విజయవాడ: కృష్ణనదిపై కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దసరా శరన్నవరాత్రుల్లో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన చివరి రోజైన గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు.
గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగిస్తాయి. భవానీ మాలలు ధరించిన భక్తులు వివిధ జిల్లాల నుంచి తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తసంద్రమైంది. ఇంకో రెండు రోజుల వరకు భవానీల సందడి నెలకొంటోంది. దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ శరన్నవరాత్రుల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.