
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : కాల్ మనీ ఆగడాలు మరోసారి పెచ్చుమీరాయి. కాల్ మనీ వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పసుపులేటి పద్మ అనే వివాహిత నాలుగేళ్ల కిందట టీడీపీ నేత అనుచరుడి నుంచి 2లక్షల రుణం తీసుకుంది. కొన్ని నెలల క్రితమే తీసుకున్న బాకీ మొత్తం తీర్చేసింది. అయితే ఇంకా డబ్బులు బాకీ ఉన్నావంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దౌర్జన్యానికి దిగారు. తరుచూ ఆమెను వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టారు. వేధింపులు తాళలేకపోయిన ఆమె మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.