మాస్కో : రష్యా అద్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరోనా భారిన పడ్డారు. వైరస్ కారణంగా ఆసుపత్రిలో చికత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుంచి పుతిన్ ముఖ్య సహాయకుడిగా కొనసాగుతున్నారు. రెండు వారాల క్రితం రష్యా అద్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకోవడంలో రష్యా విజయవంతమైందని అద్యక్షుడు పుతిన్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన అధికార ప్రతినిధికి వైరస్ సోకడం గమనార్హం. (పుతిన్‌కు కిమ్ జోంగ్ ఉన్ లేఖ )
ఇక పెస్కోవ్ ఏప్రిల్ 30 న చివరిసారిగా పుతిన్‌తో కలిసి ఓ సమావేశంలో హాజరైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించిన రష్యా..వ్యాధి లక్షణాలు కనిపించవారు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. ఇక గత కొన్ని వారాలుగా పుతిన్ తన సమావేశాలన్నింటినీ టెలీకాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహిస్తున్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. మంగళవారం నాటికి రష్యా వ్యాప్తంగా 2,32,000 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 2100 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
(పుతిన్‌ను కలిసిన డాక్టర్‌కు పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment