float
-
ఫ్లోట్ సీట్.. ఫీల్ గుడ్
ఆధునికతను అందిపుచ్చుకుంటున్న నగర యువత నూతనఆవిష్కరణలపై ఆసక్తి చూపుతోంది. సామాజిక, ఆరోగ్య స్పృహతో అత్యాధునిక సాధనాలు కనుగొంటోంది. నగర రోడ్లపై ప్రయాణంలో తమకు ఎదురైన సమస్యల పరిష్కారానికి శ్రమించిన సిటీ మిత్రత్రయం... సాఫీ ప్రయాణానికి ఫ్లోట్లు రూపొందించింది. నగరానికి చెందిన మాధవ్ సాయిరామ్ కొల్లి, విశ్వనాథ్ మల్లాది, సంతోష్‌కుమార్ సామల సూరత్‌లోని ఎన్ఐటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. అక్కడ స్నేహితులైన వీరు స్టార్టప్ ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. 2015లో చదువు పూర్తయ్యాక సిటీకి వచ్చి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరారు. అయితే సిటీ రోడ్లపై ప్రయాణం వారిని ఆలోచనలో పడేసింది. చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. 70 శాతం మంది ‘కంఫర్ట్’ జర్నీ చేయలేకపోతున్నారని వీరి అధ్యయనంలో తేలింది. దీనికి పరిష్కారం కనుగొనాలని ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ‘ఫీల్ గుడ్ ఇన్నోవేషన్’ స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. అనూహ్య స్పందన.. డ్రైవింగ్ సమయంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించేలా ‘ఫ్లోట్’లను రూపొందించారు వీరు. వీటిని కార్లు, బైకులలోని సీటుపై అమర్చుకుంటే హాయిగా ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు. ‘నగర రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే గంటలకొద్దీ నిరీక్షించాలి. సుదూర ప్రయాణం చేసే సందర్భాల్లో వెన్నునొప్పి సమస్యలు వస్తాయి. రక్తప్రసరణ జరగక తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటన్నింటి నుంచి గట్టెక్కించేందుకు అతి చౌక ధరకే ఫ్లోట్లు తయారు చేశామ’ని చెప్పారీ మిత్రులు. ‘ఇటీవల గుజరాత్లో జరిగిన ఐక్రియేట్ స్టార్టప్‌ల కార్యక్రమంలో నగరం నుంచి మేం ఒక్కరమే పాల్గొన్నాం. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మా ఐడియాకు మెచ్చుకున్నారు. మా ప్రొడక్ట్స్‌కు నగర వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 1500 ఆర్డర్లు వచ్చాయి. కావాల్సినవారు https://www.fueladream.com/ వెబ్సైట్లో సంప్రదించొచ్చు. పనిచేస్తుందిలా... ‘గాలి ప్రసరణ జరిగి రైడర్‌కు హాయిని కలిగించేంచేలా ప్యూర్ లెదర్‌తో తయారు చేసిన ఫ్లోట్ బ్రీతబుల్ మెషిన్లో ఎయిర్ ప్యాకెట్లు ఉండేలా చూశాం. ఇవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటంతో లోపల ఎయిర్ ప్యాకెట్లలో గాలి కదలాడుతుంటుంది. అవసరాన్ని బట్టి 30–70 శాతం మేర గాలి నింపుకొని బైక్, కార్లకు సీటుగా ఉపయోగించుకోవచ్చు. తొలుత 10వేల కిలోమీటర్లు పరీక్షలు చేశాం. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహకారాన్ని తీసుకున్నాం. సత్ఫలితాలు వచ్చాకే మార్కెట్లోకి వచ్చామ’ని వివరించారు. -
శోభాయమానం... తెప్పోత్సవం
ఆళ్లగడ్డ: భూదేవి, లక్ష్మీ సమేతుడైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం బుధవారం దిగువ అహోబిలంలోని కోనేరులో వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామి, అమ్మవారు సేద తీరేందుకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో కోనేటి వరకు తీసుకొచ్చారు. తెప్పలో స్వామివార్లను అధిష్టింపజేసి పీఠాధిపతి శ్రీరంగనా«థ యతీంత్ర మహాదేశికన్, ఆలయ అర్చకులు, వేదపండితల పూజలు నినర్వహించారు. సుమారు గంటపాటు ఉత్సవం జరిగింది. -
వైభవం.. ఆదిదంపతుల జలవిహారం
హంసవాహనంపై ఆదిదంపతుల కృష్ణానదీ విహారం ఇంద్రకీలాద్రి : ఆదిదంపతులైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లకు హంస వాహనసేవ కనుల పండువగా జరిగింది. హంసవాహనంపై ఆశీనులైన ఆదిదంపతులు కృష్ణానదిపై నుంచి వచ్చే చల్లటి గాలులను ఆస్వాదిస్తూ విహరించారు. హంస వాహనంపై ఆశీనులైన ఆదిదంపతులకు ఆలయ ఈవో నర్సింగరావు దంపతులు పూజాకార్యక్రమాలను నిర్వహించారు. తెప్పోత్సవంగా పిలిచే హంసవాహన సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామివార్లు మూడు ప్రదక్షణలు జల విహారం చేశారు. విద్యుత్ దీపకాంతులతో దైదీప్యమానంగా వెలిగిపోతున్న హంసవాహనంపై నదీవిహారం చేస్తున్న దుర్గామల్లేశ్వరస్వామివార్లను తిలకించేందుకు అశేష భక్తజనం దుర్గాఘాట్‌కు తరలివచ్చారు. జై.. భవానీ.. జై జై భవానీ నామస్మరణతో దుర్గాఘాట్ మార్మోగింది. దసరా ఉత్సవాల్లో 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన దుర్గమ్మ పదో రోజు గురువారం శ్రీరాజరాజేశ్వరిదేవియై శాంతిమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం నుంచి అమ్మవార్లతో పాటు అయ్యవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బేతాళ నృత్యాలు, కోలాటాలు.. కళాకారులు విన్యాసాలతో అమ్మవారి ఊరేగింపు కనుల పండవగా సాగింది. తెప్పోత్సవాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఏ, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, పలువురు పోలీసు అధికారులు, దేవస్థాన ఈఈ కోటేశ్వరరావుతోపాటు ఆలయ అర్చకులు తిలకించారు. నదీ విహారం అనంతరం ఉత్సవమూర్తులను బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు వద్ద వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ హౌస్ అఫీసర్ వెంకటేశ్వర్లు దంపతులచే శమీపూజ, పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. -
కన్నులపండువగా తెప్పోత్సవం
విజయవాడ: కృష్ణనదిపై కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దసరా శరన్నవరాత్రుల్లో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన చివరి రోజైన గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగిస్తాయి. భవానీ మాలలు ధరించిన భక్తులు వివిధ జిల్లాల నుంచి తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తసంద్రమైంది. ఇంకో రెండు రోజుల వరకు భవానీల సందడి నెలకొంటోంది. దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ శరన్నవరాత్రుల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
పుష్కరిణిలో పడి తాత మృతి.. మనుమడి గల్లంతు
వరదయ్యపాళెం: మండలంలో నిర్వహించిన తెప్పోత్సవంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో బాలుడు గల్లంతయ్యాడు. మండలంలోని కళత్తూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో మంగళవారం రాత్రి తెప్పోత్సవాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పుష్కరిణిలో తెప్పపై స్వామి అమ్మవార్లను ఉంచి మూడు మార్లు విహరిస్తారు. మూడోసారి విహరించే ముందు రాత్రి 8.45 గంటలకు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ తెప్పపైకి వచ్చారు. అంతకుముందే దాదాపు 20 మంది తెప్పపై ఉన్నారు. ఆయనతో పాటు మరో వందమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెప్పపైకి ఎక్కారు. బరువుకు ఎక్కువ కావడంతో తెప్ప బోల్తాపడింది. దీంతో ఉత్సవమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే, నాయకులు కింద పడిపోయారు. ఈ సమయంలో సూళ్లూరుపేటకు చెందిన సుబ్రమణ్యం(65) నీటిలో పడి మృతి చెందాడు. అతని మనుమడు వంశీ(11) పుష్కరిణిలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.