
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధికార ప్రతినిధిగా సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన చల్లా సీతారాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. సీతారాంరెడ్డి సమాచార, ప్రజాసంబంధాల శాఖలో 33 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ పొందారు. తనను నియమించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవిలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment