yarlagadda
-
సీసీటీవీలో బయటపడ్డ టీడీపీ రౌడీలు దాడి..
-
హనుమాన్ జంక్షన్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద బుదవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేని గూడెంకు చెందిన బండి సతీష్ రెడ్డిని అనే ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్ చేయడంపై గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణలకు సంబంధంలేని వ్యక్తులను అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గత ఆదివారం రాత్రి బాపులపాడు మండలం కె. సీతారామపురం గ్రామంలో జరిగిన వివాదంతో సంబంధం లేని సతీష్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటని నేతలు ప్రశ్నించారు. పైగా ఈ రోజు అతనికి పరీక్షలు ఉన్నాయని చెప్పినా పోలీసులు విడిచి పెట్టకపోవడం దారుణమన్నారు. వెంటనే సతీష్ రెడ్డిని విడుదల చేసి, విద్యార్థులపై అక్రమంగా పెట్టిన ఎసీ, ఎస్టీ, అట్రాసీటి కేసులను ఎత్తివేయాలన్నారు. లేనిపక్షంలో ఆమరణ దీక్షకు దిగుతామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. చదవండి : టీడీపీ నేతల దౌర్జన్యకాండ -
తెలుగు ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు
– జాతీయ తెలుగు కవిసమ్మేళనంలో యార్లగడ్డ శ్రీకాళహస్తి: తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులను నిలదీయాలని తెలుగుభాష పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, హిందీ అకాడమీ చైర్మన్ ఆచార్య పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలోని దూర్జటి రసజ్ఞ సమాఖ్యలో ఆదివారం జాతీయ తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 167 మంది కవులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగును విశ్వానికి పరిచయం చేస్తున్న కవులు, రచయితలు, సాహితీవేత్తలకు భరోసా ఇస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలోని 49వ పేజీలో పొందుపరచిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టగానే విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో కవులు, రచయితలకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రతి నెలా అందిస్తానని పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో తెలుగుభాష ఖ్యాతిని చాటుతున్న కవుల సంక్షేవుం కోసం చేయూతనిస్తావుని చెప్పిన చంద్రబాబు వూట తప్పారని వివుర్శించారు. రెండేళ్ల కిందట విజయవాడలో జరిగిన మాతృ భాషా దినోత్సవ వేడుకల్లో దేశంలో హిందీ తర్వాత తెలుగు మాట్లాడేవారే అధిక సంఖ్యలో ఉన్నారని, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విధిగా 2వ భాషగా పొందుపరుస్తావుని ప్రకటించినా ఇప్పటి వరకు అవులుకు నోచుకోలేదన్నారు. గోదావరి పుష్కరాలలో తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామని సీఎం ప్రకటించినా ఇప్పటివరకు ఆ ఊసే లేదని ఆయన వివుర్శించారు. రాష్ట్ర రాజధాని అవురావతి శంకుస్థాపన శిలాఫలకాలపై ఆంగ్లభాషలో అక్షరాలు ఉండడంపై తాము అప్పట్లోనే ఆందోళన కార్యక్రవూలు చేపట్టామన్నారు. -
తెలుగుపై ప్రభుత్వం చిన్నచూపు
ఏ ఒక్క హామీని అమలు చేయడంలేదు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన డాబాగార్డెన్స్(విశాఖ): తెలుగు భాషను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి త్వరలోనే రానుందని లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరపు కోటేశ్వరరావు రచించిన ‘కృష్ణవేణి’ నృత్య రూపకానికి సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో తెలుగు సంస్కృతి గూర్చి తెలుసుకునేందుకు విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక సబ్జెక్ట్‌గా బోధించాలని చెబితే, తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత విస్మరించిందన్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల తెలుగు మీడియం పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని యార్లగడ్డ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు. కార్మిక దినోత్సవం రోజున శ్రీశ్రీ గహాన్ని మంచి మ్యూజియంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినా ఆ దిశగా పనిచేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 24న కూచిపూడి అకాడమీ ఆఫ్ సెయింట్ లూయిస్(అమెరికా)కు చెందిన వింజమూరి సుజాత బృందంచే విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో ‘కృష్ణవేణి’ నృత్యరూపకం ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బృందంలో అమెరికాకు చెందిన నలుగురు కళాకారులు ఉన్నారని చెప్పారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించే క్రమంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో కళాకారులు వింజమూరి సుజాత, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు.