
సాక్షి, హైదరాబాద్ : సినిమా పరిశ్రమలోని గత కొంత కాలంగా చెలరేగుతున్న వివాదాలకు చెక్ పెట్టాలని సినీ ప్రముఖులు నిర్ణయించారు. పలు టీవీ ఛానెల్లలో టాలీవుడ్ తరపున అంటూ చాలా మంది డిబేట్లకు వెళ్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పరిశ్రమ కొంత మందిని టాలీవుడ్ అధికారిక ప్రతినిధులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ విభాగం గురించైనా ఒక అంశంపై అధికారికంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ ప్రతినిధులు టాలీవుడ్ పక్షాన అధికారిక ప్రతినిధులుగా మాట్లాడుతారని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
సభ్యులు
1. పి. కిరణ్ , అధ్యక్షులు , తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
2. ముత్యాల రాందాస్, గౌరవ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
3. కె. మురళీ మోహన్ అధ్యక్షులు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
4. సునీల్ నారంగ్, గౌరవ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
5. డా.కె.ఎల్. నారాయణ, అధ్యక్షులు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్
6. కొమర వెంకటేష్, అధ్యక్షులు , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్
7. ఆర్. వెంకటేశ్వరరావు, జనరల్ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఇండస్ర్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్
8. ఎన్. శంకర్, అధ్యక్షులు, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్
9. డా. నరేష్ వి.కె, జనరల్ కార్యదర్శి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
10. తమ్మారెడ్డి భరద్వాజ
11. వి. వెంకటరమాణారెడ్డి (దిల్ రాజు)
12. బీవీ నందినీ రెడ్డి
13. ఝాన్సీ లక్ష్మి యలవర్తి
Comments
Please login to add a commentAdd a comment