
సాక్షి, విజయవాడ : దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనురాధ, సహాయ కమిషనర్ పుష్పవర్ధన్‌తో సహా, మరొకరిపై విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దుర్గగుడిలో పనిచేసే వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ కార్మికుడు పట్ల దురుద్దేశ పూర్వకంగా, నష్టం కలిగించే విధంగా వ్యవహరించటం మీద కోర్టు ఆదేశాల మేరకు అనురాధపై సెక్షన్ 166, 384, 425, 506, 120బీ, 34ఐపీసీ, 156(3), సీఆర్‌పీసీల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో వైవీ అనురాధ దుర్గగుడి ఈవోగా పనిచేశారు.