగర్-2 డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ఏ రాజు మెడకు వెనక సీటు గుద్దినట్లయింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా గౌరారం ఎస్సై వెంకటేశ్వర్లు బాధిత పోలీసులను 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్-2 డిపోకు చెందిన బస్సు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పుష్కర బందోబస్తు నిమిత్తం 49 మంది కరీంనగర్ జిల్లా పోలీసులతో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు బయలుదేరినట్లు డ్రైవర్ రాజు తెలిపాడు. వర్గల్ క్రాస్‌రోడ్డు మలుపు వద్ద ట్రాక్టర్ రావడం గమనించి కొద్దిగా బస్సును స్లో చేసానని, అంతలోనే బస్సు వెనక నుంచి ఇసుక లారీ ఢీకొట్టిందని ప్రమాదం తీరు వివరించాడు. వెనక సీటు రాడ్ తాకడంతో మెడ వెనక బలంగా తగిలి గాయమైందని చెప్పాడు. వెనక సీటులో కూర్చున్న తాము ఒక్కసారిగా లారీ ఢీకొనడంతో భయాందోళనకు గురయ్యామని, బస్సు డ్రైవర్ వాహనం ముందుకు కదలించడంతో తాము ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని కానిస్టేబుల్లు గంగయ్య, రవి నాయక్, మాణిక్యంలు పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పాల్ సందర్శించారు. కరీంనగర్-2 డిపో అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వారిని పుష్కరాలకు పంపుతారా, లేదా వెనక్కి పంపుతారా తెలియాల్సి ఉన్నది.
ఫోటో:
08జిజేడబ్లు‍్య45: ప్రమాదంలో స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడిన పీసీలు ఎం వెంకటేశ్వర్లు, ఆర్ గంగయ్య, బీ రవినాయక్, పీ మాణిక్యం
08జిజేడబ్లు‍్య45ఏ: మెడకు దెబ్బ తగిలిందని చూపుతున్న ఆర్టీసీ డ్రైవర్ రాజు