అగ్రిగోల్డ్ వ్యవహారంలో రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుకి ముడుపులు అందాయని, పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యలయంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకునే పనిలో ఉన్నారని, రాజధాని రైతుల భూములు దోచుకున్న పచ్చ దండు సామాన్యుల భూములపై కన్నువేసిందని ఆరోపించారు.