బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు | Gold and Silver Price Today | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

Published Tue, Oct 3 2023 1:52 PM | Last Updated on Tue, Oct 3 2023 2:20 PM

Gold and Silver Price Today - Sakshi

గత వారం రోజులుగా రోజురోజుకి బంగారం ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఏకంగా 10 గ్రాముల బంగారం ధరలు మునుపటి కంటే రూ. 600 నుంచి రూ. 660 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం & వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూసేద్దాం.

⭐ విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5260 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5738గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 55260, 24 క్యారెట్ పసిడి ధర రూ. 57380గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణంలో కూడా ఉన్నాయి.

⭐ వెండి ధరల విషయానికి వస్తే విజయవాడలో 10 గ్రాముల వెండి రూ. 735. కావున ఒక కేజీ వెండి ధర రూ. 73500గా ఉంది. ఈ ధర నిన్నటి కంటే కూడా రూ. 2000 తక్కువ. నిన్న కేజీ వెండి ధర రూ. 75500గా ఉంది. వెండి కొనేవారికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇదే ధరలు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.

⭐ దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 5275 (1 గ్రామ్ 22 క్యారెట్), రూ. 5753 (1 గ్రామ్ 24 క్యారెట్). దీని ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలు రూ. 52750 & రూ. 57530గా ఉన్నాయి.  నిన్నటి పోలిస్తే ఈ ధరలు రూ. 600 & రూ. 660 తగ్గింది.

⭐ వెండి విషయానికి వస్తే.. ఒక గ్రామ్ వెండి రూ. 71. కావున 10 గ్రాముల వెండి రూ. 710, కేజీ ధర రూ. 71000గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 2000 తక్కువ కావడం గమనార్హం.

⭐ చెన్నైలో పసిడి ధరల విషయానికి వస్తే.. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5290 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5771గా ఉంది. నిన్నటి కంటే ఏ రోజు ధరలు రూ. 660 & రూ. 720 తక్కువ.

⭐ వెండి ధర చెన్నైలో రూ. 73.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 75500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 2000 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement