పట్నా: జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నేత కేసీ త్యాగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్‌కు రాసిన లేఖలో త్యాగి పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. కేసీ త్యాగి స్థానంలో కొత్త జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అఫాక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇటీవల చేసిన త్యాగి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించినందునే యాన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలను సంప్రదించకుండానే త్యాగి చేసిన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో విభేదాలు తలెత్తినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీ(యూ) కీలక భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment