రాజీనామా పత్రాలు చూపుతున్న వార్డు సభ్యులు(ఫైల్)
జిల్లావ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తున్న కుప్పం ‘పంచాయతీ’ సోమవారం తేలలేదు. దీనికి ఇంకా ముహూర్తం కుదరనట్టు తెలిసింది. సీఎం నియోజకవర్గ కేంద్రమైన ఈ పంచాయితీలో 16 మంది వార్డు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
–దొరకని సీఎం అపాయింట్‌మెంటు
– రెండు రోజులు పాటు తప్పని నిరీక్షణ
కుప్పం:
జిల్లావ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తున్న కుప్పం ‘పంచాయతీ’ సోమవారం తేలలేదు. దీనికి ఇంకా ముహూర్తం కుదరనట్టు తెలిసింది. సీఎం నియోజకవర్గ కేంద్రమైన ఈ పంచాయితీలో 16 మంది వార్డు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీస అభివృద్ధి జరగడం లేదంటూ వీరంతా అసంతృప్తితో ఉన్నారు. సర్పంచ్ తీరుతో విభేదిస్తున్నారు. అవినీతి పేరుకుపోతోందని అధికార టీడీపీకి చెందిన ఈసభ్యులే బాహాటంగా వీధికెక్కారు. దీంతో పార్టీ వర్గాలు విస్తుపోయాయి. నయానా భయానా దారికి తీసుకురావాలని టీడీపీ నాయకులు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరకు సీఎం వద్దే తమ ‘పంచాయతీ’ తేల్చుకుంటామని రాజీనామా సభ్యులు భీష్మించుకున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడకు బయలుదేరారు. సోమవారం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం నిరీక్షించారు. దొరకలేదు. వుంగళవారం కూడా వుుఖ్యవుంత్రిని కలిసే అవకాశాలు లేనట్లు సభ్యులు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ విజేత సింధు విజయవాడకు రానుండటంతో వుుఖ్యవుంత్రి అభినందించే కార్యక్రవుంలో బిజీగా ఉంటారని, మంగళవారం మధ్యాహ్నం కుప్పం వార్డు సభ్యులు కలిసే అవకాశం లభించవచ్చని కొందరంటున్నారు. ఒకవేళ మంగళవారం కూడా సీఎం తీరిక లేకుండా ఉంటే బుధవారం ఈ పంచాయితీపై చర్చిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వుుఖ్యవుంత్రిని కలిసేందుకు వెళ్ళిన వార్డు సభ్యులకు విజయవాడలో ఎదురుచూపులు తప్పలేదు.