spokes person
-
జేడీ(యూ) కీలక పదవికి కేసీ త్యాగి రాజీనామా
పట్నా: జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నేత కేసీ త్యాగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్‌కు రాసిన లేఖలో త్యాగి పేర్కొన్నారు.ఇటీవల కాలంలో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. కేసీ త్యాగి స్థానంలో కొత్త జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అఫాక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇటీవల చేసిన త్యాగి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించినందునే యాన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలను సంప్రదించకుండానే త్యాగి చేసిన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో విభేదాలు తలెత్తినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీ(యూ) కీలక భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. -
AP: జనసేనకు షాకిస్తూ బీజేపీకిలోకి..
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో విపక్షాల పొత్తులపర్వంపై గందరగోళం నడుస్తోంది. బీజేపీ-జనసేనల చెట్టాపట్టాల్పై ఆ పార్టీల నేతలకే స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో దోస్తీ ఉన్నా.. లేనట్లేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండడమూ చూస్తున్నాం. ఈ తరుణంలో జనసేనకు పండగనాడు ఊహించని షాక్ తగిలింది. జనసేన అధికార ప్రతినిధి ఆకుల కిరణ్ కాషాయం కండువా కప్పుకున్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరుకాగా, ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరాడు ఆకుల కిరణ్. -
ఆన్లైన్లో ‘సుపారీ ఇస్తానన్న’ వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను హత్యచేస్తే రూ.కోటి ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొఘల్‌పురకు చెందిన ఖవి అబ్బాసీ ఏఐఎంఐఎం (ఇంకిలాబ్) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓ మతానికి వ్యతిరేకంగా నుపూర్ శర్మ మాట్లాడారనే ఉద్దేశంతో ఖవి సోషల్ మీడియాలో ఆయన్ను చంపితే నజరానా ఇస్తానంటూ ప్రకటించారు. ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?) -
మాట మార్చిన పుతిన్: యుద్ధాన్ని ఆపేందుకే మిలిటరీ ఆపరేషన్!
Goal Of Russias Military Operation: ఉక్రెయిన్ రష్యాల మధ్య సాగుతున్న నిరవధిక పోరు నేటికి 13వ రోజుకి చేరుకుంది. అయితే యూకేలో రష్యన్ రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని మిలటరీ ఆపరేషన్ లక్ష్యం యుద్ధాన్ని ఆపడమే అని రష్యా విదేశాంగ మంత్రి సెర్టీ విక్టోరోవిచ్ లావ్రోవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ..ఇది పచ్చి అబద్ధం అని ఖండించారు. అంతేకాదు అప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని రష్యన్ మాట్లాడే వర్గాలను రక్షించడమే లక్ష్యంగా 'మిలిటరీ ఆపరేషన్' అని పేర్కొన్నారు. పైగా రష్యాను బెదిరించడానికి ఉక్రెయిన్ను ఉపయోగించకుండా నిరోధించడం అని కూడా చెప్పారు. కానీ పశ్చిమ దేశాలు పుతిన్ వాదనను యుద్ధానికి నిరాధారమైన సాకుగా అభివర్ణించాయి. కానీ ఇప్పుడేమో రష్యా ఎంబసీ ఉక్రెయిన్ భూభాగంలో జరిగే యుద్ధాన్ని ఆపేందుకే ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ అంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. అయితే అమెరికా నేతృత్వంలోని నాటో ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడమే కాక మాస్కో దురాక్రమణకు అడ్డుకట్టవేసేలా ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. మరోవైపు రష్యా సాయుధ బలగాలు రాజధాని కైవ్‌ని సోంతం చేసుకుంటాం లొంగిపోండి అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని బెదిరించడమే కాక ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల బాంబుల వర్షంతో విరుచుకుపడింది. ఈ యుద్ధ విధ్వసం కారణంగా సుమారు 331 మందికి పైగా పౌరులు మరణించినట్లు యూఎన్ మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. FM #Lavrov: The goal of Russia’s special military operation is to stop any war that could take place on Ukrainian territory or that could start from there. pic.twitter.com/tLf7798DIh — Russian Embassy, UK (@RussianEmbassy) March 7, 2022 (చదవండి: ఓవైపు యుద్ధం.. మరోవైపు తరలింపు!! రష్యా-ఉక్రెయిన్ చెరోమాట) -
కాంగ్రెస్‌ను పెంచగలిగే పంచాక్షరి!
చైతన్యవంతమైన సమాజంలో మెజార్టీ వర్గం... సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న మైనార్టీ వర్గాలకు రక్షణగా నిలవాలి. భారతీయ విలువలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. కాబట్టి సెక్యులరిజం విషయంలో సాధికారత కలిగిన కాంగ్రెస్ ఆ విషయాన్ని మరోసారి ప్రపంచానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ హిందుత్వ వాదనలోని డొల్లతనాన్ని మౌలిక ప్రశ్నలతో ఎండగట్టాలి. అదే ఆ పార్టీని తిరిగి దేశ ప్రజలకు చేరువ చేస్తుంది. మెజార్టీ హిందువుల మద్దతు లేకుండా కాంగ్రెస్ దేశాన్ని అత్యధిక కాలం పాలించగలిగేది కాదని గుర్తించాలి. భారత్‌లో ప్రస్తుతం ఉన్నది హిందూ–ముస్లిం సమస్య కాదు. మానవత్వానికి సంబంధించినది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హిందుత్వ అన్న పదం వినపడిన వెంటనే ఇంతెత్తున లేస్తూంటాయి. మరీ ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ హిందుత్వ పోకడలను దునుమాడిననప్పుడల్లా బీజేపీ, ఆర్ఎస్ఎస్ల కోపతాపాలు మరింత భగ్గుమంటూంటాయి. ఈ పోకడలను బట్టి వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ కొంచెం నిశితంగా పరిశీలిస్తే, స్థిమితంగా ఆలోచించగలిగితే అంత ఆశ్చర్యమేమీ కలగదు. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ మతం పునాదులపైనే నిర్మింపబడ్డాయి కాబట్టి! నూటా నలభై కోట్ల భారత జనాభాలో 79 శాతం మంది ఉన్న హిందువులు వీరి టార్గెట్. ఇతరులు తమకు అణిగిమణిగి ఉండాలన్నదే వీటి రాజకీయ సిద్ధాంతం. లోపభూయిష్ఠమైన, పాత వాసనలున్న విధానం ఇది. కానీ బీజేపీకి ఓట్లూ, నిధుల రూపంలో కోట్లూ రాల్చిందీ ఈ విధానమే అన్నది గుర్తుపెట్టుకోవాలి. బలమైన ఆయుధాన్ని అందించిన సల్మాన్ ఖుర్షీద్ రాజకీయ లాభాలు మోసుకొచ్చిన విధానాన్ని మరింత బలపరుచుకోవాలని భావిస్తున్న తరుణంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య – నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ పేరుతో రాసిన పుస్తకం ద్వారా బలమైన ఆయుధాన్ని, అవకాశాన్ని అందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురణకర్తలు మినహా ఇంకెవరైనా చదివారంటే నేను నమ్మను. కానీ ఇందులోని ఒక్క వాక్యం ‘‘హిందుత్వ అనేది ఐసిస్, బోకోహరాం వంటి వాటితో సరిపోలేది’’ అనేది మాత్రం పెద్ద దుమారమే లేపింది. ఐసిస్ తన వద్ద బందీలుగా ఉన్న వారిని చంపి వారి వీడియోలు తీసే నీచానికి పాల్పడే సంస్థ. అలాంటి సంస్థలతో హిందుత్వను పోల్చిన సల్మాన్ రాతలను నేనూ ఖండిస్తాను. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఖుర్షీద్‌కు ఉందనుకన్నా ఆ పోలిక మాత్రం అసంబద్ధం. ఇంకేముంది... బీజేపీ తన అస్త్రశస్త్రాలన్నింటినీ ఖుర్షీద్ పైకి ఎక్కుపెట్టింది. పుస్తకం అమ్ముకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని సృష్టించారని నేనైతే అనుకోవడం లేదు. (ఓ ఛానల్లో సల్మాన్ దీనంగా మన్నించమని కోరిన దృశ్యాలను చూసిన తరువాత వ్యక్తిగతంగానూ నేను లాభాల కోసం చేశారని నమ్మడం లేదు) ఒకవేళ అదే నిజమైతే చాలా అనైతికమైన విషయం. ఒకపక్క ప్రియాంకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో ఇదేమంత మంచి పరిణామం కాదు. సల్మాన్ ఖుర్షీద్ ఉద్దేశాలు వేరైతే మాత్రం అతడి తప్పుడు అంచనా విస్మయపరుస్తుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగాన్ని మరింత ఇబ్బంది పెట్టినట్లు అయింది. సల్మాన్ రాతలపై ఇప్పటికే కొన్ని పోలీస్ కేసులు నమోదయ్యాయి. భారతీయ న్యాయ వ్యవస్థ ఆయన వ్యాఖ్యల్లోని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. కాంగ్రెస్ లేవనెత్తగలిగిన అంశాలు... ఐదు! ఖుర్షీద్ పుస్తకం నేపథ్యంలో చెలరేగిన వివాదాన్ని బీజేపీ పతాక శీర్షికలకు చేర్చడమే కాకుండా కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం గట్టిగానే చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈ అంశంతోపాటు... ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నాను నెహ్రూతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోల్చడాన్ని పదే పదే లేవనెత్తి రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ మరింత మెరుగైన పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. బీజేపీ హిందుత్వ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టేందుకు మౌలిక ప్రశ్నలను ఎక్కుపెట్టాల్సిన అవసరముంది. సున్నిత అంశమైన హిందూత్వపై తనదైన కథనాలను ప్రచారంలోకి పెట్టిన విషయాలపై ప్రజల అంతఃచేతనను మేలుకొల్పాల్సి ఉంది. ఈ పని చేయాలంటే.. కాంగ్రెస్ ఐదు అంశాలను లేవనెత్తవచ్చు. 1. రెచ్చగొట్టే పోలికలు చేసేందుకు బదులు సల్మాన్ ఖుర్షీద్... ∙మోదీ అధికారం చేపట్టిన తరువాత దేశం మొత్తమ్మీద ప్రబలిన మతఛాందస వాదంపై తన విమర్శలు ఎక్కుపెట్టడం మేలు. మరీ ముఖ్యంగా 2015లో యూపీలోని దాద్రిలో ముహమ్మద్ అఖ్లాక్‌తో మొదలైన మూక హత్యల గురించి ప్రస్తావించాలి. 2. హిందూయిజానికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, అందరినీ సమాదరించే అద్భుత లక్షణం హిందూయిజం సొంతం. ‘‘హిందూయిజం అటు సహనానికి, ఇటు వసుధైక కుటుంబం అన్న భావనలకు ప్రతీక’’ అని స్వామి వివేకానంద లాంటివారు ఎప్పుడో విస్పష్టంగా చెప్పారు. దీనికీ ప్రస్తుతం రాజకీయ అవసరాల కోసం బీజేపీ ప్రచారంలోకి తెచ్చిన హిందూత్వకూ ఏమాత్రం పొంతన లేదు. హిందుత్వ పేరుతో బీజేపీ మైనార్టీలు తమ సొంత దేశంలోనే రెండో తరగతి పౌరులుగా భావించే స్థితికి చేర్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ హిందూత్వానికి ఊతమివ్వడం ద్వారా బీజేపీ సెక్యులరిజం అన్న రాజకీయ పద్ధతిని ఉల్లంఘిస్తోంది. సెక్యులరిజం భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమన్నది తెలిసిందే. 3. మెనార్టీల హక్కులను కాపాడి తప్పు చేశామన్న భావనను కాంగ్రెస్ వదులుకోవాలి. ఎల్కే అద్వానీ ‘సూడో సెక్యులర్లు’ అన్న పదాన్ని వాడినప్పుడే ఖండించకుండా కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసింది. ఆ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ తగురీతిలో తిప్పికొట్టలేదు. మెజార్టీ హిందువుల మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించగలిగిందా? ఇప్పటివరకూ 17 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే పదిసార్లు కాంగ్రెస్ ఎలా గెలవగలిగింది? కాబట్టే మైనార్టీ రాజకీయం చేస్తోందన్న బీజేపీ ఆరోపణలను వదిలించుకునేందుకు గట్టి ప్రయత్నం జరగాలి. సామాజిక మాధ్యమాలు, ఫేక్‌న్యూస్‌లు, ప్రధాన స్రవంతిలోని ఒక వర్గం మీడియా అధికార పార్టీ పెద్దలను సంతోషంగా ఉంచేందుకు హిందూ – ముస్లిం విభేదాలు కొనసాగేందుకు ప్రయత్నిస్తాయన్న విషయాన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు. 4. ఆర్ఎస్ఎస్, బీజేపీలను హిందు ధర్మ సంరక్షకులుగా ఎవరు నియమించారని కాంగ్రెస్ ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. భారతీయులు ఎవరు దేశభక్తులో, ఎవరో సెక్యులరో నిర్ణయించే అధికారం, సర్టిఫికెట్లు పంచే బాధ్యత బీజేపీకి ఎవరిచ్చారో కూడా కాంగ్రెస్ ప్రశ్నించాలి. 5. బీజేపీ హిందుత్వ జాతీయభావానికి ప్రతిగా కాంగ్రెస్ ‘భారత జాతీయ భావం’ అన్న అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్రను చెప్పడమే కాకుండా... బీజేపీ పాత్రను ప్రశ్నించే తెగువ చూపించాలి. సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకాన్ని అమ్ముకోగలిగాడో లేదో నాకు తెలియదు కానీ... కాంగ్రెస్ తన రాజకీయ సిద్ధాంతాలను మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు వచ్చింది. నిర్లక్ష్యానికి, నిష్క్రియాపరత్వానికి కాలం చెల్లిందని ఆ పార్టీ గుర్తించాలి. చైతన్యవంతమైన సమాజంలో మెజార్టీ వర్గం... సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న మైనార్టీ వర్గాలకు రక్షణగా నిలవాలి. భారతీయ విలువలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. సెక్యులరిజం విషయంలో సాధికారత కలిగిన కాంగ్రెస్ ఇంకోసారి ఆ విషయాన్ని ప్రపంచానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నెహ్రూకు మించిన స్ఫూర్తి ఇంకోటి ఉండదేమో! ముస్లింలపై భారీ ఎత్తున దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిన ఒకానొక సందర్భంలో నెహ్రూ... ‘‘ఒక్క ముస్లిం వ్యక్తి వెంట్రుకకు హాని చేసినా నేను ఓ యుద్ధ ట్యాంక్పంపి... నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను’’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతారు. ఆ తరువాత కూడా నెహ్రూకు హిందువులు ఓట్లేయడం మానేయలేదు. భారత్‌లో ప్రస్తుతం ఉన్నది హిందూ–ముస్లిం సమస్య కాదు. మానవత్వానికి సంబంధించినది! – సంజయ్ ఝా, కాంగ్రెస్‌పార్టీ మాజీ అధికార ప్రతినిధి -
పార్టీపై విమర్శలు.. సంజయ్ ఝాపై వేటు
న్యూఢిల్లీ: సోనియా గాంధీ బుధవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి సంజయ్ ఝాను తొలగించారు. ఓ పత్రికలో పార్టీని విమర్శిస్తూ ఆయన వ్యాసం రాయడంతో అధిష్ఠానం ఈ చర్యకు దిగింది. ‘సంజయ్ ఝాను ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి వెంటనే తొలగిస్తూ సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు’ అని పార్టీ ప్రకటించింది. అంతేకాక అభిషేక్ దత్, సాద్నా భారతిలను జాతీయ మీడియా ప్యానలిస్టులుగా నియమిస్తూ సోనియా కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయింది. ఫలితంగా కార్యక్షేత్రంలో అంతగా ఆసక్తి చూపలేకపోతోంది. రాజకీయంగా తీవ్ర చిక్కులు ఎదుర్కొంటుంది. ఇంత ఇబ్బందుల్లో ఉన్న పార్టీని ఉత్సాహ పరిచి నడిపించే వారు లేరు. ఇంతటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోలేని వారు కూడా పార్టీలో చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు నా లాంటి వారు గాంధీ ఫిలాసఫీకి, నెహ్రూ దృక్పథానికి బద్ధులమైపోయాం. పార్టీ విచ్ఛిన్నాన్ని చూడలేకపోతున్నాం’ అంటూ సంజయ్ ఝా తను రాసిన వ్యాసంలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాంతో అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. -
రష్యా అద్యక్షుడి అధికార ప్రతినిధికి కరోనా
మాస్కో : రష్యా అద్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరోనా భారిన పడ్డారు. వైరస్ కారణంగా ఆసుపత్రిలో చికత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుంచి పుతిన్ ముఖ్య సహాయకుడిగా కొనసాగుతున్నారు. రెండు వారాల క్రితం రష్యా అద్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకోవడంలో రష్యా విజయవంతమైందని అద్యక్షుడు పుతిన్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన అధికార ప్రతినిధికి వైరస్ సోకడం గమనార్హం. (పుతిన్‌కు కిమ్ జోంగ్ ఉన్ లేఖ ) ఇక పెస్కోవ్ ఏప్రిల్ 30 న చివరిసారిగా పుతిన్‌తో కలిసి ఓ సమావేశంలో హాజరైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాక్డౌన్ సడలింపులు ప్రకటించిన రష్యా..వ్యాధి లక్షణాలు కనిపించవారు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. ఇక గత కొన్ని వారాలుగా పుతిన్ తన సమావేశాలన్నింటినీ టెలీకాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహిస్తున్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. మంగళవారం నాటికి రష్యా వ్యాప్తంగా 2,32,000 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 2100 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (పుతిన్‌ను కలిసిన డాక్టర్‌కు పాజిటివ్) -
‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’
సాక్షి, విశాఖపట్టణం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో చేసింది లాంగ్ మార్చ్ కాదు, ఈవినింగ్ వాక్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్ మార్చ్ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ అన్న చిరంజీవిని విమర్శించిన అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడుల పక్కన కూర్చోడానికి సిగ్గుగా అనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం తరపున టిక్కెట్లు నీవు ఇవ్వలేదు. ఒకవేళ నువ్వే ఇచ్చినా చాలా మంది ఓడిపోయారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పవన్ మానసిక స్థితి బాగోలేదని, ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీకు తాట తీయడం తెలిస్తే, మాకు తోలు తీయడం తెలుసంటూ పవన్‌ను హెచ్చరించారు. -
‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మేనిఫెస్టోలో చేర్చండి’
హైదరాబాద్: అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దిష్టంగా పొందుపర్చి ఆ మేరకు నడుచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కాలుష్యం ప్రధాన సమస్యగా మారిందని, పర్యావరణ పరిరక్షణకు ఏ రాజకీయ పార్టీ కూడా తగిన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నా రు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) ఆధ్వర్యంలో ‘ప్రిపేరింగ్ తెలంగాణ ఫర్ ఎ గ్లోబల్ ఛేంజ్’పేరుతో 17 అంశాలతో రూపొందించిన సమీకృత ఎన్నికల ప్రణాళిక–2018ను ఆవిష్కరించారు. ఇండిపెండెట్ పాలసీ ఎక్స్పర్ట్ డాక్టర్ నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి, సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన 17 అంశాల్లో ఒక్కో అంశంపై ఆయా రంగాల నిపుణులు ప్రసంగించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా జీవావరణ సంబంధమైన జీవనోపాధి, హరిత నైపుణ్యం, పర్యావరణ సుస్థిరాభివృద్ధి, ఇంధనాలు, ఆహార భద్రత వంటి అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. ఈ మేనిఫెస్టోను అన్ని పార్టీల అధినాయకులకు అందిస్తామని చెప్పారు. సీజీఆర్ ఆధ్వర్యంలో నవంబర్ 17న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ ఇంజనీర్ డాక్టర్ కేశవరెడ్డి, పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు. -
‘పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్త’
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుకి ముడుపులు అందాయని, పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకునే పనిలో ఉన్నారని.. రాజధాని రైతుల భూములు దోచుకున్న పచ్చదండు సామాన్యుల భూములపై కన్నువేసిందని ఆరోపించారు. లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని సీఎం అధికారిక నివాసంగా మార్చుకున్నారని, ఇంక రమేష్‌కి అడ్డు అదుపు ఉంటుందా అని ప్రశ్నించారు. లింగమనేని రమేష్.. పవన్ కళ్యాణ్‌కి కూడా భూములిచ్చారని, లింగమనేని ఎస్టేట్స్ భూదోపిడిపై సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లింగమనేని గ్రూప్‌లో చంద్రబాబు, లోకేష్‌ల వాటా ఎంత అని ప్రశ్నించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. అవాకులు, చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాలు విసిరారు. -
చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకున్నారు
-
టీపీసీసీ అధికార ప్రతినిధిగా సీతారాంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధికార ప్రతినిధిగా సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన చల్లా సీతారాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. సీతారాంరెడ్డి సమాచార, ప్రజాసంబంధాల శాఖలో 33 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ పొందారు. తనను నియమించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవిలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
వివాదాల నేపథ్యంలో టాలీవుడ్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : సినిమా పరిశ్రమలోని గత కొంత కాలంగా చెలరేగుతున్న వివాదాలకు చెక్ పెట్టాలని సినీ ప్రముఖులు నిర్ణయించారు. పలు టీవీ ఛానెల్‌లలో టాలీవుడ్ తరపున అంటూ చాలా మంది డిబేట్లకు వెళ్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పరిశ్రమ కొంత మందిని టాలీవుడ్ అధికారిక ప్రతినిధులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ విభాగం గురించైనా ఒక అంశంపై అధికారికంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ ప్రతినిధులు టాలీవుడ్ పక్షాన అధికారిక ప్రతినిధులుగా మాట్లాడుతారని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. సభ్యులు 1. పి. కిరణ్ , అధ్యక్షులు , తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2. ముత్యాల రాందాస్, గౌరవ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 3. కె. మురళీ మోహన్ అధ్యక్షులు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4. సునీల్ నారంగ్, గౌరవ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 5. డా.కె.ఎల్. నారాయణ, అధ్యక్షులు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ 6. కొమర వెంకటేష్, అధ్యక్షులు , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 7. ఆర్. వెంకటేశ్వరరావు, జనరల్ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఇండస్ర్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 8. ఎన్. శంకర్, అధ్యక్షులు, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 9. డా. నరేష్ వి.కె, జనరల్ కార్యదర్శి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 10. తమ్మారెడ్డి భరద్వాజ 11. వి. వెంకటరమాణారెడ్డి (దిల్ రాజు) 12. బీవీ నందినీ రెడ్డి 13. ఝాన్సీ లక్ష్మి యలవర్తి -
‘బీజేపీని కార్నర్ చేస్తున్న టీడీపీ’
-
‘బీజేపీని కార్నర్ చేస్తున్న టీడీపీ’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యంకాదని, అందుకే సాయం చేస్తామని కేంద్రం చెప్పినట్టు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మాట ఇచ్చారు కాబట్టే ఆ మాటపై నిలబడ్డామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు తలూపిన చంద్రబాబు ఇప్పుడెందుకు కొత్తపాట పాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇంకా పదేళ్ల సమయం ఉందని, ప్రజలు వాస్తవాలు తెలుకోవాలని కోరారు. తాము మిత్రధర్మాన్ని విస్మరించలేదని, టీడీపీ నాయకులే రాజకీయ లబ్ధి కోసం తమను కార్నర్ చేస్తున్నారని వాపోయారు. కాగా, ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు టీడీపీ ఎంపీలు కేబినెట్ పదవులకు రాజీనామా సమర్పించారు. అయితే తమ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతారని టీడీపీ ప్రకటించింది. -
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్రాజు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
‘మా ప్రజాప్రతినిధులకు సంపాదనే ధ్యేయం’
కొవ్వూరు : టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సంపాదనే ధ్యేయంగా తప్పులు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కేవీకే రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయనొక ప్రకటన చేస్తూ డబ్బు సంపాదించుకుకోవాలన్న ఆరాటంతో ప్రజాప్రతినిధులమనే మాట మరిచిపోయి ఇసుక ర్యాంపుల్లో అరాచకాలు చేస్తున్నారన్నారు. వారివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఇలాంటి వారివల్ల పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్న వారికి చెట్టపేరు వస్తోందన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని స్వార్థంతో డబ్బు సంపాదన కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓ ప్రజాప్రతినిధి కుమారదేవం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి రభస చేయడం విచారకరమన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
దుబార ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్
నిజామాబాద్ సిటీ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆర్థిక క్రమశిక్షణ లేదని పీసీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో అవసరం లేని చోట ప్రాజెక్టుల నిర్మాణం, వాస్తు పేరిట ఉన్నవాటిని కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టడం ప్రజల సొమ్మును దుబార చేయడమే నన్నారు. శనివారం నిజామాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చక్కని సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించారని, ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా అన్ని విధాల ఉపయోగపడేలా క్యాంపు కార్యాలయం నిర్మిస్తే దానికి వాస్తు లేదని కూల్చివేసి రూ. 33 కోట్లతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించేయత్నంలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. రూ. ఒక లక్ష 60 వేల కోట్లు అప్పులున్న ఈ రాష్ట్రంలో ఇంత దుబార ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నీటి నిపుణులు 1.5 టీఎంసీలకు నిర్దేశిస్తే, సీఎం ఏకంగా 30 నుంచి 40 టీఎంసీలకు వెళ్లి మల్లన్నసాగర్‌ను నిర్మాణం చేస్తున్నారంటే దాని వెనుక మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా డబ్బులు దండుకోడానికేనని అన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు అవసరమే లేదని ఆరునెలల పాటు లిఫ్టు ద్వారా పంటలకు ఇవ్వవచ్చన్నారు. అక్కడక్కడ చిన్న ప్రాజెక్టులు కట్టుకోవచ్చన్నారు. -
లోక్ సత్తా అధికార ప్రతినిధి అరెస్ట్
హైదరాబాద్: లోక్ సత్తా అధికార ప్రతినిధి సాంబిరెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 2014లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సాంబిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. -
అధికార ప్రతినిధిగా బసంత్ రెడ్డి
దుబాయి: గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్..మీడియా, అధికార ప్రతినిధిగా బసంత్ రెడ్డిని నియమించారు. దుబాయ్ టూరిజం అండ్ కమర్షియల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇబ్రహీం యాకుబ్ అధ్యక్షతన నాలుగు వేల మంది పాల్గొన్న బహిరంగ సభలో బసంత్ రెడ్డిని నియమించారు. ఈ సభకు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హాజరయ్యారు. -
కాంగ్రెస్‌తో కలవాలనుకుంటే జగన్ జైలుకెందుకు వెళ్తాడు: అంబటి
అధికార కాంగ్రెస్‌తో కలిసిపోవాలనుకుంటే తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి 14 నెలలుగా జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే కాపాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మిగతా ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెట్టినప్పుడు బాబు మద్దతిస్తే నేడీ ప్రభుత్వమే ఉండేది కాదని, రాష్ట్రానికి ఈ విపత్కర పరిస్థితులు ఎదురయ్యేవే కావని చెప్పారు. ఎఫ్‌డీఐ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలను గైర్హాజరు చేయించి దాన్ని ఆమోదింపజేసిన ఘనత కూడా బాబుదేనని గుర్తుచేశారు. టీడీపీ ఇంత బహిరంగంగా కాంగ్రెస్‌తో కలిసి మెలిసి పనిచేస్తూ పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ... ఆ బురద జగన్‌పై చల్లడం యనమలకే చెల్లిందన్నారు. అవిశ్వాస తీర్మానం దగ్గరనుంచి రాష్ట్ర విభజన అంశం వరకూ చంద్రబాబు తరచూ కాంగ్రెస్ అధినేతలతో సంప్రదింపులు జరుపుతూ సంబంధాలు కలిగి ఉన్నారని ఇటీవల ‘హిందుస్థాన్ టైమ్స్’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని అంబటి ఉదహరిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరి మధ్య ఉన్నదీ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌తో కలవాలనుకుంటే జగన్ జైలుకెందుకు వెళ్తాడు: అంబటి
అధికార కాంగ్రెస్‌తో కలిసిపోవాలనుకుంటే తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి 14 నెలలుగా జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే కాపాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మిగతా ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెట్టినప్పుడు బాబు మద్దతిస్తే నేడీ ప్రభుత్వమే ఉండేది కాదని, రాష్ట్రానికి ఈ విపత్కర పరిస్థితులు ఎదురయ్యేవే కావని చెప్పారు. ఎఫ్‌డీఐ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలను గైర్హాజరు చేయించి దాన్ని ఆమోదింపజేసిన ఘనత కూడా బాబుదేనని గుర్తుచేశారు. టీడీపీ ఇంత బహిరంగంగా కాంగ్రెస్‌తో కలిసి మెలిసి పనిచేస్తూ పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ... ఆ బురద జగన్‌పై చల్లడం యనమలకే చెల్లిందన్నారు. అవిశ్వాస తీర్మానం దగ్గరనుంచి రాష్ట్ర విభజన అంశం వరకూ చంద్రబాబు తరచూ కాంగ్రెస్ అధినేతలతో సంప్రదింపులు జరుపుతూ సంబంధాలు కలిగి ఉన్నారని ఇటీవల ‘హిందుస్థాన్ టైమ్స్’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని అంబటి ఉదహరిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరి మధ్య ఉన్నదీ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.