vijayavada
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్,చంద్రబాబు ఇల్లు కోసం ప్రజల ప్రాణాలతో చలగాటాలా..
-
చంద్రబాబు ఈ పాపం ఊరికే పోదు.. బుడమేరును దారి మళ్లించి బడుగుల జీవితాన్ని చిదిమేశారు
-
48 గ్రామాలండి.. మా చేపల చెరువులన్నీ మునిగి పోయాయి
-
విజయవాడలో దంచికొడుతున్న వర్షం.. ఆందోళనలో ప్రజలు
-
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు
గత వారం రోజులుగా రోజురోజుకి బంగారం ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఏకంగా 10 గ్రాముల బంగారం ధరలు మునుపటి కంటే రూ. 600 నుంచి రూ. 660 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం & వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూసేద్దాం. ⭐ విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5260 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5738గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 55260, 24 క్యారెట్ పసిడి ధర రూ. 57380గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణంలో కూడా ఉన్నాయి. ⭐ వెండి ధరల విషయానికి వస్తే విజయవాడలో 10 గ్రాముల వెండి రూ. 735. కావున ఒక కేజీ వెండి ధర రూ. 73500గా ఉంది. ఈ ధర నిన్నటి కంటే కూడా రూ. 2000 తక్కువ. నిన్న కేజీ వెండి ధర రూ. 75500గా ఉంది. వెండి కొనేవారికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇదే ధరలు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి. ⭐ దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 5275 (1 గ్రామ్ 22 క్యారెట్), రూ. 5753 (1 గ్రామ్ 24 క్యారెట్). దీని ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలు రూ. 52750 & రూ. 57530గా ఉన్నాయి. నిన్నటి పోలిస్తే ఈ ధరలు రూ. 600 & రూ. 660 తగ్గింది. ⭐ వెండి విషయానికి వస్తే.. ఒక గ్రామ్ వెండి రూ. 71. కావున 10 గ్రాముల వెండి రూ. 710, కేజీ ధర రూ. 71000గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 2000 తక్కువ కావడం గమనార్హం. ⭐ చెన్నైలో పసిడి ధరల విషయానికి వస్తే.. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5290 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5771గా ఉంది. నిన్నటి కంటే ఏ రోజు ధరలు రూ. 660 & రూ. 720 తక్కువ. ⭐ వెండి ధర చెన్నైలో రూ. 73.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 75500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 2000 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బెజవాడ పోస్ట్ ఆఫీస్ లో నిధులు గోల్మాల్
-
చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది: జూపూడి
-
విజయవాడలో చినుకుపడితే రోడ్లు ఛిద్రమే..
చినుకుపడితే చాలు రాజధాని నగరంలో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి.. ప్రధాన రహదారుల నుంచి వీధుల వరకు రోడ్లు నిండుకుండల్లా మారుతున్నాయి. అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొంటోంది. దశాబ్దాల నుంచి వర్షం నీటి మళ్లింపునకు విజయవాడ నగరపాలక సంస్థ వందలకోట్లు ఖర్చుపెడుతున్నా ఫలితం శూన్యమే. గతంలో నదీతీర ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు మాత్రమే ముంపునకు గురయ్యేవి.. ప్రస్తుతం నగరమంతా ఇలాంటి దుస్థితే కనిపిస్తుండటం.. చిన్నపాటి చినుకులకే ‘జల’విల్లాడటం గమనిస్తే వీఎంసీ ఇంజినీరింగ్ విభాగం నాసిరకం పనుల తీరు స్పష్టమవుతుంది. సాక్షి, విజయవాడ : రాజధాని నగరాన్ని ఏటా వర్షాకాలంలో మురుగు ముంచెత్తుతోంది. చినుకుపడితే వర్షపు నీటితోపాటు డ్రెయినేజీల్లో మురుగునీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తుండటంతో వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా ఇదే తంతు జరుగుతున్నా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వందలకోట్లు ఖర్చుపెడుతూ.. కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి కూడా కోట్లకు అభివృద్ధి పనుల బిల్లుల మంజూరులు జరుగుతున్నాయి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం నామ్‌కే వాస్తేలా మారింది. నాటి జేన్‌ఎన్‌యూఆర్‌ఎం నుంచి ఇప్పటి అమృత్ పథకం వరకు నగరంలో ప్రధానంగా డ్రెయిన్లు, కాలువలు మరమ్మతులకు, నూతన కాలువల నిర్మాణాలకు నిధులు వెచ్చిస్తున్నారు. అందులో మురుగునీటితోపాటు వీఎంసీలో పేరుకుపోయిన అవినీతి సిల్టును తోడే నాథుడు కరువయ్యారు. అక్షరాల వెయ్యి కోట్లు..! నగరంలో మురుగునీటి పారుదలకు, వర్షంనీటి మళ్లింపునకు, నూతన సైడు, అవుట్ ఫాల్డ్రెయిన్ల నిర్మాణం, పాత డ్రెయిన్ల మరమ్మతులుకు కలిపి దశాబ్దకాలంలో వీఎంసీ సుమారు వెయ్యికోట్లు ఖర్చుపెట్టింది. జేన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో రూ. 320 కోట్లు నగరంలో ప్రధానంగా వరదనీటి మళ్లింపునకు అప్పట్లో ఖర్చు చేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకంలో భాగంగా నగరంలో రూ. 461 కోట్లతో స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్లు నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్లలో నగర పాలక సంస్థ కూడా అన్ని డివిజన్లలో కలిపి భారీ మొత్తాన్ని వెచ్చించటం గమనార్హం. కేటాయింపులు.. ఖర్చులు.. కార్పొరేషన్ బడ్జెట్లో డ్రెయిన్ల నిర్మాణాలకు, సిల్టు తొలగింపునకు ఓపెన్ డ్రెయిన్లలో మరమ్మతులకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 69.24 లక్షలు ఖర్చు చేయగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.4 కోట్లు ఖర్చు చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 19.20 కోట్లు ఖర్చు చేసేలా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో ఆమోదం పొందింది. ఇందులో ఇప్పటి వరకు రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు వీఎంసీ ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. 14వ ఫైనాన్స్ నిధుల నుంచి మురుగునీటి తోడటానికి, కాలువల్లో పేరుకుపోయిన సిల్టును తొలగించటానికి, ఇతర పనులకు 2017–18లో రూ. 4.32 కోట్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 45.20 కోట్లు ఖర్చు చేయగా 2019–20లో రూ. 75 కోట్లు నిధులు కేటాయింపులు జరిగాయి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 88.72 లక్షలు, 2018–19లో రూ. 9.86 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 15 కోట్లు కేవలం నగరంలోని సిల్టు తొలగింపునకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకంలో మురుగునీటి సమస్యను పరిష్కరించటానికి 2018–19లో 14.32 కోట్లు ఖర్చు చేయగా 2019–20 ఏడాదికి రూ. 59.86 కోట్లు కేటాయింపులు జరిగాయి. పేరుకే పనులు డ్రెయినేజీల్లో పేరుకుపోతున్న సిల్టును తోడేందుకు వీఎంసీ కోట్లకు కోట్లు ఖర్చుపెడుతుంది. భారీ యంత్రాలను అద్దెకు తీసుకోవటమే కాకుండా వీఎంసీ సమకూర్చుకున్న యంత్రాలతో కూడా రేయింబవళ్లు తీస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సమస్య యథాతథంగా దర్శనమిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలో డ్రెయిన్లలో సిల్టు తీయటానికి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూరేలా దొంగమస్తర్లుతో ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న మాయాజాలంతోనే లక్షలు బిల్లులు పాస్ అవుతున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి. -
వంచనకూ, విశ్వాసానికి మధ్య...
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నగరంలో అత్యంత కీలకమైనది. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ నియోజకవర్గంలో గవర్నర్‌పేట, లెనిన్‌సెంటర్, బీసెంట్ రోడ్డు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వైద్యశాలలకు కేంద్రంగా ఉంది. జాతిపిత మహాత్మాగాందీ నడయాడిన గాంధీనగరం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఎంతో చరిత్ర కలిగిన స్వరాజ్‌మైదానం, జింఖానా మైదానాలు ఈ నియోజకవర్గంలోనివే. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు, సీఎం క్యాంప్ కార్యాలయం ఇక్కడికి తరలివచ్చాయి. దీంతో నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఘంటసాల సంగీత కళాశాల సుప్రసిద్ధమైనది, 107 సంవత్సరాల కిందట నిర్మించిన కాశీవిశ్వేశ్వర దేవాలయం ప్రసిద్ధికెక్కింది. సెంట్రల్ నియోజకవర్గానికి తూర్పు, దక్షిణం హద్దులుగా తూర్పు నియోజకవర్గం, పశ్చిమ సరిహద్దుగా పశ్చిమ నియోజకవర్గం, దక్షిణ హద్దుగా మైలవరం, గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ బూత్‌లు : 236 మొత్తం ఓట్లు : 2,35,723 పురుషులు : 1,15,752 స్త్రీలు : 1,19,905 ఇతరులు : 66 మొత్తం డివిజన్లు : 20 మొత్తం జనాభా : 3,64,149 నియోజకవర్గ విశిష్టత స్వాతంత్రోద్యమం నుంచి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారు ఈ ప్రాంతానికి చెందిన వారే . ఘంటసాల సంగీత కళాశాల, రామకోటి మైదానం ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీరే మన ఎమ్మెల్యేలు 2008 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైంది. అంతకు ముందు విజయవాడ తూర్పులో భాగంగా ఉండేది. నియోజకవర్గానికి 2009లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లాది విష్ణు విజయం సాధించారు. మల్లాది విష్ణుకు 52,426 ఓట్లు, ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణకు 51,578 ఓట్లు రాగా 848 ఓట్ల మెజార్టీతో మల్లాది విష్ణు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బొండా ఉమామహేశ్వరరావుకు 82,669 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి పూనూరు గౌతంరెడ్డికి 55,508 ఓట్లు రాగా, బొండా ఉమా 27,161 ఓట్ల మెజార్టీ సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పూనూరు గౌతంరెడ్డిపై బొండా ఉమామహేశ్వరరావు 27,161 ఓట్ల తేడాతో గెలుపొందారు. నియోజకవర్గానికి మొత్తం రెండు సార్లు ఎన్నికల జరగగా ఇక్కడి ప్రజలు వేర్వేరు పార్టీలను గెలిపించారు. రెండు పార్టీల మధ్యే పోటీ నియోజకవర్గానికి 2009లో తొలి సారిగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం మధ్యే పోటీ. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్య ప్రధాన పోటీ. 2019 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది. జనసేన నామమాత్రపు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. వైఎస్సార్ చొరవతో ... నగరంతో వైఎస్ రాజశేఖరరెడ్డికి అవినాభావ సంబంధం ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. బుడమేరు ముంపు సమయంలో వైఎస్ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించారు. ముంపు నివారణకు కరకట్ట నిర్మాణం చేపట్టారు. -
పెథాయ్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదు: కలెక్టర్
సాక్షి, విజయవాడ: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన పెథాయ్ తుపాన్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సముద్ర తీరం వెంబడి ఉన్న నాలుగు మండలాలు, 181 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి పది మంది ప్రత్యేక ఆధికారులను నియమించామని చెప్పారు. జిల్లాలో నేడు, రేపు చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి కోతలు జరిగాయన్నారు. ప్రస్తుతం 20 వేల హెక్టార్లలో వరి పంట పాలుపోసుకునే దశలో వుంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాం వల్ల పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లదని అన్నారు. తాజా సమాచారం ప్రకారం కాకినాడ, విశాఖపట్నం మధ్య పెథాయ్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. -
బెజవాడలో రివాల్వర్ కలకలం
సాక్షి, విజయవాడ : బెజవాడలో రివాల్వర్ కలకలం రేపింది. సోమవారం రమేష్ అనే వ్యక్తి దగ్గర రివాల్వర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ఓ కాంట్రాక్టర్ వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతని వద్దకు రివాల్వర్ ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
మొక్కు చెల్లించుకోనున్న సీఎం కేసీఆర్
-
నేడు దుర్గమ్మకు ముక్కుపుడక
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ సిద్ధిస్తే దుర్గమ్మకు ముక్కు పుడక చేయిస్తానని గతంలోనే కేసీఆర్ మొక్కుకున్నారు. గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు, మనవడితో కలసి విజయవాడకు వెళ్లనున్నారు. 12 గంటలకు విజయవాడ చేరుకోనున్న ఆయన.. 12.45 సమయంలో ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. అనం తరం తిరుగు ప్రయాణమవుతారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారమే కుటుంబ సమేతంగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. చంద్రాకారం.. పాలపిట్ట ఆకారంలో.. 11.29 గ్రాముల బంగారంతో రూపొందించిన చంద్రాకారం, దానిపై 3 వరసలుగా పొదిగిన 57 వజ్రాలు, చంద్రాకారం మధ్యలో చెట్టు కొమ్మ, కొమ్మపై కూర్చున్న రాష్ట్ర పక్షి పాలపిట్ట ఆకారంతో ముక్కుపుడకను రూపొందించారు. పాల పిట్ట ఈకలుగా నీలం రంగు రాళ్లు, చెట్టు కొమ్మలోని పచ్చని ఆకులుగా పచ్చ రాళ్లు పొదిగారు. -
‘అమ్మవారు..కమ్మ వారు ఎన్నికలప్పుడే గుర్తొస్తారు’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఎన్నికలు, ఉప ఎన్నికలు వస్తున్నాయంటే కొండమీద అమ్మవారు, కొండకింద కమ్మవారు గుర్తుకొస్తారని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా గుర్తుకురాని విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చినట్లని ప్రశ్నించారు. ముక్కుపుడక సమర్పించుకోవాలనుకుంటే జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ తల్లి, బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి, ఊరూరా పోచమ్మ తల్లులు ఉన్నారని అన్నారు. కేసీఆర్ విజయవాడకు వెళ్లేది అమ్మవారి మీద భక్తితో కాదని అక్కడి కమ్మ వారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ ఓట్లు రాల్చుకోవడానికేనని ఆరోపించారు. కొడంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సచివాలయంలో పలువురు అధికారులను కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. -
హనుమాన్ జంక్షన్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద బుదవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేని గూడెంకు చెందిన బండి సతీష్ రెడ్డిని అనే ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్ చేయడంపై గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణలకు సంబంధంలేని వ్యక్తులను అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గత ఆదివారం రాత్రి బాపులపాడు మండలం కె. సీతారామపురం గ్రామంలో జరిగిన వివాదంతో సంబంధం లేని సతీష్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటని నేతలు ప్రశ్నించారు. పైగా ఈ రోజు అతనికి పరీక్షలు ఉన్నాయని చెప్పినా పోలీసులు విడిచి పెట్టకపోవడం దారుణమన్నారు. వెంటనే సతీష్ రెడ్డిని విడుదల చేసి, విద్యార్థులపై అక్రమంగా పెట్టిన ఎసీ, ఎస్టీ, అట్రాసీటి కేసులను ఎత్తివేయాలన్నారు. లేనిపక్షంలో ఆమరణ దీక్షకు దిగుతామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. చదవండి : టీడీపీ నేతల దౌర్జన్యకాండ -
‘పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్త’
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుకి ముడుపులు అందాయని, పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకునే పనిలో ఉన్నారని.. రాజధాని రైతుల భూములు దోచుకున్న పచ్చదండు సామాన్యుల భూములపై కన్నువేసిందని ఆరోపించారు. లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని సీఎం అధికారిక నివాసంగా మార్చుకున్నారని, ఇంక రమేష్‌కి అడ్డు అదుపు ఉంటుందా అని ప్రశ్నించారు. లింగమనేని రమేష్.. పవన్ కళ్యాణ్‌కి కూడా భూములిచ్చారని, లింగమనేని ఎస్టేట్స్ భూదోపిడిపై సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లింగమనేని గ్రూప్‌లో చంద్రబాబు, లోకేష్‌ల వాటా ఎంత అని ప్రశ్నించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. అవాకులు, చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాలు విసిరారు. -
చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకున్నారు
-
కాల్ మనీ వేధింపులు.. వివాహిత ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ : కాల్ మనీ ఆగడాలు మరోసారి పెచ్చుమీరాయి. కాల్ మనీ వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పసుపులేటి పద్మ అనే వివాహిత నాలుగేళ్ల కిందట టీడీపీ నేత అనుచరుడి నుంచి 2లక్షల రుణం తీసుకుంది. కొన్ని నెలల క్రితమే తీసుకున్న బాకీ మొత్తం తీర్చేసింది. అయితే ఇంకా డబ్బులు బాకీ ఉన్నావంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దౌర్జన్యానికి దిగారు. తరుచూ ఆమెను వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టారు. వేధింపులు తాళలేకపోయిన ఆమె మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. -
దేవాదాయశాఖ కమిషనర్‌పై కేసు నమోదు
సాక్షి, విజయవాడ : దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనురాధ, సహాయ కమిషనర్ పుష్పవర్ధన్‌తో సహా, మరొకరిపై విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దుర్గగుడిలో పనిచేసే వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ కార్మికుడు పట్ల దురుద్దేశ పూర్వకంగా, నష్టం కలిగించే విధంగా వ్యవహరించటం మీద కోర్టు ఆదేశాల మేరకు అనురాధపై సెక్షన్ 166, 384, 425, 506, 120బీ, 34ఐపీసీ, 156(3), సీఆర్పీసీల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో వైవీ అనురాధ దుర్గగుడి ఈవోగా పనిచేశారు. -
జేసీ.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు దళిత చట్టాలను అపహాస్యం చేస్తోందని, దళితుల నోటికాడి కూడును చంద్రబాబు బొక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాలను టీడీపీ నేతలకు ధారాదత్తం చేస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిందన్నారు. జూపూడి ప్రభాకర్‌ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది దోచుకోవటానికి కాదని హితవు పలికారు. దళితుల సొమ్ము దోచుకోవడానికి సిగ్గు లేదా అంటూ జూపూడి ప్రభాకర్‌ని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆదినారాయణ రెడ్డి దళితులతో పెట్టుకోవటం మంచిది కాదని హెచ్చరించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 100కోట్ల రూపాయల మేర ఎస్సీ కార్పొరేషన్ నిధులు గల్లంతయ్యాయని తెలిపారు. నిధుల గల్లంతుపై చంద్రబాబు వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. వైఎస్సార్సీపీ దళితుల తరపున ఉద్యమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
ఆంధ్రాబ్యాంక్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్
విజయవాడ (వన్‌టౌన్) : భారత రిజర్వు బ్యాంక్ 2016–2017 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన నాలుగో సావరిన్ గోల్డ్ బాండ్లను ఆంధ్రాబ్యాంక్ తన అన్ని శాఖల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని బ్యాంక్ విజయవాడ జోనల్ మేనేజర్ డి.చంద్రమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి మూడో తేదీ వరకూ ఆంధ్రాబ్యాంకుకు చెందిన 2872 శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ బాండ్లను దేశీయులైన వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు మాత్రమే కొనుగోలు చేయుటకు అర్హులని తెలిపారు. ఒకటి నుంచి 500 గ్రాముల వరకూ ఈ పథకంలో బాండ్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. గ్రాము ఖరీదును రూ.2,893గా , బాండ్ కాలపరిమితిని ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన తరువాత ముందస్తుగా రద్దు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకంలో బంగారాన్ని కొనకుండానే బంగారం మీద పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని ప్రజలు పొందుతారని తెలిపారు. బాండ్ నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఎవరైతే బాండ్లో పెట్టుబడి పెట్టారో వారు అంతే బంగారపు విలువను రిజర్వుబ్యాంక్ నిర్దేశించిన మార్కెట్ రేటుకు అనుగుణంగా రూపాయల్లో పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఆరు మాసాలకొకసారి పెట్టుబడి మీద 2.5శాతం వడ్డీని పొందగలిగే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించినట్లు పేర్కొన్నారు. పెట్టుబడి కాలవ్యవధిలో బంగారపు ధరల హెచ్చు తగ్గుల నుంచి ఈ పథకం సరైన రక్షణ కల్పిస్తుందని తెలిపారు. -
వానలో భక్తజన ప్రవాహం
విజయవాడ: నగరంలో శనివారం ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది. జడి వానలోనూ భక్తజన ప్రవాహంకొనసాగుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపైకి చేరిన వేలాది మంది భక్తులు వర్షంలో తడిచి ముద్దవుతున్నా క్యూలోనే ఉన్నారు. దుర్గాంబ దర్శనానికి బారులు తీరి వేచి చూస్తున్నారు. వేకువజాము రెండు గంటల నుంచి ఇప్పటి వరకు 60వేల మంది దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. -
21న ఉద్యోగ మేళా
ప్రొద్దుటూరు కల్చరల్: కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో విజయవాడలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు బలిజ, కాపు నిరుద్యోగ యువత హాజరు కావాలని అఖిల భారత కాపు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాశంలక్ష్మీనరసయ్య తెలిపారు. 21న జరిగే ఉద్యోగ మేళాలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఫాం, ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు. 100 కంపెనీలు పాల్గొంటాయని, 3వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని కాపు యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బలిజల, కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. అఖిల భారత కాపు సమాఖ్య పట్టణాధ్యక్షుడు గుండాల శ్రీనివాసులు, కార్యదర్శి సుదర్శన్, జిల్లా యూత్ అధ్యక్షుడు పాశం రామమోహన్, నాయకులు శంకర్, సూర్య, మధు, చెన్నప్ప పాల్గొన్నారు. -
విజయవడలో చెరకుతో గణేష విగ్రహం
-
కుప్పం ‘పంచాయితీ‘ వాయిదా
–దొరకని సీఎం అపాయింట్మెంటు – రెండు రోజులు పాటు తప్పని నిరీక్షణ కుప్పం: జిల్లావ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తున్న కుప్పం ‘పంచాయతీ’ సోమవారం తేలలేదు. దీనికి ఇంకా ముహూర్తం కుదరనట్టు తెలిసింది. సీఎం నియోజకవర్గ కేంద్రమైన ఈ పంచాయితీలో 16 మంది వార్డు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీస అభివృద్ధి జరగడం లేదంటూ వీరంతా అసంతృప్తితో ఉన్నారు. సర్పంచ్ తీరుతో విభేదిస్తున్నారు. అవినీతి పేరుకుపోతోందని అధికార టీడీపీకి చెందిన ఈసభ్యులే బాహాటంగా వీధికెక్కారు. దీంతో పార్టీ వర్గాలు విస్తుపోయాయి. నయానా భయానా దారికి తీసుకురావాలని టీడీపీ నాయకులు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరకు సీఎం వద్దే తమ ‘పంచాయతీ’ తేల్చుకుంటామని రాజీనామా సభ్యులు భీష్మించుకున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడకు బయలుదేరారు. సోమవారం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం నిరీక్షించారు. దొరకలేదు. వుంగళవారం కూడా వుుఖ్యవుంత్రిని కలిసే అవకాశాలు లేనట్లు సభ్యులు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ విజేత సింధు విజయవాడకు రానుండటంతో వుుఖ్యవుంత్రి అభినందించే కార్యక్రవుంలో బిజీగా ఉంటారని, మంగళవారం మధ్యాహ్నం కుప్పం వార్డు సభ్యులు కలిసే అవకాశం లభించవచ్చని కొందరంటున్నారు. ఒకవేళ మంగళవారం కూడా సీఎం తీరిక లేకుండా ఉంటే బుధవారం ఈ పంచాయితీపై చర్చిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వుుఖ్యవుంత్రిని కలిసేందుకు వెళ్ళిన వార్డు సభ్యులకు విజయవాడలో ఎదురుచూపులు తప్పలేదు. -
పుష్కర ఘాట్లపై ‘డ్రోన్ల’ నిఘా...
– ఆటోమేటిక్ కెమెరాలతో ఫోటోల చిత్రీకరణ – దొంగలు, అసాంఘిక శక్తులను కనిపెట్టే ప్రయత్నం – విజయవాడ, అమరావతి, సీతానగరం ఘాట్లను కవర్ చేసేలా ఏర్పాటు – ‘కైసర్ యాప్’సాయంతో ఘాట్లలో రద్దీ గుర్తింపు సాక్షి ప్రతినిధి, తిరుపతి కృష్ణా పుష్కర ఘాట్లలో దొంగలు, అరాచక శక్తుల ఆట కట్టించడానికి అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోనున్నారు. గగన తలం నుంచి నిఘాను ఏర్పాటు చేసేందుకు డ్రోన్ల సాయం తీసుకోనున్నారు. విజయవాడ, సీతానగరం, అమరావతి, హంసలదీవి వంటి ప్రధాన ఘాట్లను కవర్ చేస్తూ అత్యాధునిక పవర్ డ్రోన్లను వినియోగించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులతో దీనిపై చర్చించారు. సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు టెక్నాలజీ వినియోగంపై కుప్పం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు తెలియజేస్తూ డ్రోన్ల వినియోగాన్ని వివరించారు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రధాన పుష్కర ఘాట్‌లో సీఎం చంద్రబాబునాయుడు పుణ్యస్నానం పూర్తయ్యాక భారీ తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా 29 మంది మృత్యువాత పడ్డారు, కారణమేదైనా కృష్ణా పుష్కరాల్లో అటువంటి సంఘటన పునరావృతం కారాదనీ, గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల వాడకం ద్వారా ఒనకూరే ప్రయోజనాలను అంచనా వేసుకున్న అధికారులు 15 నుంచి 20 దాకా వీటిని వాడేందుకు యోచిస్తున్నారు. కోట్లాది మంది పుష్కరయాత్రికులు ఘాట్లలో పుణ్యస్నానాలు చేసే సందర్భంగా జరగరాని ఘోరం ఎదైనా జరిగితే అందుకు గల కారణాలను డ్రోన్లు తీసే ఫోటో చిత్రాల ద్వారా గుర్తించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల ఎత్తున గగన తలంలో తిరిగే డ్రోన్లు లేజర్ కిరణాల ద్వారా ఫోటోలు చిత్రీకరిస్తాయి. ఘాట్లలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెల్సుకునే వీలుంటుంది. రద్దీని గుర్తించేందుకు కైసర్ యాప్.... ప్రధానమైన పుష్కర ఘాట్లను మ్యాపింగ్ చేయడం ద్వారా ఎక్కడ ఎక్కువ రద్దీ ఉందో గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో పోలీసుల భద్రతను పటిష్టం చేసుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్‌ను అభివద్ధి చేసింది. దీనిపేరు కైసర్. దీనిద్వారా వాహనాల్లో వెళ్లే యాత్రికులు రద్దీ తక్కువగా ఉన్న ఘాట్లను ప్రయాణ సమయంలోనే గుర్తించవచ్చు. దీన్నిబట్టి ఆయా ఘాట్లకు వెళ్లి సత్వరమే స్నానం చేసి వెళ్లేందుకు వీలవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలను కూడా నివారించే వీలుందని అధికారులు చెబుతున్నారు. -
నేటినుంచి టీటీడీ నమూనా ఆలయం ప్రారంభం
తిరుపతి అర్బన్: పవిత్ర కృష్ణా పుష్కరాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం ఆదివారం ఉదయం ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో నమూనా ఆలయం వద్ద ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మహా సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం కృష్ణానది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఈ నమూనా ఆలయంలో వైఖాసన ఆగమోక్తంగా సేవలన్నీ స్వామి వారికి ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ఉదయం ప్రారంభం అయ్యే తొలి సుప్రభాతం, అనంతరం తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, ఊంజల్ సేవల, ఏకాంత సేవలను తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో నిర్వహించేందుకు టీటీడీ అర్చకులు అన్ని చర్యలు తీసుకున్నారని వివరించారు. లక్షమంది భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు అన్నప్రసాదం, తీర్థప్రసాదాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రోజూ సాయంత్రం నమూనా ఆలయం నుంచి పద్మావతి ఘాట్ వెళ్లి పుష్కర హారతి ఇవ్వడం ద్వారా కృష్ణమ్మకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తారని తెలిపారు. -
చంద్రబాబు దగ్గర అడ్జెస్ట్ అవుదామని వచ్చా
విజయవాడ: 'ఇప్పటివరకు నేను మూడు పార్టీలు మారాను. ఏ నాయకునితోనూ ఇమడలేకపోయాను. నా మాటతీరు వల్లే అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు దగ్గర అడ్జెస్ట్ అవుదామని వచ్చా. ఇన్నాళ్లూ చంద్రబాబును విమర్శించింది వాస్తవమే. అయితే అవన్నీ సద్విమర్శలేనని గుర్తించాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిర్భయంగా చెబుతా. నిజానికి నేను ఎన్ని పార్టీలు మారినా ఇంట్లో ఎన్టీఆర్, చంద్రబాబుల ఫొటోలు తీయలేదు. పొద్దున్నే లేచాక ఆ రెండు ఫోటోలు చూశాకే నా దినచర్య మొదలవుతుంది' అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాను పార్టీ మారడాన్ని సమర్థించుకున్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోతుల టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నెహ్రూకు పచ్చ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెహ్రూకు యనమల సెటైర్లు టీడీపీలోకి చేరిక సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచే మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై సెటైర్లు వేశారు. 'ఈ రోజు నెహ్రూ మన పెళ్లికొడుకు. ఆయనతో వచ్చినవారంతా పెళ్లికొడుకులే. జ్యోతుల ఉన్న పార్టీ మునిగిపోతుందన్న ఆలోచన నుంచి బయటపడాలి. ఆయన మనసు విశాలంగా ఉన్నా మాట మాత్రం గొడవలా ఉంటుంది' అని యనమల వ్యాఖ్యానించారు. మంత్రి మాటలకు స్పందించిన నెహ్రూ మాట ఎలా ఉన్నా నిర్ణయాలు మాత్రం గట్టిగానే తీసుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రమంతా టీడీపీనే ఉండాలని.. జ్యోతుల నెహ్రూ చేరిక సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ విభజనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, అభివృద్ధి చేసుకునే క్రమంలో అందరినీ కలుపుకొనిపోవాలని నిర్ణయించుకున్నామని, అందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. -
‘హోదా’ ధర్నాలో తీవ్ర ఉద్రిక్తత..
♦ హోదా కోసం విజయవాడలో విద్యార్థుల నిరసన ప్రదర్శన ♦ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం ♦ దాడి చేసి చితక బాదిన బీజేపీ నాయకులు సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాను తక్షణం ప్రకటించాలని కోరుతూ ఆదివారం స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి, యువజన జేఏసీ నాయకులపై బీజేపీ నేతలు పాశవికంగా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థి, యువజన జేఏసీ నేతలు శాంతియుతంగా ధర్నా చేసి, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియచేసేందుకు ప్రయత్నించగా, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఎస్సీ మోర్చా, ఇతర విభాగాల నేతలు ఒక్కసారిగా వారిపై విరుచుకు పడ్డారు. విద్యార్థుల చేతిలో ఉన్న ప్రధాని దిష్టిబొమ్మను బలవంతంగా లాక్కుని పక్కన పడేశారు. తరిమి కొట్టిన నేతలు..: బీజేపీ నేతలు జి.మోహన్, అంజిబాబు, రామినేని కృష్ణ, శ్రీనివాస్, పీయూశ్ దేశాయ్ తదితరులు విద్యార్థులపై మూకుమ్మడిగా దాడి చేసి వారిని కార్యాలయం ఉన్న రోడ్డు చివర వరకు తరిమి కొట్టా రు.విద్యార్థుల గుర్తింపు కార్డులు చూపించాలంటూ వారి మెడలు పట్టుకుని తోసుకుంటూ వెళ్లారు. అయినా వారు సంయమనంతో వ్యవహరించి ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. నల్లజెండాలతో విద్యార్థులు నిరసన తెలియజేయబోగా రెచ్చిపోయిన బీజేపీ నేతలు నల్లజెండాలను లాక్కుని వాటి కర్రలతో వారిపైనే దాడి చేశారు. కొంతమంది విద్యార్థుల చెంపలు చెళ్లుమనిపించారు. కిందకు పడదోసి కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్ని తరిమితరిమి కొట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 20 నిమిషాల పాటు రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రవికిరణ్ అనే విద్యార్థి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అతని నోరు నొక్కివేస్తూ తోసుకుంటూ తీసుకువెళ్లారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థి, యువజన జేఏసీ నేతలు జె.రవికిరణ్, దుర్గా నాగరాజు, కె.తేజ, నిరంజన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపబోమని, మరింతగా ప్రజల్లోకి తీసుకువెళతామని జేఏసీ నేతలు చెప్పారు. -
విద్యార్థులను చితకబాదిన బీజేపీ నేతలు
-
‘భూ’గ్రహణం వీడేనా..!
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రవాణా రాజధానిగా, వాణిజ్య వాడగా భాసిల్లుతున్న విజయవాడకు అతి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి పట్టిన గ్రహణం వీడటంలేదు. భూసేకరణలో జాప్యం కారణంగా ఎన్నో ఏళ్లుగా ఈ విమానాశ్రయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి విస్తరణకు అవసరమైన ప్రైవేటు భూమి సేకరణలో సాధ్యాసాధ్యాలపై మరోసారి చర్చ జరుగుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు రావటం.. కేంద్ర మంత్రివర్గంలో సీమాంధ్రకు చెందిన టీడీపీ నేత అశోక్‌గజపతిరాజుకు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి లభించడం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు - విజయవాడ మధ్యే ఏర్పాటవుతుందని విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఈసారి జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మొదట్లో మెత్తబడినా... సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన 490 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి సర్వే నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి, అప్పారావుపేట, అజ్జంపూడి, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాల్లో 170 ఇళ్లు, సుమారు 300 మంది 490 ఎకరాల భూమిని కోల్పోతున్నారు. వీరికి పరిహారం విషయమై రైతులతో అధికారులు చర్చలు జరిపారు. గత పార్లమెంటు చివరి సమావేశాల్లో ఆమోదించిన భూసేకరణ బిల్లు ప్రకారం పరిహారం చెల్లిస్తేనే తమ భూములను అప్పగిస్తామని నిర్వాసితులు రెవెన్యూ అధికారులకు చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. భూసేకరణ చేసే నాటికి ఉన్న ప్రభుత్వ, మార్కెట్ విలువలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఆ ప్రకారం మార్కెట్ విలువలు చెల్లిస్తామని చెప్పడంతో అప్పట్లో రైతులు మెత్తబడ్డారు. రైతులకు పరిహారం ఇవ్వటానికి దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమైంది. ఆ నిధులు లేకపోవటం, సార్వత్రిక ఎన్నికలు రావటంతో భూసేకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల ప్రకారం గత నాలుగు నెలల కన్నా భూముల మార్కెట్ విలువలు సగానికి సగం పెరిగాయి. బుద్ధవరం, దావాజీగూడెం తదితర గ్రామాల్లో నాలుగు నెలల కిందట ఎకరం రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ధర పలికాయి. ఇప్పుడు అక్కడ ఎకరం రూ.1.50 కోట్లకు చేరింది. దీంతో తక్కువ ధరలకు రైతులు తమ భూములను ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే... గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే అనేక మౌలిక వసతులు అత్యవసరం కానున్నాయి. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో అరకొర వసతులతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై తదితర పట్టణాలకు ఐదు విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం రన్‌వేను విస్తరించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న 7,500 మీటర్ల రన్‌వేను 10,500 మీటర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. రన్‌వేను విస్తరిస్తే బోయింగ్ విమానాలు దిగటానికి అవకాశం ఉంటుంది. రన్‌వే విస్తరించడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ వద్ద నిధులున్నా భూమి లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. కొత్తగా టెర్మినల్ భవనం, కార్ పార్కింగ్, క్యాంటీన్, విమానాలు నిలిపే స్థలం ఏర్పాటు, రోడ్లు నిర్మించాల్సి వస్తుంది. భూసేకరణ సమస్యను అధిగమిస్తేనే ఇవన్నీ సాధ్యమనే విషయం గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.