27న విజయవాడకు కేసీఆర్
27న విజయవాడకు కేసీఆర్
Published Wed, Sep 6 2017 2:19 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర‍్యటన ఖరారైంది. విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి ఈ నెల 27 న కేసీఆర్ విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారికి ముక్కు పుడకను సమర్పించనున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మొక్కులు తీర్చుకుంటున్నారు. కేసీఆర్ ఇప్పటికే వరంగల్ భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి స్వర్ణ సాలిగ్రామమారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Advertisement
Advertisement