KC Tyagi
-
జేడీ(యూ) కీలక పదవికి కేసీ త్యాగి రాజీనామా
పట్నా: జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నేత కేసీ త్యాగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్‌కు రాసిన లేఖలో త్యాగి పేర్కొన్నారు.ఇటీవల కాలంలో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. కేసీ త్యాగి స్థానంలో కొత్త జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అఫాక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇటీవల చేసిన త్యాగి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించినందునే యాన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలను సంప్రదించకుండానే త్యాగి చేసిన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో విభేదాలు తలెత్తినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీ(యూ) కీలక భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. -
నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్‌తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం: జేడీయూ
న్యూఢిల్లీ: సరైన ప్రాతినిధ్యం కల్పిస్తే కేంద్ర కేబినెట్లో చేరేందుకు సిద్ధమేనని జనతాదళ్(యునైటెడ్) బుధవారం సంకేతాలిచ్చింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈ జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ బీజేపీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని జేడీయూ నిరాకరించిన విషయం తెలిసిందే. జేడీయూకి కేంద్రంలో ఒకే మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించడంతో ప్రభుత్వంలో చేరేందుకు నాడు జేడీయూ నిరాకరించింది. తాజాగా, బుధవారం జరిగిన జేడీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను పార్టీ మరో మూడేళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆ తరువాత నితీశ్ పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు జేడీయూ సిద్ధంగానే ఉందని, అయితే, తమకు మంత్రిమండలిలో సరైన ప్రాతినిధ్యం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కానీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కానీ ఈ విషయంలో చొరవ తీసుకుంటే తాము స్వాగతిస్తామన్నారు. ఈ విషయంలో తామేమీ షరతులు విధించబోమన్నారు. మహారాష్ట్రలో మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య ప్రభుత్వ ఏర్పాటులో విబేధాలు ఏర్పడిన నేపథ్యంలో.. తాజాగా జేడీయూ ఈ ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను నితీశ్ ఓడించారు. -
బీజేపీ ఘోర పరాభవానికి అదే కారణం!
సాక్షి, పట్నా : దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. అటు, బిహార్‌లోని జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌కుమార్ ప్రతిష్టాత్మకంగా భావించిన జోకిహాట్ బైపోల్స్‌లో అధికార పార్టీ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలో ఆర్జేడీ భారీ మెజారిటీతో గెలుపొందింది. దీంతో ఆర్జేడీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. అదే కారణం.. ఎన్నికల ఫలితాలపై బీజేపీ మిత్రపక్షం జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి ఘాటుగా వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని, వరుసగా పెట్రో, డీజిల్ ధరలు పెరగడం.. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఒక కారణమని ఆయన విశ్లేషించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నితీశ్‌పై మండిపాటు.. తాజా ఉప ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో సీఎం నితీశ్‌కుమార్‌పై ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ మండిపడ్డారు. జోకిహాట్‌లో జేడీఎస్‌కు వచ్చిన ఓట్లు తమ మెజారిటీ కన్నా తక్కువేనని అన్నారు. యూటర్న్ తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీశ్‌పై రాష్ట్ర ప్రజలు పత్రీకారం తీర్చుకున్నారని, అందుకు తాజా ఉప ఎన్నికలే నిదర్శనమని అన్నారు. కేంద్ర సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేసి.. తమ కుటుంబంపై ఉసిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ కుటుంబాన్ని వేధిస్తున్న నితీశ్‌కు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. -
కేంద్రంకు కొత్త చిక్కు.. మరోచోట ప్రత్యేక డిమాండ్!
సాక్షి, పట్నా : ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర స్థాయి ఉద్యమం జరుగుతుండగా తాజాగా మరో రాష్ట్రంలో అదే డిమాండ్‌తో ఉద్యమం ప్రారంభం కానుంది. బిహార్‌లోని జేడీయూ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో కేంద్రంపై పోరాటానికి దిగనుంది. ఈ మేరకు జేడీయూ నేత కేసీ త్యాగి శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. 'ఈ మధ్య కాలంలోనే మా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా కేంద్రాన్ని తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. ఈ విషయంపై మేం పోరాటం కొనసాగిస్తాం' అని ఆయన అన్నారు. మహాగట్బంధన్ (జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కూటమి)నుంచి తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చిన జేడీయూ ఆ తర్వాత ఎన్డీయేతో పొత్తుపెట్టుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు తమకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో సీఎం నితీశ్ కుమార్ కోరారు. అయితే, ఆయన కేంద్రంలోని ఎన్డీయే మద్దతుతోనే మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ విషయం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అయితే, తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ డిమాండ్ మరోసారి బలంగా కేంద్రం ముందుకు తీసుకెళ్లాలని జేడీయూ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, ఎన్డీయేతో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటీగా బయటకు వెళ్లిపోతుండటంవంటి కారణాల దృష్ట్యా నితీశ్ సర్కార్ మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్‌తో పోరాటం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ ముఖ్యమంత్రి నితీశ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోగానే ఆయన ప్రత్యేక హోదాను మరిచిపోయారంటూ ప్రతి చోట విమర్శిస్తున్నారు. -
'సీఎం పిలిచినా ఎన్నికల్లో ప్రచారం చేయను'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని, లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్వయంగా ఆహ్వానించినా ఎన్నికల ప్రచారం చేసే ప్రసక్తే లేదని నితీశ్ స్పష్టం చేశారని జేడీయూ జనరల్ సెక్రటరీ కేసీ త్యాగి మీడియాకు తెలిపారు. పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యూపీ ఎన్నికల్లో మతతత్వ శక్తులు ఓడిపోవాలని బీజేపీని ఉద్దేశించి నితీశ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమి నెగ్గాలని మనస్ఫూర్తిగా తమ పార్టీ కోరుకుంటుందని చెప్పారు. ఎస్పీ- కాంగ్రెస్ పార్టీలు ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయలేకపోవడం నిరాశపరిచిందని నితీశ్ అభిప్రాయపడ్డారు. 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మనం గెలవాలంటే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీని ఓడించి తీరాలన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయకపోయినా ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గెలవాలని నితీశ్ కోరుకుంటున్నారని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. -
'బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుదాం'
కోల్ కతా: జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను పలు పార్టీలు స్వాగతించాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. 'కలిసి కూర్చుని మాట్లాడుకుందామని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కలిసికట్టుగా పోరాడదామన'ని ఆమె పేర్కొన్నారు. మమతా బెనర్జీ ప్రకటనను కాంగ్రెస్, జేడీ(యూ), ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతించాయి. బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ తో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. తమ పార్టీ విధానానికి అనుగుణంగా దీనిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మమతా బెనర్జీ ప్రతిపాదనకు మద్దతిస్తున్నామని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు. -
రాందేవ్ మందుపై నిషేధం
భోపాల్: యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన వివాదాస్పద మెడిసిన్ పుత్రజీవక్ను ఎక్కడా అమ్మకాలు జరపొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. దాని పేరు మార్చేవరకు ఎవరు అమ్మకాలు జరపొద్దని స్పష్టం చేసింది. పుత్ర జీవక్ వాడితే మగ సంతానం కలుగుతుందని దాని విక్రయదారులు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ త్యాగి పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. పుత్ర జీవక్ ప్యాకెట్లు పార్లమెంటుకు తెచ్చిమరీ ఈ వివాదం లేవనెత్తారు. ఇది పెద్ద దుమారాన్ని లేపింది. అయితే, అది కేవలం మొక్క పేరు మాత్రమేనని, తమ మెడిసిన్ వాడితే మగ సంతానం కలుగుతుందని తాము ఎక్కడా చెప్పలేదని రాందేవ్ ప్రత్యేక వివరణ ఇచ్చారు కూడా. కానీ, ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఈ మందుల ఉత్పత్తి విషయంలో, కొనుగోలు, అమ్మకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో దీనిపై నిషేధం విధించారు. -
రాందేవ్ మెడిసిన్‌పై సభలో దుమారం
-
రాందేవ్ మెడిసిన్‌పై సభలో దుమారం
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ ఆయుర్వేద మెడిసిన్‌పై రాజ్యసభలో పెద్ద దుమారం రేగింది. ఈ మెడిసిన్ ఉపయోగించేవారికి మగ సంతానం కలుగుతుందని తయారీ దారులు ప్రకటించడాన్ని రాజ్యసభలోని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, రాజ్యాంగేతరమైన చర్యగా పేర్కొంటూ దానిని వెంటనే నిషేధించి తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్‌ను అందిస్తోంది. దీనిని వాడిన వారికి మగ సంతానం కలుగుతోందని ప్రచారం చేస్తోంది. అయితే, దీనిపై జేడీయ ఎంపీ కేసీ త్యాగి సభలో ఈ ప్యాకెట్ ను ప్రదర్శిస్తూ దీనిని తాను దివ్యా మెడిసిన్ షాపులో తెచ్చానని, మగ పిల్లలు పుడతారని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14న తాను దీనిని తీసుకొన్నట్లు రశీదును కూడా సభలో ప్రదర్శించారు. రాందేవ్ పేరును ప్రస్తావించకుండా నిజంగా దేశాన్ని ఒక డైనమిక్ నాయకుడు పాలిస్తుంటే నరేంద్రమోదీ ఇప్పుడావిషయాన్ని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే సమాజ్ వాది పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆ ప్యాకెట్ ను తీసుకెళ్లి ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు అందజేశారు. దాని ఉత్పత్తిని వెంటనే నిలిపివేసి లైసెన్సు రద్దు చేయాలని కోరారు. దీనిపై కొంత చర్చ జరిగినా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికార పక్షం స్పీకర్‌తో ప్రకటన చేయించింది. -
నవాజ్ షరీఫ్‌కు ఆహ్వానమా?
పాట్నా: తన ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను నరేంద్ర మోడీ ఆహ్వానించడంపై జనతాదల్ యునెటైడ్(జేడీయూ) పార్టీ విమర్శలు గుప్పించింది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే వరకు పాకిస్థాన్‌తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోబోమని ఎన్నికల ప్రచారంలో మోడీ చెప్పారని జేడీ(యూ) నాయకుడు కేసీ త్యాగి గుర్తు చేశారు. ఇప్పుడు తన ప్రమాణస్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్‌ను మోడీ ఆహ్వానించారని ఆయన విమర్శించారు. మోడీ మాట తప్పడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. సార్క్ దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపారు. ఈ నెల 26న భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.