ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుందని అన్నారు. నరేంద్ర మోదీ ఇక నుంచి ఒకటిలో మూడో వంతు ప్రధాని (1/3 పీఎం)గా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్‌కుమారు, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి మోదీ ‘1/3 పీఎం’ అవుతారని అన్నారు.
బీజేపీ ప్రజాస్వామ్యం కంటే పదవుల కుర్చినే ఎక్కువగా నమ్ముతుందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి ఎక్కువ కాలం ఉండలేదని అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ.. ఎప్పటికైనా ఎన్డీయే కూటమి నుంచి బయటకువెళ్లే వ్యక్తులేనని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సొంతంగా పూర్తి మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకోసం ఎన్డీయే కూటమి పార్టీల మద్దతు తీసుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో జేడీ(యూ) నితీష్ కుమార్, టీడీపీ చంద్రబాబు కీలకంగా మారారు. బీజేపీ సొంతంగా 240 సీట్లు మత్రామే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం ఎంపీల సంఖ్య 293గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment