తన ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను నరేంద్ర మోడీ ఆహ్వానించడంపై జనతాదల్ యునెటైడ్(జేడీయూ) పార్టీ విమర్శలు గుప్పించింది.
పాట్నా: తన ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను నరేంద్ర మోడీ ఆహ్వానించడంపై జనతాదల్ యునెటైడ్(జేడీయూ) పార్టీ విమర్శలు గుప్పించింది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే వరకు పాకిస్థాన్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోబోమని ఎన్నికల ప్రచారంలో మోడీ చెప్పారని జేడీ(యూ) నాయకుడు కేసీ త్యాగి గుర్తు చేశారు.
ఇప్పుడు తన ప్రమాణస్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్ను మోడీ ఆహ్వానించారని ఆయన విమర్శించారు. మోడీ మాట తప్పడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. సార్క్ దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపారు. ఈ నెల 26న భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.