Kanakadurgamma
-
ఘనంగా దుర్గ మాత నిమజ్జనం
-
దేవీ అలంకారాలు
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాౖయెర్ముఖైస్త్రీక్షణైఃయుక్తా మిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్‌గాయత్రీం వరదా భయంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవింద యుగళం హస్తైర్వహంతీ భజే‘‘ శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడవ రోజు గురువారం కనకదుర్గమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూల శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్త్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా, త్రిమూర్తి అంశగా గాయత్రీదేవి వెలుగొందుతున్నది. సమస్త దేవతా మంత్రాలూ గాయత్రీ మంత్రంతో అనుసంధానమవుతాయి. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవుళ్లకి అన్నప్రసాదాలను నివేదన చేస్తారు. గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత సూర్యభగవానుడు. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన భక్తులందరికీ సౌరశక్తి ప్రాప్తించి, ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారు. -
మొక్కు చెల్లించుకోనున్న సీఎం కేసీఆర్
-
నేడు దుర్గమ్మకు ముక్కుపుడక
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ సిద్ధిస్తే దుర్గమ్మకు ముక్కు పుడక చేయిస్తానని గతంలోనే కేసీఆర్ మొక్కుకున్నారు. గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు, మనవడితో కలసి విజయవాడకు వెళ్లనున్నారు. 12 గంటలకు విజయవాడ చేరుకోనున్న ఆయన.. 12.45 సమయంలో ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. అనం తరం తిరుగు ప్రయాణమవుతారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారమే కుటుంబ సమేతంగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. చంద్రాకారం.. పాలపిట్ట ఆకారంలో.. 11.29 గ్రాముల బంగారంతో రూపొందించిన చంద్రాకారం, దానిపై 3 వరసలుగా పొదిగిన 57 వజ్రాలు, చంద్రాకారం మధ్యలో చెట్టు కొమ్మ, కొమ్మపై కూర్చున్న రాష్ట్ర పక్షి పాలపిట్ట ఆకారంతో ముక్కుపుడకను రూపొందించారు. పాల పిట్ట ఈకలుగా నీలం రంగు రాళ్లు, చెట్టు కొమ్మలోని పచ్చని ఆకులుగా పచ్చ రాళ్లు పొదిగారు. -
‘అమ్మవారు..కమ్మ వారు ఎన్నికలప్పుడే గుర్తొస్తారు’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఎన్నికలు, ఉప ఎన్నికలు వస్తున్నాయంటే కొండమీద అమ్మవారు, కొండకింద కమ్మవారు గుర్తుకొస్తారని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా గుర్తుకురాని విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చినట్లని ప్రశ్నించారు. ముక్కుపుడక సమర్పించుకోవాలనుకుంటే జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ తల్లి, బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి, ఊరూరా పోచమ్మ తల్లులు ఉన్నారని అన్నారు. కేసీఆర్ విజయవాడకు వెళ్లేది అమ్మవారి మీద భక్తితో కాదని అక్కడి కమ్మ వారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ ఓట్లు రాల్చుకోవడానికేనని ఆరోపించారు. కొడంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సచివాలయంలో పలువురు అధికారులను కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. -
27న విజయవాడకు కేసీఆర్
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన ఖరారైంది. విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి ఈ నెల 27 న కేసీఆర్ విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారికి ముక్కు పుడకను సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మొక్కులు తీర్చుకుంటున్నారు. కేసీఆర్ ఇప్పటికే వరంగల్ భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి స్వర్ణ సాలిగ్రామమారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
స్వర్ణకవచంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు స్వర్ణకవచంతో భక్తులకు దర్శనమిస్తోంది. స్వర్ణకవచంలో కొలువుతీరిన అమ్మవారిని దర్శించుకోవడానికి భ క్తులు పెద్ద ఎత్తున బారులుతీరారు. ఇకనుంచి ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి స్వర్ణకవచంతో అలకంరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
మూడునాళ్ల ముచ్చటే..!
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమ్మవారి సొమ్ము వృథా అవుతోంది. అధికారుల ఆదేశాలు మూడు నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో నిత్యం జరిగే అన్నదానానికి ఉపయోగించే ప్లేట్స్ స్థానంలో కొత్తవి కొనుగోలు చేశారు. అయితే కొత్త ప్లేట్స్ కొనుగోలు చేసి నెల రోజులు కాకుండా అవి మూలకు చేరాయి. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేట్స్ నిరుపయోగంగా మారినా ఆలయ అధికారులకు పట్టడం లేదు. అమ్మవారి ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఇలా దుర్వినియోగం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి అన్నప్రసాదాన్ని గుండ్రంగా ఉండే ప్లేట్స్‌లో భక్తులకు వడ్డించే వారు. ఇందు కోసం దేవస్థానం వెయ్యి వరకు ప్లేట్స్ ఉపయోగించే వారు. గత నెల వరకు ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ఆజాద్ ప్లేట్స్‌ను మార్చాలని నిర్ణయించారు. రోజుకు ఒక ప్లేట్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించాలని పేర్కొంటూ 5 వేల ప్లేట్లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ప్లేట్లో కూరలు కలిసిపోకుండా ఉండే వాటిని కొనుగోలు చేయాలని అన్నదాన విభాగ అధికారులను ఆదేశించారు. దీంతో సుమారు రూ. 9 లక్షల వ్యయంతో రెండు వేల ప్లేట్లు, ట్రాలీలను కొనుగోలు చేశారు. గత నెల 26న కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్‌లో అన్నదానాన్ని ప్రారంభించారు. అయితే ఆలయ ఈవో మారినప్పుడల్లా వారు చేసిన నిర్ణయాలు మారుతాయనేది దుర్గగుడిపై ప్రచారంలో ఉంది. అదే తరహాలో ఈవోగా సూర్యకుమారి వచ్చిన వెంటనే కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్ స్థానంలో గతంలో ఉపయోగించిన రౌండ్ ప్లేట్స్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో రూ. 9 లక్షలతో కొనుగోలు ప్లేట్స్ నిరుపయోగంగా మారాయి. నీటి కొరత కూడా మరో కారణం కొండపై ఉన్న అమ్మవారి అన్నదానాన్ని అర్జున వీధిలోని శృంగేరీ పీఠానికి ఇటీవల మార్చారు. అయితే అక్కడ నీటి కొరత కూడా ప్లేట్స్ మార్చేందుకు మరో కారణంగా ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్లేట్స్ శుభ్రం చేసేందుకు ఎక్కువగా నీటి వినియోగించాల్సి వస్తుందంటున్నారు. -
కృష్ణమ్మ ఒడిలో వైభవంగా తెప్పోత్సవం
-
కన్నులపండువగా తెప్పోత్సవం
-
కన్నులపండువగా తెప్పోత్సవం
-
కన్నులపండువగా తెప్పోత్సవం
విజయవాడ: కృష్ణనదిపై కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దసరా శరన్నవరాత్రుల్లో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన చివరి రోజైన గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగిస్తాయి. భవానీ మాలలు ధరించిన భక్తులు వివిధ జిల్లాల నుంచి తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తసంద్రమైంది. ఇంకో రెండు రోజుల వరకు భవానీల సందడి నెలకొంటోంది. దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ శరన్నవరాత్రుల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
దుర్గమ్మ సేవలో ప్రముఖులు
ఇంద్రకీలాద్రి : కనకదుర్గమ్మను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఏపీ రైతు బజార్ సీఈవో ఎం.కె.సింగ్ కూడా కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలి కారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మను దర్శించుకు న్నారు. వారిని వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న ‘అంతా అక్కడే జరిగింది’ బృందం ఈ నెల 14న విడుదల కానున్న ‘అంతా అక్కడే జరిగింది’ సినిమా నటీనటులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్ర హీరో శరవన్, దర్శకుడు సతీష్‌తో పాటు నిర్మాత ఆదినారాయణ తదితరులు సినిమా హార్డ్ డిస్క్‌ను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. సినిమా ఘనవిజయం సాధించాలని అమ్మవారిని కోరామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు పరచండి
జనరిక్ మందుల అమ్మకానికి చర్యలు ఏపీ వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కనకదుర్గమ్మ నర్సీపట్నం టౌన్ : రాష్ట్రంలో 30 ఆస్పత్రుల స్థాయి పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఏపీ వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ పి.కనకదుర్గమ్మ తెలిపారు. క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా జిల్లాలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. చిన్న పిల్లల వార్డు ఆపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు ఉండి ఆస్పత్రిలో అవసరమైన పరికరాలు ఎందుకు కొనుగోలు చేయలేదని సూపరింటెండెంట్ దొరను నిలదీశారు. గర్భిణుల ప్రాథమిక తనిఖీ సమయంలో ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం ద్వారా మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని గైనకాలజిస్టులు డాక్టర్ సుధాశారద, విజయశాంతిలకు సూచించారు. ప్రసూతి విభాగంలో పుట్టిన వెంటనే బిడ్డలను సంరక్షించే విధానాలపై సరైన అవగాహన లేకపోవడాన్ని గుర్తించి, నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అన్ని కేసులును విశాఖపట్నం రిఫరల్ కాకుండా సాధ్యమైనంత వరకు వైద్యం అందించాలన్నారు. మత్తు డాక్టర్ కొరత ఉన్నప్పుడు ఆస్పత్రి ఆభివృద్ధి నిధులతో అవుట్‌సోర్సింగ్‌లో నియమించుకోవచ్చన్నారు. దంత, కళ్లు విభాగంలో అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆదేశించారు. అత్యవసర వార్డులో అత్యావసర మందులు, పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యానికి అవసరమైన వస్తువులను వినియోగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని పరుగులెత్తించారు. కాంట్రాక్టర్ అమర్నాథ్తో ఫోన్లో మాట్లాడి పారిశుద్ధ్యం మెరుగు విషయంలో పద్ధతి మార్చుకోకపోతే పని మానేయండని హెచ్చరించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 ఆస్పత్రుల వరకు స్థాయిని పెంచేందుకు సిద్ధం చేసిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద ఉందన్నారు. ఏరియా ఆస్పుత్రుల్లో నిపుణులైన వైద్యుల కొరత అధికంగా ఉండడంతో. పిహెచ్సీల్లో పని చేస్తున్న నిపుణులైన వైద్యులను తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. జనరిక్ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆమె వెంట జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఎంపీపీ సుకల రమణమ్మ ఉన్నారు. వైద్యుల ఖాళీలు భర్తీ అనకాపల్లి టౌన్ : రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న 200కు పైగా వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ పి. కనకదుర్గమ్మ తెలిపారు. ఇక్కడి ఎన్టీఆర్ వందపడకల ఆస్పత్రిని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం నిర్వహణపైన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నర్సీపట్నం, కోటవురట్ల ఆస్పత్రులను కూడా పరిశీలించామన్నారు. అనకాపల్లి ఆస్పత్రిలో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. 13 జిల్లాల్లో 118 వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయని, వీటిలో స్పెషలిస్టుల కొరత ఉందని, వీటి భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా హెల్త్ సొసైటీ నుంచి ఆస్పత్రికి రూ.10 లక్షల వరకు ఆస్పత్రి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ట్రెజరీ ద్వారా తమకు కూడా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. జనరల్ ట్రాన్స్ఫర్లు, హెల్త్ కార్డులు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఏపీ వైద్య విధాన పరిషత్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎగ్జిక్యుటివ్మెంబర్ బి.ఎ. రామ్మూర్తి, జిల్లా ప్రెసిడెంట్ ఎ. సింహాచలం, జనరల్ సెక్రటరీ బి.సోమేశ్వరరావులు ఉన్నారు. -
దుర్గమ్మ సన్నిధికి.. డాలర్లే డాలర్లు
సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపమైన కనకదుర్గమ్మ డాలర్ల కుంభవృష్టి కురిపిస్తోంది. అంతులేని మూలధనంతో బంగారుతల్లిగా అలరారుతున్న ఆ అమ్మకు విదేశీ భక్తులు అధికసంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటుండ టంతో కుప్పలుతెప్పలుగా ఫారన్ కరెన్సీ కానుకల రూపంలో వస్తోంది. గత రెండేళ్ల లెక్కలు చూసుకుంటే ప్రతినెలా జరిగే హుండీల లెక్కింపులో డాలర్లు అధిక సంఖ్యలో ఉంటున్నారుు. అంతేకాదు.. ఇటీవల దుర్గమ్మకు విదేశీ భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ : దుర్గమ్మను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే విదేశీ భక్తులు సమర్పించే డాలర్లు అమ్మవారి మూలధనానికి భారీగా చేరుతున్నాయి. ఏటా జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్స వాలతో పాటు శాకంబరీ, శ్రావణమాస ఉత్సవాల్లో విదేశీ భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి 20 రోజులకోసారి హుండీ ఆదాయం లెక్కిస్తుండగా, సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తే అందులో దాదాపు రూ.50వేలకుపైగా విదేశీ కరెన్సీనే ఉంటోంది. ఈ ఏడాదైతే హుండీల ద్వారా విదేశీ కరెన్సీ రూపంలో వస్తున్న ఆదాయం రికార్డుస్థాయికి చేరుకుంది. ఇలా అమ్మవారికి వచ్చిన విదేశీ కరెన్సీని బ్యాంకుల ద్వారా రూపాయల్లోకి మార్చి తిరిగా అమ్మవారి మూలధనానికే చేర్చుతున్నారు. అన్ని దేశాల నుంచి.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లి విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగరీత్యా స్థిరపడిన వారితో పాటు అమెరికా, కెనడా, సౌదీ, యూఏఈ, మలేషియా, బెహరిన్, ఈజిప్టు, ఓమన్, లిబ్రాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, మాల్దీవులు, ఉగాండా, ఇంగ్లండ్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. టూరిజంలో అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా స్థలపురాణం, అమ్మవారికి నిత్యం జరిగే పూజలు, అర్చనల గురించి తెలుసుకుంటూ..అమ్మవారి చిత్రపటాలను సైతం కొనుగోలు చేసి స్వస్థలాలకు తీసుకెళ్తున్నారు. విజయవాడను సీమాంధ్ర రాజధానిగా ప్రకటించడంతో పలు విదేశీ కంపెనీలు నగరంపై దృష్టి పెట్టాయి. అనేక కార్యకలాపాలతో పాటు టూరిజంను అభివృద్ధి చేసే అవకాశాలు ఉండటంతో విదేశీ భక్తుల సంఖ్య పెరగడంతో పాటు అమ్మవారి మూలధనానికి డాలర్లు మరిన్ని చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల్లో అధిక ఆదాయం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలోదేవస్థానానికి రూ.7.20 లక్షల ఆదాయం సమకూరగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి రూ.3.50 లక్షలకు పైబడి వచ్చింది. ఉత్సవాలతో పాటు పండుగ పర్వదినాలు ముందుండటంతో ఈ ఏడాది హుండీల ద్వారా భారీగానే విదేశీ కరెన్సీ వచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. విదేశీ విరాళాలు పెరిగాయ్.. దుర్గమ్మకు విదేశీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం విదేశాల నుంచి ఇంద్రకీలాద్రికి అధిక సంఖ్యలో వస్తున్నారు. దీనికితోడు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభంకావడంతో విదేశాల నుంచి అన్నదానానికి విరాళాలు రావడం, ప్రత్యేక పూజల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతోంది. రాష్ర్ట రాజధానిగాగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో విదేశీ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. - త్రినాథరావు, దుర్గగుడి ఈవో ఈ ఏడాది దుర్గమ్మకు సమకూరిన విదేశీ కరెన్సీ జనవరి యూఎస్ఏ డాలర్లు : 396 ఓమన్ : 500 బైసా కెనడా డాలర్లు : 145 సౌదీ అరేబియా : 173 రియాన్లు యూఏఈ : 150 ధీరమ్స్ లిబ్రాన్ : 9000 మిల్లీలివర్స్ మలేషియా : 23 ఆర్ఎం ఫిబ్రవరి యూఎస్ఏ డాలర్లు : 200 ఆస్ట్రేలియా : 120 డాలర్లు ఓమన్ : 61 రియాన్స్ 100 బైసా కతార్ : 701 రియాన్స్ యూఎస్ఈ : 120 ధీరమ్స్ మార్చి యూఎస్ఏ డాలర్లు : 291 ఓమన్ : 500 బైసా సింగపూర్ : 80 డాలర్లు ఇంగ్లండ్ : 40 పౌండ్లు సౌదీ అరేబియా : 152 రియాన్లు యూఏఈ : 720 ధీరమ్స్ ఉగాండా : 2000 షిలిగ్ ఏప్రిల్ యూఎస్ఏ డాలర్లు : 170 ఓమన్ : 2,500 బైసా యూఏఈ : 30 ధీరమ్స్ ఆస్ట్రేలియా : 320 డాలర్లు కత్తార్ : 120 రియాన్స్ మే యూఎస్ఏ డాలర్లు : 664 సౌదీ అరేబియా : 32 రియాన్లు యూఏఈ : 110 ధీరమ్స్ సౌదీ అరేబియా : 32 రియాన్స్ జూన్ యూఎస్ఏ డాలర్లు : 386 కత్తార్ రియాన్స్ : 177 కెనడా డాలర్లు : 170 సౌదీ అరేబియా : 115 రియాన్లు యూఏఈ : 200 ధీరమ్స్ సింగపూర్ : 78 డాలర్లు న్యూజిలాండ్ : 30 డాలర్లు జులై యూఎస్ఏ డాలర్లు : 570 ఆస్ట్రేలియా : 30 ఓమన్ : 500 బైసా సౌదీ అరేబియా : 32 రియాన్లు యూఏఈ : 530 ధీరమ్స్ ఆగస్టు యూఎస్ఏ డాలర్లు : 61 ఓమన్ : 100 బైసా బెహరైన్ : 10 దినార్లు ఆస్ట్రేలియా : 108 డాలర్లు సెప్టెంబర్ యూఎస్ఏ డాలర్లు : 472 కత్తార్ : 48 రియాన్స్ కెనడా డాలర్లు : 200 డాలర్లు యూఏఈ : 55 ధీరమ్స్