
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద బుదవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేని గూడెంకు చెందిన బండి సతీష్ రెడ్డిని అనే ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్ చేయడంపై గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘర్షణలకు సంబంధంలేని వ్యక్తులను అరెస్టు చేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గత ఆదివారం రాత్రి బాపులపాడు మండలం కె. సీతారామపురం గ్రామంలో జరిగిన వివాదంతో సంబంధం లేని సతీష్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటని నేతలు ప్రశ్నించారు.
పైగా ఈ రోజు అతనికి పరీక్షలు ఉన్నాయని చెప్పినా పోలీసులు విడిచి పెట్టకపోవడం దారుణమన్నారు. వెంటనే సతీష్ రెడ్డిని విడుదల చేసి, విద్యార్థులపై అక్రమంగా పెట్టిన ఎసీ, ఎస్టీ, అట్రాసీటి కేసులను ఎత్తివేయాలన్నారు. లేనిపక్షంలో ఆమరణ దీక్షకు దిగుతామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
చదవండి : టీడీపీ నేతల దౌర్జన్యకాండ
Comments
Please login to add a commentAdd a comment