
దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నది సహా దేశంలోని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయనున్నారు. ఇందులో భాగంగా మహేశ్ బాబు ముందుగా కృష్ణ అస్థికలను నేడు నదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేసేందుకు సోమవారం మహేశ్ బాబు కుటుంబంతో కలిసి విజయవాడకు చేరుకున్నారు.
చదవండి: నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్
తాజాగా ఆయన కృష్ణానది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్ద అస్థికలను నిమజ్జనం చేశారు. కృష్ణానదిలో కృష్ట అస్తికలు కలిపి, శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించారు మహేశ్ బాబు. ఈ కార్యక్రమంలో మహేశ్‌తో పాటు ఆయన బావ ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ సోదరుడు శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx
— Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022