సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ సిద్ధిస్తే దుర్గమ్మకు ముక్కు పుడక చేయిస్తానని గతంలోనే కేసీఆర్ మొక్కుకున్నారు. గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు, మనవడితో కలసి విజయవాడకు వెళ్లనున్నారు. 12 గంటలకు విజయవాడ చేరుకోనున్న ఆయన.. 12.45 సమయంలో ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. అనం తరం తిరుగు ప్రయాణమవుతారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారమే కుటుంబ సమేతంగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
మొక్కు చెల్లించుకోనున్న సీఎం కేసీఆర్
Published Thu, Jun 28 2018 9:43 AM | Last Updated on Wed, Mar 20 2024 3:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement